pizza
Mela press meet
'మేళా' ప్రెస్‌మీట్‌
You are at idlebrain.com > News > Functions
 
Follow Us

13 December 2017
Hyderaba
d

మామిడి వెంకటలక్ష్మి సమర్పణలో కొంకా ప్రొడక్షన్స్‌, పి.ఎస్‌.పి.ఫిలింస్‌ బ్యానర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'మేళా'. సూర్యతేజ్‌, ధన్సిక, సిమ్రాన్‌, సోని చరిష్టా తదితరులు ప్రధాన తారాగణం. ఈ సినిమా ప్రెస్‌మీట్‌ బుధవారం హైదరాబాద్‌ సారథి స్టూడియోలో జరిగింది. ఈ ప్రెస్‌మీట్‌లో...

సాయిధన్సిక మాట్లాడుతూ - ''కిరణ్‌గారు, సంతోష్‌గారు, సోని చరిష్టా, సూర్యతేజ్‌ ఇలా ఒక మంచి పవర్‌ఫుల్‌ టీం దొరికింది. నా కెరీర్‌లో ఇది చాలా ఇంపార్టెంట్‌ మూవీ. నా క్యారెక్టర్‌లో చాలా డైమన్షన్స్‌ ఉంటాయి. లవ్‌, కామెడీ, ఎమోషన్స్‌ ఇలా అన్ని ఎలిమెంట్స్‌ ఉన్న సినిమా. తప్పకుండా ఆడియెన్స్‌ను ఎంగేజ్‌ చేసే చిత్రమిది'' అన్నారు.

రాజా రవీంద్ర మాట్లాడుతూ - ''డిఫరెంట్‌ సబ్జెక్ట్‌తో రూపొందుతోన్న చిత్రమిది. ఇందులో చాలా కీలకమైన పాత్రలో కనిపిస్తాను. స్క్రీన్‌ప్లే సినిమాకు ప్లస్‌ అవుతుంది. సినిమా ఇప్పటికే 60 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది'' అన్నారు.

నిర్మాత సంతోష్‌కుమార్‌ మాట్లాడుతూ - ''విభిన్నమైన కథ, కథనంతో కూడిన చిత్రమిది. నిజ ఘటనలు ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాం. దర్శకుడు కిరణ్‌గారు సినిమాను అనుకున్న ప్లానింగ్‌లో పూర్తి చేస్తున్నారు'' అన్నారు.

డైరెక్టర్‌ కిరణ్‌ శ్రీపురం మాట్లాడుతూ - ''2006లో ముంబైలో జరిగిన యదార్థ ఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. ఇందులో కథానుగుణంగా ధన్సిక, సూర్యతేజ, సోని చరిష్టా..తదితర క్యారెక్టర్స్‌కు రెండు, మూడు వెర్షన్స్‌ ఉంటాయి. సినిమా అనుకున్న దాని కంటే బాగా వస్తుంది. ప్రస్తుతం క్లైమాక్స్‌ లీడ్‌ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నాం. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కఉతున్న ఈ సినిమా 50-60 శాతం చిత్రీకరణ పూర్తయ్యింది. త్వరలోనే ట్రైలర్‌ విడుదలకు ప్లాన్‌ చేస్తున్నాం. ట్రైలర్‌ చూస్తే, అసలు ఈ టైటిల్‌ ఎందుకు పెట్టామని తెలుస్తుంది'' అన్నారు.

సోని చరిష్టా మాట్లాడుతూ - ''ఇందులో జ్వాలా దేవి అనే పవర్‌ఫుల్‌ పాత్రలో కనపడతాను. మంచి టీంతో పనిచేయడం ఆనందంగా ఉంది'' అన్నారు.

సూర్యతేజ్‌, ధన్సిక, సిమ్రాన్‌, సోని చరిష్టా, అలీ, రాజా రవీంద్ర, భరత్‌ రెడ్డి, నాగినీడు, రోహిణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్‌: పెద్దిరాజు విహాస్‌, సంగీతం: సుక్కు, డ్యాన్స్‌: చంద్ర కిరణ్‌, కెమెరా: ఎస్‌.మురళీమోహన్‌రెడ్డి, ఎడిటర్‌: చంద్రమౌళి, సహ నిర్మాత: పంతం అరుణ రెడ్డి, నిర్మాత: సంతోష్‌ కుమార్‌ కొంకా, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: కిరణ్‌ శ్రీపురం.


 
Photo Gallery (photos by G Narasaiah)
 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved