pizza
Nagarjuna, PVP & Ohmkar Rajugari Gadhi 2 movie launch
పివిపి బ్యాన‌ర్‌పై ఓంకార్ ద‌ర్శ‌క‌త్వంలో నాగార్జున హీరోగా `రాజుగారి గ‌ది2` ప్రారంభం
You are at idlebrain.com > News > Functions
Follow Us

27 November 2016
Hyderaba
d

Akkineni Nagarjuna, PVP Cinema, Ohmkar’s Raju Gari Gadi 2 Launched

Raju Gari Gadi 2 is Akkineni Nagarjuna’s new horror thriller in the direction of Ohmkar to be jointly produced by PVP and Matinee Entertainments. This crazy project is grandly launched today at Annapurna Studios in the presence of celebrity guests. K Raghavendra Rao gave clap for the first scene, producer Prasad V Potluri switched on the camera while Ohmkar directed it.

Producer PVP said, “Raju Gari Gadi 2 is next prestigious film to be made on our banner after Oopiri. I am sure this film will remain as memorable film in Nagarjuna career. Following the inputs from Nagarjuna, we made few changes in the script. We will begin the shooting from December first week. I am sure Raju Gari Gadi 2 will be a blockbuster.”

Dialogue writer Abburi Ravi said, “For the first time I worked on Don with Nagarjuna, later Ooiri and now Raju Gari Gadi 2. He is doing a superb character and I believe this will remain the best in his career.”

Music director SS Thaman said, “I am delighted to work on this project. After Balupu, this is my second association with PVP. Director Ohmkar came up with a superb script and I thank him for giving me this opportunity.”

Director Ohmkar said, “Raju Gari Gad released for last Dasara on October 27 became a super hit. Exactly after one year on the same day, I narrated Raju Gari Gadi 2 story to Nagarjuna sir. He immediately agreed to become a part. God blessed me to have him as my hero. Nagarjuna will be presented in a new look and I promise to fulfill the trust laid on me by producer PVP.”

King Nagarjuna said, “Manam is a big turning point in my career. Soggade Chinni Nayana is another big hit. When I was quandary to select my next, I got Om Namo Venkatesaya and I am acting in it. Then, Ohmkar met me through Niranjan and PVP. I was looking for a novel script and this story really excited me. Actually, thriller is my favorite genre and I never acted in such character before.

I know Ohmkar long before. I did not watch Raju Gari Gadhi. Somehow we missed to work together on a game show. I have complete trust on him. After Oopiri and Soggade Chinni Nayana, this will be a distinctive characterization. I am really eager to join the shooting very soon. ”

Artists: Nagarjuna, Vennela Kishore, Ashwin Babu, Shakalaka Shankar and others
Cameraman: Diwakar Babu
Music: SS Thaman
Art: AS Prakash
Dialogues: Abburi Ravi
Producer: PVP
Direction: Ohmka
r

పివిపి బ్యాన‌ర్‌పై ఓంకార్ ద‌ర్శ‌క‌త్వంలో నాగార్జున హీరోగా `రాజుగారి గ‌ది2` ప్రారంభం

అక్కినేని నాగార్జున హీరోగా ఓంకార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్ `రాజు గారి గ‌ది 2`. పి.వి.పి సినిమా, ఓక్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ప్రై.లి, మ్యాట్నీ ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్నినిర్మిస్తున్నాయి.ఈ సినిమా ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మం ఆదివారం ఉద‌యం అన్న‌పూర్ణ స్టూడియోలో సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో ఘ‌నంగా జ‌రిగింది. ముహుర్త‌పు స‌న్నివేశానికి ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్రరావు క్లాప్ కొట్ట‌గా, నిర్మాత ప్ర‌సాద్ వి.పొట్లూరి కెమెరా స్విచ్చాన్ చేశారు. ఓంకార్ తొలి స‌న్నివేశానికి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సంద‌ర్భంగా....

అక్కినేని నాగార్జున మాట్లాడుతూ - ``నా కెరీర్‌లో `మ‌నం` ఓ ట‌ర్న్. త‌ర్వాత `ఊపిరి`, `సోగ్గాడే చిన్ని నాయనా` సినిమాలో స‌క్సెస్ కొట్టాను. నెక్ట్స్ ఏ సినిమా చేయాలా అని ఆలోచిస్తున్న‌ప్పుడు `ఓం న‌మో వేంక‌టేశాయ` సినిమా అవ‌కాశం రావ‌డం, అందులో న‌టించ‌డం జరిగింది. త‌ర్వాత ఏ సినిమా చేయాల‌నుకుంటున్న స‌మ‌యంలో ఓంకార్ ద‌గ్గ‌ర ఓ మంచి క‌థ ఉంద‌ని నిరంజ‌న్‌, పివిపిగారు న‌న్ను క‌లిసి క‌థ విన‌మ‌న్నారు. క‌థ‌లో కొత్త‌ద‌నం ఉంటేనే చేస్తాన‌ని వారితో అన్నాను. క‌థ విన‌గానే బాగా న‌చ్చింది. నాకు ఇష్ట‌మైన థ్రిల్లర్ జోన‌ర్ మూవీ. ఇప్ప‌టి వ‌ర‌కు ఇలాంటి క‌థ‌లో నేను న‌టించ‌లేదు. `రాజుగారి గ‌ది` సినిమా చూడ‌లేదు. అయితే ఓంకార్ గురించి బాగా తెలుసు. గ‌తంలో త‌న‌తో క‌లిసి ఓ గేమ్ షో చేయాల్సింది. కానీ కుద‌ర‌లేదు. త‌న‌పై నాకు న‌మ్మ‌కం ఉంది. ఊపిరి, సోగ్గాడే చిన్నినాయ‌నా త‌ర‌హాలో నా క్యారెక్ట‌ర్ డిఫ‌రెంట్‌గా ఉంటుంది. ఊపిరి సినిమా క‌థ విని సినిమా చేస్తున్న‌ప్పుడు ఎంత ఎగ్జ‌యిట్‌మెంట్ ఫీల‌య్యానో `రాజుగారి గ‌ది2` సినిమా క‌థ విన‌గానే ఎప్పుడెప్పుడు సినిమా చేయాలా అని ఎదురుచూస్తున్నాను. ఈ సినిమాలో మ‌నుషుల‌తో అడుకునే క్యారెక్ట‌ర్ చేస్తున్నాను. తెలుగు ప్రేక్ష‌కులు సినిమాను ఆద‌రిస్తార‌ని న‌మ్మ‌కం ఉంది`` అన్నారు.

నిర్మాత పి.వి.పి మాట్లాడుతూ - ``నాగార్జున గారితో ఊపిరి సినిమా త‌ర్వాత చేస్తున్న సినిమా `రాజుగారి గ‌ది2`. నాగార్జునగారితో మా బ్యాన‌ర్‌లో చేస్తున్న మ‌రో ప్రెస్టిజియ‌స్ మూవీ ఇది. గార్జున గారి సూచ‌న‌ల‌తో స్ర్కిప్ట్ లో కొన్ని మార్పులు చేశాం. నాగార్జున గారి కెరీర్ లో మ‌రచిపోలేని చిత్రంగా నిలుస్తుంది. నా డిసెంబ‌ర్ ఫ‌స్ట్ వీక్ నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభిస్తాం. ఖ‌చ్చితంగా `రాజు గారి గ‌ది 2` బిగ్ హిట్ మూవీ అవుతుంది`` అన్నారు.

ర‌చ‌యిత అబ్బూరి ర‌వి మాట్లాడుతూ - ``డాన్ సినిమాకు నాగార్జున గారితో ఫ‌స్ట్ టైం వ‌ర్క్ చేశాను. త‌ర్వాత ఊపిరి సినిమాకు వ‌ర్క్ చేశాను. ఇప్పుడు రాజుగారిగ‌ది2 సినిమా చేస్తున్నందుకు హ్యాపీగా ఉంది. నాగార్జున గారు ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌ని డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్ ను ఈ చిత్రంలో చేస్తున్నారు. ఆయ‌న కెరీర్ లో బెస్ట్ క్యారెక్ట‌ర్ గా నిలుస్తుంది``అన్నారు.

సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్ మాట్లాడుతూ - ``బ‌లుపు త‌ర్వాత పి.వి.పి సంస్థ‌లో నేను చేస్తున్న సినిమా ఇది. నాగార్జున‌గారితో ఓంకార్ సూప‌ర్ స్ర్కిప్ట్ తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ మూవీకి వ‌ర్క్ చేసే అవ‌కాశం ఇచ్చినందుకు థ్యాంక్స్`` అన్నారు.

డైరెక్ట‌ర్ ఓంకార్ మాట్లాడుతూ - `` యాంక‌ర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన నేను చాలా క‌ష్ట‌ప‌డి ఈస్ధాయికి వ‌చ్చాను. ఇప్ప‌టి వ‌ర‌కు చూడ‌ని నాగార్జున గారిని ప్ర‌జెంట్ చేస్తున్నాను. గ‌త ఏడాది అక్టోబ‌ర్ 27న విడుద‌లైన రాజుగారి గ‌ది ఎంత పెద్ద హిట్ అయ్యిందో అంద‌రికీ తెలిసిందే. ఈ సంవ‌త్స‌రం అదే రోజున అక్టోబ‌ర్ 27న నాగ్ సార్ కి క‌థ చెప్పాను. క‌థ విన్న ఆయ‌న న‌చ్చి న‌టించ‌డానికి ఒప్పుకున్నారు. నా పై పి.వి.పి గారు, నాగ్ సార్ ఉంచిన న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకుంటాను``అన్నారు.

నాగార్జున‌, వెన్నెల కిషోర్, అశ్విన్ బాబు, ప్ర‌వీణ్, ష‌క‌ల‌క శంక‌ర్ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్ - దివాక‌ర‌న్, మ్యూజిక్ - త‌మ‌న్, ఆర్ట్ - ఎ.ఎస్.ప్ర‌కాష్, డైలాగ్స్ - అబ్బూరి ర‌వి, నిర్మాత - పి.వి.పి, ద‌ర్శ‌క‌త్వం - ఓంకార్.


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved