pizza
Jai Lava Kusa Jayotsavam
'జై లవకుశ' జయోత్సవం
You are at idlebrain.com > News > Functions
Follow Us

25 September 2017
Hyderaba
d

టెంపర్‌, నాన్నకు ప్రేమతో, జనతాగ్యారేజ్‌ వంటి హ్యాట్రిక్‌ బ్లాక్‌బస్టర్స్‌తో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై కె.ఎస్‌.రవీంద్ర(బాబి) దర్శకత్వంలో నందమూరి కల్యాణ్‌ రామ్‌ నిర్మించిన చిత్రం 'జై లవకుశ'. ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో నివేదా థామస్‌, రాశిఖన్నా హీరోయిన్స్‌గా నటించారు. ఈ సినిమా సెప్టెంబర్‌ 21న విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో 'జై లవకుశ' విజయోత్సవ వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, నందమూరి కల్యాణ్‌రామ్‌, దిల్‌రాజు, డైరెక్టర్‌ బాబీ, రామ్‌లక్ష్మణ్‌, చంద్రబోస్‌, రామజోగయ్యశాస్త్రి

పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ - ''బాడీలో జ్వరం ఏ రేంజ్‌లో ఉందో చెప్పడానికి థర్మామీటర్‌ ఉంటుంది. అలాగే పాలలోని చిక్కదనం చెప్పడానికి లాక్టోమీటర్‌ ఉంది. రక్తంలో షుగర్‌ లెవల్స్‌ చెప్పడానికి గ్లుకో మీటర్‌ ఉంది. ఎన్టీఆర్‌కి ఏ రేంజ్‌లో యాక్టింగ్‌ వచ్చు?, అతనిలో ఏ రేంజ్‌లో యాక్టింగ్‌ దమ్ముంది అని చెప్పడానికి ఏదైనా మీటర్‌ ఉందా? అని అంటే మీటర్‌ ఉంది. అదే ఈస్తటిక్‌ మీటర్‌. అంటే తెలుగులో రసహృదయం. అది ఉన్నవాడికి ఎన్టీఆర్‌ ఏ రేంజ్‌లో ఉన్నాడో తెలుసు. పైకి ఐదున్నర అడుగులే కనపడుతున్నా, భూమిలోకి నటన పరంగా వంద అడుగులున్నాడు. పాతాళం ఆకాశం వరకు పుట్టినవాడు ఎన్టీఆర్‌. తనతో టెంపర్‌ తర్వాత జైలవకుశలో చేశాను. తను నటిస్తుంటే మెర్క్యురీలో పక్కన ఎవడినీ యాక్ట్‌ చేయనీయడు. టెంపర్‌లో ఎన్టీఆర్‌కు ఎంత పేరొచ్చిందో తెలుసు. ఆ సినిమాకు శివుడి ముందు నందిలా నాకు కూడా పెరొచ్చింది. ఇక జై లవకుశ విషయానికి వస్తే, ముగ్గురు ఎన్టీఆర్‌లు యాక్ట్‌ చేస్తే మరొకరికి ఖాళీ ఉంటుందా? ఉండదు. అయితే నాకు ఒక చిన్న ప్లేస్‌ దొరికింది. సీనియర్‌ ఎన్టీఆర్‌గారి దానవీర శూరకర్ణ సినిమా చూశాను. అందులో విలన్‌గా ఎన్టీఆర్‌గారు వేసిన ధుర్యోధనుడు పాత్ర కోసం సినిమా పెద్ద హిట్‌ అయ్యింది. ఇప్పుడు జై లవకుశలో కూడా జై పాత్ర విలన్‌పాత్ర. ఈ పాత్రను చూడటానికే జనం థియేటర్స్‌కు వస్తున్నారు. ఇంతంటే గొప్పగా ఈ సినిమా గురించి నేనేం చెప్పలేను'' అన్నారు.

కోనవెంకట్‌ మాట్లాడుతూ - ''ప్రతి సినిమా ప్రేక్షకులు ఈవాళ జై క్యారెక్టర్‌ను ఇష్టపడ్డారు. ఈ సినిమాకు నేను, చక్రి స్క్రీన్‌ప్లే రాయలేదు. ఆ భగవంతుడే స్క్రీన్‌ప్లే రాశాడు. ముగ్గురు అన్నదమ్ములతో ఒక కథను పుట్టించింది ఆ దేవుడే. అన్నదమ్ముల అనుబంధం ఉన్న ఈ సినిమాను చేయడానికి కూడా ఓ అన్నదమ్ములే అవసరం అని భావించి దేవుడు కల్యాణ్‌రామ్‌ చేతికే ఈ సినిమాను వెళ్లేలా చేసింది కూడా దేవుడే. ప్రతి విషయంలో ఆ దైవ నిర్ణయమే మమ్మల్ని నడిపించింది. ఈ సినిమా సక్సెస్‌ తర్వాత చాలా మంది చాలా రకాలైన మెసేజ్‌లు పంపుతున్నారు. తారక్‌ పుట్టిన జనరేషన్‌లో మేము కూడా పుట్టామని చాలా మంది మాకు మెసేజ్‌లు పెడుతుంటే నాకు కళ్లలో నీళ్లు తిరిగాయి. ఎందుకంటే తారక్‌ ప్రతిభకు, అతను పడ్డ కష్టం అలాంటింది. ఎన్టీఆర్‌ నటనకు మీటర్‌ ఏదైనా ఉందంటే అది జైలవకుశ. ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్‌ రైటర్స్‌, డైరెక్ట్‌ర్స్‌కు ఛాలెంజ్‌ విసిరారు. ఎన్టీఆర్‌ కేలిబర్‌, కష్టాన్ని ప్రేక్షకులు గుర్తించారు. అందుకు నిదర్శనమే ఈ సినిమా సక్సెస్‌'' అన్నారు.

ఛోటా కె.నాయుడు మాట్లాడుతూ - ''ఈరోజు కోసం అందరం ఎదురుచూశాం. ఈ రోజును ముందుగానే ఊహించిన వ్యక్తి తారక్‌. అన్నా ఈ సినిమా అద్భుతం అవుతుంది. మనం ఒక టార్గెట్‌ చేసుకుని వెళుతున్నాం. ఏ విషయంలో టెన్షన్‌ పడొద్దని అనేవాడు. ఒక సినిమాటోగ్రాఫర్‌ నేను 70 సినిమాల వరకు చేశాను. డబుల్‌ రోల్‌, త్రిబుల్‌ చేసేటప్పుడు ఎలా చేస్తారోనని మేకింగ్‌ వీడియోలు చూస్తుంటాను. అయితే ఈ సినిమా సమయంలో ఆ మేకింగ్‌లన్నీ మరచిపోయాను. అందుకు ఉదాహరణే స్టేజ్‌ డ్రామాసీన్‌. ఆ సీన్‌ను చూసినప్పుడల్లా నాకు ముగ్గురు ఎన్టీఆర్‌లు కాదు, ముగ్గురు నటులు నటించారు అనేలా యాక్ట్‌ చేశాడు. తనలో ఒక ఇమెన్స్‌ పవర్‌ ఉంది. దాన్ని మనం నేర్చుకోవాలనిపించింది. మాకు పెద్ద ఎన్టీఆర్‌ను చూడాలని ఉందని చాలా మంది ఫోన్‌ చేశారు. నా కెరీర్‌ చివరి వరకు చెప్పుకునే గొప్ప సినిమా ఇది'' అన్నారు.

దిల్‌రాజు మాట్లాడుతూ - ''ఎన్టీఆర్‌ హీరోగా స్టార్ట్‌ అయ్యి పద్దేనిమిదేళ్లవుతుంది. తను హీరోగా ఎన్నో ఫెయిల్యూర్స్‌, సక్సెస్‌లు, బ్లాక్‌బస్టర్‌లు చూశాడు. అయితే, తన గత నాలుగు చిత్రాలుగా తన కెరీర్‌ను మాడిఫై చేసి టెంపర్‌ సినిమా చేశాడు. తర్వాత నాన్నకుప్రేమతో సినిమా చేశాడు. జనతాగ్యారేజ్‌ కమర్షియల్‌ సినిమా తర్వాత దాన్ని మించిన సక్సెస్‌ను జైలవకుశతో అందుకున్నాడు. ఒక హీరోగా ఎన్టీఆర్‌ సినిమా, సినిమాకి పెరుగుతున్నాడు. ఎన్టీఆర్‌ పెర్ఫామెన్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పుట్టినప్పటి నుండి తను మంచి ఆర్టిస్ట్‌. పెద్దాయన రక్తం నుండి తనకు నటన వచ్చింది. జైలవకుశ చిత్రంలో మూడు పాత్రలను తను ఎలా చేయాలో ముందుగానే ప్లాన్‌ చేసుకున్న విధానం మనకు తెరపై కనపడుతుంది. జై పాత్ర అందరినీ మెస్మరైజ్‌ చేస్తుంది. జై పాత్ర ద్వారా తారక్‌ తన కెరీర్‌లో బెస్ట్‌ పెర్ఫామెన్స్‌ కానీ, బెస్ట్‌ ఫిలిం కానీ ఇవ్వగలిగాడు. కల్యాణ్‌రామ్‌గారు తమ్ముడితో ఓ సూపర్‌హిట్‌ చేశాడు. జనతాగ్యారేజ్‌ మొదటి నాలుగు రోజుల్లో 15 కోట్ల 60 లక్షలు గ్రాస్‌ చేస్తే, ఈ సినిమా నాలుగు రోజుల్లో 18 కోట్ల 60 లక్షల గ్రాస్‌ను కలెక్ట్‌ చేసింది. ఎన్టీఆర్‌ కెరీర్‌లోనే హయ్యస్ట్‌ గ్రాసర్‌గా ఈ సినిమా నిలవబోతోంది. ఆల్‌టైమ్‌గా త్వరలోనే ఇది వంద కోట్ల క్లబ్‌లో చేరనుంది'' అన్నారు.

దర్శకుడు కె.ఎస్‌.బాబీ మాట్లాడుతూ - ''ఈ సినిమా తెరపైకి వచ్చి ఇంత అప్రిసియేషన్‌ వస్తుందంటే ఏకైక కారణం తారక్‌గారే. ఆయన లేకపోతే ఈ సినిమా లేదు. ఆటకపైనే ఉండుండేది. తారక్‌గారు లేకుంటే ఇంత మంచి రెస్పెక్ట్‌ వచ్చుండే సినిమా చేసుండేవాడినే కాదు. జనంలో నాకు రెస్పెక్ట్‌ కనపడుతుంది. మా జనరేషన్‌లో తారక్‌గారు పుట్టడం మా అదృష్టం. మా భార్య రీసెంట్‌గా 'సెవన్‌ వండర్స్‌లో ఒక వండర్‌ చూపిస్తావా అని అడిగింది'. నేను తనతో 'నేను రోజూ సెట్‌లో ఎనిమిదో వండర్‌ చూస్తున్నా' అని చెప్పేవాడిని. నేను కథను రాసుకున్నాను. కానీ దాన్ని తెరపై పండించింది మాత్రం తారక్‌గారే. ఈ సినిమా విషయంలో హరిగారికే ముందుగా థాంక్స్‌ చెప్పాలి. గబ్బర్‌ తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తున్న తరుణంలో హరిగారిని కలిసి ఇరవై నిమిషా పాటు ఈ కథ చెప్పాను. తర్వాత కల్యాణ్‌రామ్‌గారికి థాంక్స్‌. చంటిగారు, అద్వైత స్టూడియోస్‌, కోన, చక్రి సహా అందరికీ థాంక్స్‌. ఈ సినిమా తర్వాత నా కళ్లు నెత్తికెక్కవు కానీ, నేను జై లవకుశ చేశానని ధైర్యంగా చెబుతాను'' అన్నారు.

నందమూరి కల్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ - ''తెలుగు రాష్ట్రాల్లోని తెలుగు ప్రేక్షకులకే కాదు, ఓవర్‌సీస్‌లోని ప్రేక్షకులకు కూడా థాంక్స్‌. ఎందుకంటే నా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ను పెద్ద సక్సెస్‌ చేశారు. ఈ బ్యానర్‌ పెట్టిన తర్వాత నేనే హీరోగా చేస్తూ వచ్చాను. ఒక మంచి సినిమా తీయాలనే ప్రయత్నంలో నా జర్నీ సాగింది. ఎన్ని సినిమాలు చేసిన నాకు ఎప్పుడూ టెన్షన్‌ అనిపించలేదు. కానీ తమ్ముడితో సినిమా చేస్తున్నప్పుడు టెన్షన్‌గా అనిపించింది. ఎందుకంటే తను వరుస సినిమాల సక్సెస్‌లో ఉన్నాడు. తనతో ప్రెస్టీజియస్‌ మూవీ చేయాలని అనుకున్నాను. సినిమాకు ఓ స్టాండర్డ్‌ ఉండాలని అనుకున్నాను. ఆస్టాండర్డ్‌ని ఈ సినిమా ద్వారా తారక్‌ చూపించాడు. నా తమ్ముడికి దిష్టి పెట్టకూడదు కానీ, తను నిజంగా చాలా బాగా చేశాడు. తను తప్పించి ఈ క్యారెక్టర్‌ను మరెవరూ చేయలేరని థియేట్రికల్‌ ట్రైలర్‌ రోజునే చెప్పాను. తారక్‌తో పాటు అందరూ బాగా కష్టపడ్డారు. అద్వైత టీమ్‌కి, ఛోటా, దేవిశ్రీ, కోన, చక్రి, చంద్రబోస్‌, రామజోగయ్యశాస్త్రి సహా అందరికీ థాంక్స్‌. అందరూ తారక్‌కు సపోర్ట్‌గా నిలబడ్డారు. తారక్‌ పెర్ఫామెన్స్‌ ఎక్స్‌ట్రార్డినరీ. అదే సినిమాను నిలబెట్టింది. తాతయ్య తనకు మరిన్ని మంచి పాత్రలు వచ్చేలా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ప్రతి సినిమాలో క్యారెక్టర్‌కు సంబంధించి చాలా హోంవర్క్‌ చేస్తాడు. క్యారెక్టర్‌లో పరకాయ ప్రవేశం చేస్తాడు. రైటర్స్‌, డైరెక్టర్స్‌ ఎవరూ భయపడనక్కర్లేదు. ఏ క్యారెక్టర్‌ అయినా తీసుకురండి. నచ్చితే తను తప్పకుండా చేస్తాడు. సినిమాను కొన్నవారందరూ లాభాల్లో ఉండటం నాకు ఆనందంగా ఉంది'' అన్నారు.

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ మాట్లాడుతూ - ''పది నెలల క్రితం ఎలాంటి సినిమా చేద్దాం అని అనుకుంటున్న తరుణంలో ఎన్నో కథలను విన్నాం. అలాంటి సమయంలో యాదృచ్ఛికంగా మాకు తగిలిన కథే జై లవకుశ. తాతగారి పేరు మీద అన్నయ్య స్టార్ట్‌ చేసిన బ్యానర్‌లో నేను, అన్నయ్య కలిసి చేసిన చిత్రం. అన్నదమ్ముల అనుబంధాన్ని తెలియజేసిన చిత్రమిది. దేవుడు నిర్ణయం తీసుకుని బాబీ రూపంలో ఈ కథను మ దగ్గరకి పంపించాడు. సినిమా ఘన విజయం సాధించడం కూడా దైవ నిర్ణయం. ఒక గొప్ప కథను తీసుకొచ్చినందకు బాబీకి థాంక్స్‌. ఒక నటుడుగా నాకు గర్వంగా, ఆనందంగా ఉండటమే కాదు, నటుడిగా నాకు పూర్తి సంతృప్తినిచ్చన చిత్రమిది. ఈ కథను కోన పరిపూర్ణతను ఇచ్చినందుకు కోనవెంకట్‌కి థాంక్స్‌. కథ విషయంలోనే కాదు, చాలా విషయాల్లో కోన మాకెంతో సపోర్ట్‌ ఇచ్చాడు. అలాగే చక్రికి కూడా థాంక్స్‌. ఛోటాగారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఛోటా అనే వ్యక్తి లేకపోతే, మూడు పాత్రలు చేయడానికి నాకు కూడా ఈజ్‌ ఉండేది కాదు. బాబీకి, నాకు ఛోటన్న ఎంతో సపోర్ట్‌ చేశారు. క్లైమాక్స్‌లో పోసానిగారి నటన చూసి తనలో ఎంత ఎమోషన్‌ ఉందో తెలిసింది. ఆయన చేసిన ఒక సీన్‌ సినిమాను అలా నిలబెట్టింది. ఆ క్యారెక్టర్‌ పోసానిగారి కోసమే రాయబడింది. ఈరోజు జైలవకుశ హిట్‌ కావడానికి ముఖ్య కారణం కూడా పోసానిగారి సీన్‌ అని గర్వంగా చెప్పగలుగుతున్నాను. అదైత్వ స్టూడియోస్‌ అనిల్‌ పాదూరికి థాంక్స్‌. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్‌స్కోర్‌ను అద్భుతంగా అందించారు. అలాగే రామ్‌లక్ష్మణ్‌ మాస్టర్‌, ఎ.ఎస్‌.ప్రకాష్‌, చంద్రబోస్‌, రామజోగయ్యశాస్త్రి సహా అందరికీ థాంక్స్‌. మా మీద నమ్మకంతో 18 ఏళ్లుగా నా చేతిని వదలకుండా ధైర్యం ఇచ్చిన నా అభిమాన సోదరులందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు. నా సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఎంత కలెక్ట్‌ చేసిందనే విషయాన్ని నేను పట్టించుకోను. అభిమానులకు, ప్రేక్షకులక సినిమా నచ్చిందా లేదా అనేదే చాలా చాలా ముఖ్యం. అభిమానులు తలెత్తుకునేలా చేశానని అనుకుంటున్నాను. లేదని చెబితే ఇది కాకపోతే ఇంకోటి, లేదా మరొకటి..అలా ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ఈ మధ్య తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ సంస్కృతి మొదలైంది. విడుదలైన సినిమా ఎమెర్జెన్సీలోని పెషంట్‌ అయితే, పెషంట్‌పైనే అసలు పెట్టుకున్న బంధువులు, చుట్టాలు మేము, డాక్టర్స్‌ ప్రేక్షకులు అయితే దారిన పోయే దానయ్యలు కొంత మంది విశ్లేషకులు. పెషంట్‌ చచ్చిపోతాడా? లేదా? అని చెప్పాల్సింది డాక్టర్లనే ప్రేక్షకులు. ఇది మాకే కాదు, మా అందరికీ జరుగుతున్న ప్రక్రియ. మనం మాట్లాడే మాట, ఎదుటి వ్యక్తి పరిస్థితిని ఎంత దిగజారుస్తుందో ఆలోచించండి. తప్పులుంటే క్షమించండి, అర్థమే లేదనుకంటే వదిలేయండి'' అన్నారు.

 

 

 


Photo Gallery (photos by G Narasaiah)

 

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved