pizza
A2A movie (#AmeerpetToAmerica) Bonalu song Flash Mob
బోనాల పాటను "ఫ్లాష్ మోబ్" ద్వారా రిలీస్ చేసిన "అమీర్ పేట్ టు అమెరికా (A to A)" మూవీ టీమ్.
You are at idlebrain.com > News > Functions
 
Follow Us

30 December 2017
Hyderaba
d

అమ్మను మించిన దైవమే లేదు అనే మాటను బలంగా నమ్మిన ఎన్ ఆర్ ఐ, రామ్మోహన్ కొమండూరి తన తల్లి రాధ పేరు మీద రాధా మీడియా ఇన్‌కార్పోరేషన్ ని డాలస్, అమెరికాలో స్ధాపించారు. తన తల్లి చేతుల మీదుగా ప్రారంభించిన చిత్రం ఎ టు ఎ,అమీర్ పేట్ టు అమెరికా. శ్రీమతి స్వప్న కొమండూరి సమర్పణలో మదన్ కొమండూరి, పద్మజ కొమండూరి నిర్మించగా భానుకిరణ్ చల్లా దర్శకత్వంలో, అరుణ్ ఐకెసి, జిఎల్ బాబు డిఓపీలుగా, కార్తీక్ కొడకండ్ల సంగీతంతో, ప్రవీణ్ పూడి ఎడిటర్ గా రూపొందిన ఏ టు ఏ చిత్రానికి కర్త, కర్మ, క్రియ రామ్మోహన్ కొమండూరి. ఇంత వరకు ఏ చిత్రానికీ లేని విధంగా ఈ కర్త, కర్మ, క్రియ అనే పదప్రయోగానికి కారణం .. ప్రీ ప్రొడక్షన్ నుండి పోస్ట్ ప్రొడక్షన్ వరకు అన్ని క్రాప్ట్స్ లో తన సహాయ సహాకారాలను అందిస్తూ, పూర్తి ఇన్‌వాల్వ్‌మెంట్ తో ఆయన ఈ ఎ టు ఎ చిత్రాన్ని రూపొందించారు.

ఇనార్బిట్ మాల్ , ప్రసాద్ ఐమాక్స్, హైదరాబాద్ సెంట్రల్ మాల్ లో ఈ చిత్రంలో నుండి బోనాల పాటను, పోతరాజులతో తెలంగాణా సంస్కృతి ఉట్టిపడేట్టుగా మొదటి సారిగా ఫ్లాష్ మాబ్ లాంటి వినూత్నమైన కార్యక్రమంతో ఆవిష్కరించారు. ఇలాగే కొత్తదనంతో ప్రతి వారం రెండు పాటలు విడుదల చేస్తూ అతి త్వరలో జేఆర్ సి కన్వెన్షన్ హాలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత తెలిపారు. వీలయినంత త్వరలో చిత్రాన్ని విడుదల చేస్తామని చెప్పారు.

అమీర్ పేట్ నుండి ఎన్నో ఆశలతో అమెరికా లో అడుగుపెట్టాలనుకునే యువత ఆలోచనలు, ఆశయాలు ఎలాంటివి? అమెరికా వెళ్లడానికి పడిన చిత్రవిచిత్రమైన తిప్పలు ఎలాంటివి? బ్రహ్మానందం, వేణు మాధవ్, వేణుగోపాల్, వైవా హర్షలాంటి కమెడియన్స్ తో కామెడీ పండిస్తూ, నవ్విస్తూ, తనికెళ్ల భరణి, రాజేశ్వరి, సమ్మెట గాంధీ, తేజస్, వంశీ కోడూరి, వంశీ కృష్ణ వంటి నటులతో ఆలోచింపజేసే సీన్స్ తో, అందమైన అమ్మాయిలు మేఘనా, పల్లవీ దొర, సాషా సింగ్ లతో యూత్ ఫుల్ లవ్ అండ్ కామెడీ , రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గా ముస్తాబవుతున్న చిత్రం ఎ టు ఎ. అద్భుతమైన పాటలతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా త్వరలో వస్తున్న చిత్రం ఈ ఎ టు ఎ అని దర్శక నిర్మాతలు తెలిపారు.

దాదాపు ఎనభైశాతానికి పైగా అమెరికాలోనే షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రంలో ఇతర పాత్రల్లో నరేష్ సుంకిరెడ్డి, మాధవి సుంకిరెడ్డి, రఘు మర్రిపెద్ది, మణి చందన, రజని, మధు సూదన్ (లయన్ కింగ్ టింకు), యలమంద, సంతోష్, రవితేజ, వెంకట్ బీరం, జీవన్, రమ్య, మహిత, ఆదిత్య, రవితేజ, సుచరిత, శ్రవణ్, భార్గవి వంటివారు నటించారు. ఈ చిత్రానికి మేకప్ మార్గో, సుస్మిత (అమెరికా).

 


 
Photo Gallery (photos by G Narasaiah)
 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved