10 May 2018
Hyderabad
శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై చదలవాడ బ్రదర్స్ సమర్పణలో రూపొందుతున్న తొమ్మిదో సినిమా గురువారం హైదరాబాద్‌లో మొదలైంది. వసంత్ సమీర్, షెహర్ జంటగా నటిస్తున్నారు. నాగు గవర దర్శకుడు. చదలవాడ పద్మావతి నిర్మాత. ముహూర్తపు సన్నివేశానికి నాగేశ్వరరెడ్డి క్లాప్‌కొట్టారు. దేవిప్రసాద్ స్విచ్ఛాన్ చేశారు. అజయ్ కుమార్ గౌరవ దర్శకత్వం వహించారు.
చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ ``దర్శకుడి కమిట్‌మెంట్, అతను చెప్పిన కథ, అతనిలో ఉన్న స్ట్రగుల్ చూసి ఈ సినిమా చేస్తున్నాను. వెలకట్టలేని మంచి కథను చెప్పాడు. లవ్ సబ్జెక్ట్ ఇది. సినిమా చూస్తే దర్శకుడు పడ్డ తపన కనిపిస్తుంది. రొటీన్‌గా ఉండదు. థ్రిల్లర్ ప్రధానంగా సాగుతుంది. సెన్సిటివ్ సబ్జెక్ట్ `` అని చెప్పారు.
దర్శకుడు మాట్లాడుతూ ``వీకెండ్ లవ్ తర్వాత నేను చేస్తున్న చిత్రమిది. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ సంస్థ తెరకెక్కించిన పలు చిత్రాలను నేను కాకినాడ కల్పన థియేటర్లో చూసేవాడిని. అంత పెద్ద సంస్థలో నేను సినిమా చేయడం ఆనందంగా ఉంది. నా మీద నమ్మకంతో ఈ సినిమా చేస్తున్నందుకు ధన్యవాదాలు. కాంటెంపరరీ క్రైమ్ కథ ఇది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ తమని తాము ఐడెంటిఫై చేసుకుంటారు. రియలిస్టిక్‌గా ఉంటుంది. గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే ఉంటుంది. ప్రతి పాత్రా ఎలివేట్ అవుతుంది. శ్రావణ్ మంచి సంగీతాన్నిస్తున్నారు. ఈ న ఎల 14 నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. జూన్, జూలైలో మరో రెండు షెడ్యూల్స్ ఉంటాయి`` అని అన్నారు.
అజయ్ మాట్లాడుతూ ``కొత్తవాళ్లని ఎంకరేజ్ చేసే దిశగా శ్రీనివాసరావు తెరకెక్కిస్తున్న ఈ సినిమా అభినందనీయం. ఈ నెల్లోనే వారి సంస్థ నుంచి రెండు, మూడు సినిమాల ప్రారంభోత్సవాలు ఉంటాయి`` అని చెప్పారు.
తుమ్మల ప్రసన్నకుమార్ మాట్లాడుతూ ``చిన్న టెక్నీషియన్స్ తో చేస్తున్న ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. తేజ, కృష్ణవంశీలాంటివారందరూ చిన్న బడ్జెట్ చిత్రాలు తీసి పెద్ద దర్శకులైనవాళ్లే. వాళ్లంత హిట్ నాగుకు రావాలి`` అని అన్నారు.
శ్రావణ్ మాట్లాడుతూ `` మంచి సంగీతానికి స్కోప్ ఉన్న సినిమా ఇది`` అని అన్నారు.
వసంత్ సమీర్, షెహర్ మాట్లాడుతూ ``ఇది మాకు తొలి సినిమా. తప్పకుండా అందరికీ నచ్చుతుంది`` అని చెప్పారు.
రవివర్మ, శ్రీ హర్ష, `జబర్దస్త్` రామ్ ప్రసాద్, రఘుబాబు, కాదంబరి కిరణ్, నీలిమ, జెమిని సురేశ్, కమల్, లోబో కీలక పాత్రధారులు. ఈ సినిమాకు కెమెరా: దుర్గా కిశోర్ బోయిడపు, ఎడిటర్: ప‌్రవీణ్ పూడి, సంగీతం: శ‌్రావణ్ భరద్వాజ్, ఫైట్స్: డ‌్రాగన్ ప్రకాశ్, నృత్యాలు: యానీ, నిర్మాత: చదలవాడ పద్మావతి, రచన-దర్శకత్వం: నాగు గవర.