pizza
Naa Peru Surya thanks to India meet
`నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` థాంక్స్ టు ఇండియా మీట్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

10 May 2018
Hyderabad

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా శ్రీరామ‌ల‌క్ష్మి సినీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌ఫై వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో ల‌గ‌డ‌పాటి శిరీషా శ్రీధ‌ర్‌ రూపొందిన చిత్రం `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా`. మే 4న ఈ సినిమా విడుద‌లైంది. ఈ సంద‌ర్భంగా థాంక్స్ టు ఇండియా మీట్ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో ....

డా. వెంక‌టేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ ``ఈ పిక్చ‌ర్ కోసం బ‌న్ని చాలా బాగా క‌ష్ట‌ప‌డ్డాడు. చాలా బాగా చేశాడు. సోల్జ‌ర్‌గా ఎలా మ‌న దేశాన్ని కాపాడుకోవాలి? బోర్డ‌ర్‌కి ఎలా రీచ్ కావాలి? అనే మంచి సందేశాన్నిచ్చిన సినిమా ఇది. వ‌క్కంతం వంశీ చాలా బాగా చేశాడు. మ‌నం ఉన్న ఊరిని, దేశాన్ని ఎలా కాపాడుకోవాలో కూడా చాలా బాగా చెప్పారు ఈ సినిమాలో`` అని తెలిపారు.

ల‌గ‌డ‌పాటి శ్రీధ‌ర్ మాట్లాడుతూ ``నాకు ప‌వ‌న్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌గారిని చూసి ఒళ్లు గ‌గుర్పొడిచింది. ఆయ‌న సినిమాలు చూసి పెరిగాను. ప‌వ‌న్ ప్ర‌తి సినిమాలో తొలి పాట సందేశాత్మ‌కంగా ఉంటుంది. ఆయ‌న జ‌నాల కోసం త‌న కెరీర్‌ని వ‌దిలేసుకున్నారు. ఆయ‌నకు భ‌విష్య‌త్తులో నేను మ‌ద్ద‌తిస్తాను. తెలుగు రాష్ట్రాలు ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఆశ‌యాల‌కు త‌గ్గ‌ట్టుగా మారి మంచి రాష్ట్రాలుగా అభివృద్ధి చెందాలి. మాకు అభిమానులు దేవుళ్ల‌యితే, వాళ్ల‌కి దేవుడు వ‌ప‌న్‌క‌ల్యాణ్‌. అలాంటి వ్యక్తి మా సినిమా ఫంక్ష‌న్‌కి రావ‌డం ఆనందంగా ఉంది. బ‌న్నీ నాకు ఈ సినిమా తీసే అవ‌కాశం ఇచ్చినందుకు చాలా థాంక్స్. వ‌క్కంతం వంశీ ఈ సినిమాను త‌ర్వాతి త‌రాల కోసం చేశారు. స్టూడెంట్స్ ఎవ‌రైనా ఈ సినిమాను చూస్తే త‌ప్ప‌కుండా వారిలో ఒక మార్పు, ఒక వెలుగు వ‌స్తుంద‌ని అనుకుంటాను. వండ‌ర్‌ఫుల్‌ప్యాకేజ్ ఈ సినిమా. మ‌ల‌యాళంలో 4 స్టార్‌, త‌మిళ్‌లో 3.8స్టార్‌, తెలుగులో 3.5 స్టార్స్ వ‌చ్చాయి. పెద్ద స్టార్ ఒక ఇష్యూతో సినిమాను చేయ‌డం అభినందించ‌ద‌గ్గ విష‌యం. నాగ‌బాబుగారు, బ‌న్నీవాసు నాకు చాలా గొప్ప‌గా స‌హ‌క‌రించారు`` అని చెప్పారు.

వ‌క్కంతం వంశీ మాట్లాడుతూ ``ఈ వేడుక‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ రావ‌డం చాలా ఆనంద‌దాయ‌కం. నాకు తొలి సినిమా అవ‌కాశం, ఇలాంటి పెద్ద సినిమా రూపంలో రావ‌డం చాలా సంతోషం. కంటెంట్‌ని క‌మ‌ర్షియ‌ల్‌గా కూడా చెప్పొచ్చ‌ని నేను అన్న‌ మాట న‌మ్మి నాతో అల్లు అర్జున్ ప్ర‌యాణం చేశారు. సినిమా ఇంత రిచ్‌గా రావ‌డానికి నిర్మాత‌లు చాలా స‌హ‌క‌రించారు. నా టీమ్ అంద‌రికీ ధ‌న్య‌వాదాలు. ఇంత మంచి కంటెంట్‌తో ఉన్న ఈ సినిమాను మ‌న‌స్ఫూర్తిగా గుండెల్లోకి తీసుకున్న వారంద‌రికీ ధ‌న్య‌వాదాలు. మ‌ల‌యాళం, త‌మిళ్‌, తెలుగులో సినిమా చాలా బాగా ఆడుతోంది`` అని చెప్పారు.

అల్లు అర్జున్ మాట్లాడుతూ ``నా పేరు అల్లు అర్జున్‌. నా ఇల్లు ఇండియా. ఈ ఫంక్ష‌న్ పేరు థాంక్యూ ఇండియా. అందులో తొలి థాంక్యూ మా ప‌వ‌న్‌క‌ల్యాణ్‌గారికి, ప‌వ‌ర్‌స్టార్ అభిమానులకు. నాకు ఆర్మీలాగా నిలుచునే అభిమానుల‌కి. ఈ సినిమా గురించి నాకు వ‌చ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ లో ఒక‌టి మీతో పంచుకుంటాను. `సినిమా చూశాం . చాలా బావుంది ఈ సినిమా. మా పిల్ల‌లు మిలిట‌రీ యూనిఫార్మ్ కుట్టించుకోవాల‌నుకుంటున్నారు. సినిమా పూర్త‌య్యాక దాన్ని చూశాక పిల్ల‌లు ఎవ‌రైనా హెయిర్‌స్టైల్స్, బ్యాగ్‌లు కావాల‌ని అడుగుతారు. కానీ ఈ సినిమా చూసిన త‌ర్వాత పిల్ల‌లు మిలిట‌రీ కాస్ట్యూమ్స్ కుట్టించుకుంటున్నారు` అని చాలా మంది త‌ల్లులు, మ‌హిళ‌లు నాతో చెప్పారు. అది విని చాలా ఆనందించాను`` అని చెప్పారు.

ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట్లాడుతూ ``నా పేరు సూర్య సినిమాను చూడాల‌నే కోరిక నాకు క‌లిగింది. ల‌గ‌డ‌పాటి శ్రీధ‌ర్‌గారిని అడిగి ఒక‌సారి ఈ సినిమా చూసి మిగిలిన ప‌ర్య‌ట‌న‌ల‌కు వెళ్తాను. వ‌క్కంతం వంశీగారు నేను `కొమ‌రం పులి` చేసేట‌ప్పుడు ఓ క‌థ చెప్పారు. దాన్ని ముందుకు తీసుకెళ్ల‌లేక‌పోయాను. ఆయ‌న ఇవాళ అల్లు అర్జున్‌గారిలాంటి పెద్ద హీరోతో సినిమా చేశారు. ల‌గ‌డ‌పాటి శ్రీధ‌ర్‌, నేను ఒకే చోట ఉండేవాళ్లం. ఆయ‌న‌కు ధ‌న్య‌వాదాలు. మా అన్న‌య్య‌ నాగ‌బాబుగారు దీనికి ఒక ప్రొడ్యూస‌ర్ అని కూడా తెలియ‌దు. సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్న‌ట్టు నాకు చెప్ప‌డు. మేం ఎక్కువ‌గా మాట్లాడుకోం కాబ‌ట్టి నాకు తెలియ‌దు. అల్లు అర్జున్ గారు న‌టించిన `బ‌న్నీ` త‌ర్వాత `ఆర్య` సినిమా నాకు న‌చ్చింది. ఆ త‌ర్వాత `దేశముదురు` వంటి సినిమాల‌తో ఆయ‌న ఎదిగారు. అల్లు అర్జున్‌గారు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి. ఆయ‌న చేసిన సినిమాల‌న్నీ గొప్ప విజ‌యం సాధించాలి. వాళ్ల త‌ల్లిదండ్రుల‌కు, వారి తాత‌గారికి, మిగిలిన వాళ్లంద‌రికీ మంచి పేరు తెచ్చిపెట్టాలి. మంచి సినిమా ల‌గ‌డ‌పాటి శ్రీధ‌ర్‌, వ‌క్కంతం వంశీ, అల్లు అర్జున్‌గారి ద్వారా వ‌చ్చినందుకు చాలా ఆనందంగా ఉంది`` అని అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో నాగ‌బాబు, అశోక్‌, మెహ‌ర్ ర‌మేశ్‌, రామ‌జోగ‌య్య‌శాస్త్రి, బ‌న్నీ వాసు త‌దిత‌రులు పాల్గొన్నారు.Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved