pizza
Shamanthakamani movie launch
భవ్య క్రియేషన్స్ 'శమంతకమణి` పూజా కార్య‌క్ర‌మాలు ప్రారంభం
You are at idlebrain.com > News > Functions
Follow Us

12 February 2017
Hyderaba
d

నారా రోహిత్ ,సందీప్ కిషన్ ,సుధీర్ బాబు , ఆది తారాగ‌ణంగా భ‌వ్య క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో వి.ఆనంద్ ప్ర‌సాద్ నిర్మాత‌గా కొత్త చిత్రం `శ‌మంత‌క మ‌ణి`ఆదివారం హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంది. ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో డా. రాజేంద్ర ప్రసాద్ న‌టిస్తున్నారు. ముహుర్త‌పు స‌న్నివేశానికి ద‌ర్శ‌కుడు శ్రీనువైట్ల క్లాప్ కొట్టారు. నిర్మాత వి.ఆనంద్ ప్ర‌సాద్ కెమెరా స్విచ్చాన్ చేశారు. డా.రాజేంద్ర‌ప్రసాద్ గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం చేశారు. అనంతం ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో....

డా.రాజేంద్ర‌ప్ర‌సాద్ మాట్లాడుతూ - ``న‌టుడుగా న‌ల‌భై వ‌సంతాల‌ను పూర్తి చేసుకున్నాను. న‌టుడుగా ఇన్నేళ్లుగా ఇంకా స‌క్సెస్‌ఫుల్‌గా న‌టించినందుకు ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌. భ‌వ్య‌క్రియేష‌న్స్ బ్యాన‌ర్లో న‌టించ‌డం ఆనందంగా ఉంది. నా హోం బ్యాన‌ర్‌లో చేసిన‌ట్టు అనిపిస్తుంది. రియ‌ల్ ఎస్టేట్‌, సిమెంట్ రంగంలో స‌క్సెస్‌ఫుల్‌గా రాణించిన ఆనంద్ ప్ర‌సాద్‌గారితో అమ్మాయి న‌వ్వితే సినిమా చేశాను. నారారోహిత్‌, ఆది, సందీప్ కిష‌న్‌, సుధీర్‌బాబుల కాంబినేష‌న్‌లో మ‌ల్టీస్టార‌ర్ సినిమా చేయ‌డం ఇంకా సంతోషంగా ఉంది. భ‌లేమంచి రోజు సినిమా చేసిన శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో నేను కీల‌క‌పాత్ర చేస్తున్నాను. న‌లుగురు కుర్రాళ్లు, నాపై శ్రీరామ్ ఆదిత్య చేసిన క‌థ అద్భుతంగా ఉంది. శ్రీరాం ఆదిత్య నా మిత్రుడు త‌న‌యుడు. మేం అంద‌రూ క‌లిసి చేసే సినిమా హండ్రెడ్ ప‌ర్సెంట్ గ్యారెంటీ హిట్ అవుతుంది`` అన్నారు.

సందీప్ కిష‌న్ మాట్లాడుతూ - ``శ్రీరాం ఆదిత్య‌కు నాకు మంచి క‌నెక్ష‌న్ కుదిరింది. మంచి క‌థ‌. మంచి ఎంట‌ర్ టైనింగ్ మూవీ. నా మిత్రులు ఆది, సుధీర్‌, రోహిత్‌తో పాటు నాకు ఇష్ట‌మైన హీరో రాజేంద్ర‌ప్ర‌సాద్‌ను క‌లిపి యంగ్ టాలెంట్‌తో సినిమా చేస్తున్న ఆనంద్ ప్ర‌సాద్ గారికి థాంక్స్‌`` అన్నారు.

సుధీర్ బాబు మాట్లాడుతూ - ``డైరెక్ట‌ర్ శ్రీరాం ఆదిత్య‌తో ఇంత‌కు ముందు భ‌లే మంచి రోజు సినిమా చేశాను. ఏ డైరెక్ట‌ర్ ద‌గ్గ‌ర వ‌ర్క్ చేయ‌కుండా శ్రీరాం తొలి సినిమాతోనే పెద్ద స‌క్సెస్‌ను కొట్టాడు. ఇప్పుడు రెండో సినిమా చేసేట‌ప్ప‌టికే రాజేంద్ర‌ప్ర‌సాద్‌గారితో స‌హా ఐదు మంది హీరోల‌తో మ‌ల్టీస్టార‌ర్ చేయ‌డం ఓ రికార్డుగానే చెప్పాలి. త‌న లైఫ్‌లో జరిగిన ఇన్‌సిడెంట్స్‌ను ఆధారంగా చేసుకునే ఈ సినిమాను శ్రీరాం త‌యారు చేశాడు. ఏ టెన్ష‌న్ లేకుండా సినిమా చేస్తున్నాను. భ‌వ్య‌క్రియేష‌న్స్ సినిమా గురించి తీసుకునే కేర్ గురించి నేను ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. నా మిత్రులు ఆది, సందీప్‌, రోహిత్ క‌లిసి చేస్తున్న ఈ సినిమా త‌ప్ప‌కుండా పెద్ద హిట్ అవుతుంద‌ని అనుకుంటున్నాం`` అన్నారు.

ఆది మాట్లాడుతూ - ``ఇంత మంది హీరోల‌ను పెట్టి సినిమా చేయ‌డం అంత సులువైన విష‌యం కాదు. ఇంత మందిని కలిపి సినిమా చేయ‌డానికి కార‌ణం అత‌ని స్క్రిప్ట్ కార‌ణం. ఎంగేజింగ్, ఎంటర్‌టైనింగ్ స్క్రిప్ట్. ఈ సినిమాలో హీరోల కంటే క్యారెక్ట‌ర్స్ క‌న‌పడ‌తాయి. లెజెండ్రీ నటుడు రాజేంద్ర‌ప్ర‌సాద్‌గారితో ల‌వ్‌లీ త‌ర్వాత చేస్తున్న సినిమా ఇది. సందీప్, సుధీర్‌, రోహిత్ క‌లిసి చేస్తున్న సినిమా. భ‌వ్య‌క్రియేష‌న్స్ ఆనంద్ ప్ర‌సాద్‌గారికి థాంక్స్‌. త‌ప్ప‌కుండా ఇది అంద‌రికీ న‌చ్చే డిఫ‌రెంట్ మూవీ అవుతుంద‌ని భావిస్తున్నాను`` అన్నారు.

ద‌ర్శ‌కుడు శ్రీరాం ఆదిత్య మాట్లాడుతూ - ``నేను ఇంజ‌నీరింగ్ పూర్తి కాగానే పేస్‌బుక్‌లో ఉద్యోగం చేసేట‌ప్పుడు రాసుకున్న తొలి క‌థ ఈ సినిమా. ద‌ర్శ‌కుడు కావాల‌నుకోగానే నేను ముందు అంద‌రికీ ఈ క‌థ‌ను వినిపించాను. క‌థ విన్న అంద‌రూ తెలుగులో న‌లుగురు హీరోలు క‌లిసి సినిమా ఎక్క‌డా చేస్తారు..ఇంపాజిబుల్ అని అన్నారు. ఈ క‌థ విన‌గానే ఆనంద్ ప్ర‌సాద్‌గారు ఎగ్జ‌యిట్ అయ్యి, మనం సినిమా చేద్దామ‌ని అన్నారు. ఆయ‌న‌కు పెద్ద థాంక్స్‌. రోహిత్‌, సుధీర్, ఆది, సందీప్ అంద‌రూ తొలిసారి క‌థ విన‌గానే చేద్దామ‌నే అన్నారు. అలాగే రాజేంద్ర‌ప్ర‌సాద్‌గారు క‌థ విన‌గానే మారు మాట్లాడ‌కుండా ఒప్పుకున్నారు. అంద‌రూ అందించిన ఎనర్జీతో టీంగా ముందుకెళుతున్నాం. ఇంత మంది హీరోలు క‌లిసి తెలుగులో చేస్తున్న తొలి సినిమా ఇది. ఈ సినిమా ఇలాంటి సినిమాల‌కు నాంది ప‌లుకుతుందని క‌చ్చితంగా చెప్ప‌గ‌ల‌ను. గ్యారెంటీగా ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎంగేజ్ చేసే సినిమా అవుతుంది. మా టీం క‌లిసి వండ‌ర్‌పుల్ మూవీని అందిస్తాం`` అన్నారు.

నిర్మాత వి.ఆనంద్ ప్ర‌సాద్ మాట్లాడుతూ - ``త్వ‌ర‌లోనే సినిమాకు సంబంధించిన ఇత‌న న‌టీన‌టుల‌ను, టెక్నిషియ‌న్స్ వివ‌రాలను తెలియ‌జేస్తాను. మార్చి మొద‌టి నుండి సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. సహ‌కారం అందిస్తున్న అంద‌రికీ థాంక్స్`` అన్నారు.

నారా రోహిత్ ,సందీప్ కిషన్ ,సుధీర్ బాబు , ఆది, డా.రాజేంద్ర‌ప్ర‌సాద్ తదిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి నిర్మాత : వి . ఆనంద ప్రసాద్, కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం : శ్రీరామ్ ఆదిత్య.

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved