pizza
Prabhas movie launch
ఫార్చ్యూన్ మూవీస్ 'ప్రభాస్' చిత్ర ప్రారంభోత్సవం
You are at idlebrain.com > News > Functions
Follow Us

22 September 2017
Hyderaba
d

ఫార్ట్యూన్స్ మూవీస్ పతాకం పై నూతన నటీనటులను తెలుగు తెరకు పరిచయం చేస్తూ దర్శకుడు సాగర్ చాలా కాలం తరువాత దర్శకత్వం చేస్తున్న చిత్రం `ప్రభాస్`. శుక్రవారం ఉదయం అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. ఎఫ్ బి సి చైర్మన్ రామ్ మోహన్ క్లాప్ నివ్వగా, కెమెరా కె ఎస్ రామరావు స్విన్చ్ ఆన్ చేయగా, ఎస్ వి కృష్ణా రెడ్డి గౌరవ దర్శకత్వం వహించి ఈ నూతన చిత్ర ప్రారంభోత్సవాన్ని జరుపుకున్నారు. అనంతరం ఈ చిత్ర దర్శకుడు సాగర్ మాట్లాడుతూ ``నేను ఇంతవరకు 30 సినిమాలు చేసాను. చాలా గ్యాప్ తీసుకున్న తరువాత ఒక డిఫరెంట్ జోనర్ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నా.. అన్నీ వర్గాల ప్రేక్షుకులను ఆకట్టుకునేలా ఉంటుందీ చిత్రం. నా దర్శకత్వం లో సినిమా రావడానికి ఎక్కువ సమయం పట్టింది కనుక చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నా, హడాహుడిగా సినిమా చేసేసి విడుదల చేసే ఆలోచన నాకు లేదు, ఫుల్ ప్లెడ్జ్ గా సినిమా చేసాను అనే సంతృప్తితోనే సినిమా విడుదల చేస్తాను. ఈ చిత్రానికి హీరో నితీష్ రెడ్డి చైల్డ్ ఆరిస్ట్ గా మనందరికీ సుపరిచితమే, ప్రస్తుతం తమిళ, కన్నడ భాషల్లో హీరోగా గుర్తింపు సంపాదించుకున్నారు, ఇక నూతన హీరోయిన్స్ ను పరిచయం చేయడానికి కారణం వీరైతే చిత్రీకరణ మరియు పబ్లిసిటీ సమయంలో అనుకూలంగా ఉంటూ సపోర్ట్ చేయగలుగుతారు. ఎక్సపీరియెన్స్డ్ తారలైతే డేట్స్ సమస్యలు తలెత్తుతాయనే ఉద్ద్యేశ్యం తోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని, షూటింగ్ దీపావళి నుంచి ప్రారంభించనున్నాం`` అని తెలిపారు.

హీరో నితీష్ రెడ్డి మాట్లాడుతూ ``మగ మహారాజు, రేపటి పౌరులు సినిమా లో పి. ఎల్ నారాయణ గారి కొడుకు గా నేను బడికివెళ్తా అనే పాత్రలో నటించి చైల్డ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందాను. ప్రస్తుతం కన్నడ, తమిళ మలయాళ భాషల్లో హీరో గా నటించిన సినిమాలు విజయవంతమయ్యాయి. మంచి కథ కలిగిన దర్శకత్వం లో తెలుగులో పరిచయం అవ్వడం సంతోషంగా ఉంది`` అన్నారు.

నిర్మాత అశోక్ మాట్లాడుతూ - ``దర్శకుడు సాగర్ గారు చిప్పిన స్టోరీ నచ్చడం తో సినిమా చేయడానికి అంగీకరించాను`` అని తెలిపారు.

నితీష్ కుమార్ రెడ్డి, అమృత, నదిని నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా మెన్: ప్రభాకర్ రెడ్డి, కథ-స్క్రీన్ ప్లే- దర్శకత్వం: సాగర్.


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved