pizza
Ratham first look launch
`ర‌థం` ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌
You are at idlebrain.com > News > Functions
Follow Us


20 August 2018
Hyderabad

వినోద్ స‌మ‌ర్ప‌ణ‌లో రాజ‌గురు ఫిలింస్ బ్యాన‌ర్‌పై గీత్ ఆనంద్‌,చాందిన భ‌గ్వానాని హీరో హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం `ర‌థం`. చంద్ర‌శేఖ‌ర్ కానూరి ద‌ర్శ‌కుడు. రాజా దార‌పునేని నిర్మాత‌. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను న‌వీన్ ఎర్నేని, మోష‌న్ పోస్ట‌ర్‌ను బి.గోపాల్, సాంగ్ టీజ‌ర్‌ను ఆర్‌.పి. పట్నాయ‌క్‌ విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా సోమ‌వారం హైదరాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన పాత్రికేయుల స‌మావేశంలో...

రాజా దార‌పునేని మాట్లాడ‌తూ - ``అంద‌రూ కొత్తేవాళ్ల‌తో చేసిన చిత్ర‌మిది. ఈ సినిమాకు నాకొక లెర్నింగ్ క‌ర్వ్‌గా అనుకుంటున్నాను. అయితే ఈ సినిమా ఈ ఏడాది బ్లాక్‌బ‌స్ట‌ర్ అవుతుంద‌ని న‌మ్మ‌కంగా చెప్ప‌గ‌లను. సెప్టెంబ‌ర్ రెండోవారం త‌ర్వాత సినిమాను విడుద‌ల చేయాల‌నుకుంటున్నాం. ఇక ద‌ర్శ‌కుడు చంద్రశేఖ‌ర్ మంచి హార్డ్‌వ‌ర్క‌ర్‌. రూపాయ‌కి ప‌ది రూపాయ‌ల అవుట్‌పుట్ ఇచ్చేవ్య‌క్తి. భ‌విష్య‌త్‌లో పెద్ద డైరెక్ట‌ర్ అవుతాడు. హీరో గీత్ ఆనంద్ రొమాంటిక్, యాక్ష‌న్ హీరోగా ఎదుగుతాడు. సుకుమార్ పమ్మీ అద్భుత‌మైన సంగీతాన్ని అందించాడు. హీరోయిన్ మంచి ఎక్స్‌ప్రెసివ్‌. మంచి హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంటుంది`` అన్నారు.

చిత్ర స‌మ‌ర్ప‌కులు వినోద్ మాట్లాడుతూ - ``న‌వీన్ ఎర్నేని, బి.గోపాల్‌, ఆర్‌.పి.ప‌ట్నాయ‌క్ అంద‌రికీ థాంక్స్‌. సినిమాపై మంచి ఎక్స్‌పెక్టేష‌న్స్‌తో ఉన్నాం. సినిమాను ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను. ఎంటైర్ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్‌`` అన్నారు.

ఆర్‌.పి.ప‌ట్నాయ‌క్ మాట్లాడుతూ - ``నిర్మాత రాజాతో మంచి ప‌రిచ‌యం ఉంది. సాధార‌ణంగా త‌ను ఏ ప‌నైనా చేసేట‌ప్పుడు నాకు చెబుతుంటాడు. కానీ.. ఈ సినిమా విష‌యంలో నాకు ఏమీ చెప్ప‌లేదు. సినిమాపై త‌న‌కు చాలా ఆస‌క్తి. త‌నకు ఇండ‌స్ట్రీలో మంచి ప‌రిచ‌యాలున్నాయి. ఈ సినిమా లుక్ చూస్తుంటే ఆర్.ఎక్స్ 100 సినిమాలా అనిపిస్తుంది. ఇది కూడా ఆ సినిమాలా క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ అవుతుంద‌ని భావిస్తున్నాను. ఎంటైర్ యూనిట్‌కు అభినంద‌న‌లు`` అన్నారు.

న‌వీన్ ఎర్నేని మాట్లాడుతూ - ``సినిమా కంటెంట్ ఉంటే చాలు. పెద్ద, చిన్న సినిమాల‌నీ కాకుండా అన్ని బాగా ఆడుతున్నాయి. ముఖ్యంగా గ‌త ఏడాది నుండి చిన్న సినిమాల‌కు మంచి ఆద‌ర‌ణ దొరుకుతుంది. ఆ కోవ‌లో ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంద‌ని భావిస్తున్నాం`` అన్నారు.

బి.గోపాల్ మాట్లాడుతూ - ``ర‌థం ఫ‌స్ట్‌లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌, సాంగ్ టీజ‌ర్ అన్ని బావున్నాయి. ఆర్‌.పిగారు ఈ సినిమాను సూప‌ర్‌హిట్ సినిమాతో పోల్చారు. కాబ‌ట్టి ఆ సినిమాలాగానే ఈ సినిమా కూడా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను. ఎంటైర్ యూనిట్‌కు అభినంద‌న‌లు`` అన్నారు.

హీరో గీత్ ఆనంద్ మాట్లాడుతూ - ``ఈ సినిమా రిలీజ్ కోసం చాలా ఎగ్జ‌యిటెడ్‌గా వెయిట్ చేస్తున్నాను. సినిమా అంటే ప్యాష‌న్ ఉన్న టీమ్‌తో ప‌నిచేశాను. చంద్ర‌శేఖ‌ర్‌గారు క‌థ చెప్ప‌గానే బాగా న‌చ్చింది. ఆయ‌న సినిమాను కూడా చ‌క్క‌గా తెరెక్క‌కించారు. సునీల్ సినిమాటోగ్ర‌ఫీ.. సుకుమార్ ప‌మ్మీ సంగీతం సినిమాకు పెద్ద ఎసెట్ అవుతుంది. హై యాక్ష‌న్ వోల్టేజ్ ల‌వ్‌స్టోరి`` అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో చిత్ర యూనిట్ స‌భ్యులు పాల్గొన్నారు.

గీత్ ఆనంద్‌, చాందిని భ‌గ్వానాని హీరో హీరోయిన్‌గా న‌రేన్‌, రాజ్ మాదిరాజ్‌, విశ్వేంద‌ర్ రెడ్డి, ప్ర‌మోదిని, మిర్చి మాధ‌వి, అభి త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి కెమెరా: సునీల్ ముత్యాల‌, మ్యూజిక్‌: సుకుమార్ ప‌మ్మీ, ఎడిట‌ర్‌: నాగేశ్వ‌ర్ రెడ్డి, ఆర్ట్‌: వ‌ర్మ‌, స్టంట్స్‌: దేవ‌రాజ్‌, డాన్స్‌: చందురామ్‌, ఎగ్జ్‌క్యూటివ్ ప్రొడ్యూసర్‌: నివా శ‌ర్మ‌, నిర్మాత‌: రాజా దార‌పునేని, ద‌ర్శ‌క‌త్వం: చ‌ంద్ర శేఖ‌ర్ కానూరి.


 

Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved