pizza
Saakshyam motion poster launch
`సాక్ష్యం` మోష‌న్ పోస్ట‌ర్ లాంచ్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

18 October 2017
Hyderabad

శ్రీ అభిషేక్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై రూపొందుతున్న చిత్రం `సాక్ష్యం`. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, పూజా హెగ్డే జంట‌గా న‌టించారు. శ్రీవాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ బుధ‌వారం హైద‌రాబాద్‌లో విడుద‌లైంది.

పూజా హెగ్డే మాట్లాడుతూ ``సాక్ష్యం పోస్ట‌ర్ చాలా బావుంది. ఇంటెన్సిటీ ఉంది. డి.జె.లో నేను చేసిన పాత్ర‌కూ, ఇందులోని పాత్ర‌కూ చాలా వైవిధ్యం ఉంటుంది`` అని అన్నారు.

సాయిమాధ‌వ్ బుర్రా మాట్లాడుతూ ``సాక్ష్యం చాలా గొప్ప సినిమా. మ‌న భార‌తీయ‌త‌లో ఉన్న అన్ని అంశాలూ ఇందులో ఉంటాయి. ప్ర‌తి సన్నివేశం ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. హీరోని నెక్స్ట్ లెవ‌ల్‌కి తీసుకెళ్లే సినిమా అవుతుంది`` అని చెప్పారు.

శ్రీవాస్ మాట్లాడుతూ ``మాట‌ల క‌న్నా ఒక పిక్చ‌ర్ ఇంపాక్ట్ ఎక్కువ‌గా ఉంటుంది. నేను పంచ‌భూతాల గురించి మోష‌న్ పోస్ట‌ర్‌లో చెప్పాను. బాహ్యంగా ఉన్న ప‌లు అంశాల గురించి మ‌నం మాట్లాడుతూనే ఉంటాం. కానీ ఇప్పుడు అంత‌ర్లీనంగా ఉన్న ఒక విష‌యం గురించి ఈ సినిమాలో చెప్పాల‌నుకున్నాను. మ‌న‌స్ఫూర్తిగా రాసుకున్న సినిమా ఇది`` అని అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ ``రొటీన్‌కి డిఫ‌రెంట్‌గా ఉండే సినిమా ఇది. మంచి స్క్రిప్ట్`` అని చెప్పారు.

హీరో మాట్లాడుతూ ``ఈ సినిమా క‌థ‌ను ఫిబ్ర‌వ‌రిలో విన్నాను. అద్భుత‌మైన క‌థ‌. ఇలాంటి క‌థ‌ల‌ను మ‌న ద‌ర్శ‌కులు కూడా ఆలోచిస్తారా? అన్న రీతిలో ఉంటుంది`` అని తెలిపారు.

జ‌గ‌ప‌తిబాబు, శ‌ర‌త్ కుమార్‌, మీనా, వెన్నెల కిశోర్‌, ర‌వి కిష‌న్‌, అశుతోష్ రానా, మ‌ధు గురుస్వామి, లావ‌ణ్య జ‌య‌ప్ర‌కాశ్, ప‌విత్రా లోకేశ్‌, బ్ర‌హ్మాజీ, పోసాని కృష్ణ‌ముర‌ళి, కాశీ విశ్వ‌నాథ్‌, ఝాన్సీ కీల‌క పాత్ర‌ధారులు. ఈ సినిమాకు ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: శ్రీవాస్‌, స‌మ‌ర్ప‌ణ‌: దేవాంశ్ నామా, నిర్మాత‌: అభిషేక్ నామా, స‌హ నిర్మాత: వివేక్ కూచిభొట్ల‌, కెమెరా: ఆర్థ‌ర్‌.ఎ.విల్స‌న్‌, మాట‌లు: సాయిమాధ‌వ్ బుర్రా, ఆర్ట్: ఎ.ఎస్‌.ప్ర‌కాశ్‌, ఎడిటింగ్‌: కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు, సంగీతం: శ‌క్తికాంత్ కార్తిక్‌, పాట‌లు: అనంత శ్రీరామ్‌, యాక్ష‌న్‌: పీట‌ర్ హెయిన్‌.


Photo Gallery (photos by G Narasaiah)

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved