pizza
Ungarala Rambabu on the sets
చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌లో `ఉంగ‌రాల రాంబాబు`
You are at idlebrain.com > News > Functions
Follow Us

17 February 2017
Hyderaba
d

సునీల్ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ప‌లు విజయవంతమైన చిత్రాల్ని నిర్మించిన పరుచూరి కిరీటి నిర్మాత‌గా యునైటెడ్ కిరిటీ మూవీస్ లిమిటెడ్ బ్యానర్ పై నటిస్తున్న చిత్రం `ఉంగరాల రాంబాబు`. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుంటున్న సంద‌ర్భంగా చిత్ర యూనిట్ శుక్ర‌వారం హైద‌రాబాద్ అన్న‌పూర్ణ సెవెన్ ఏక‌ర్స్‌లో ప్రెస్‌మీట్‌ను నిర్వ‌హించింది. ఈ సంద‌ర్భంగా....

హీరో సునీల్ మాట్లాడుతూ - ```ఉంగ‌రాల రాంబాబు` అనే టైటిల్ వింటుంటే ఎంత ఫ‌న్నిగా ఉందో సినిమా ఫ‌స్ట్ సీన్ నుండి లాస్ట్ సీన్ వ‌ర‌కు అంతే ఫ‌న్ ఉంటుంది. ఒక‌ప్పుడు సీనియ‌ర్ నటుడు చ‌లంగారి సంబ‌రాల రాంబాబు అనే టైటిల్‌లా ఎంతో బావుంద‌ని నా స్నేహితులు కొంత మంది ఫోన్ చేశారు. క్రాంతి మాధ‌వ్ వంటి మంచి స్ట్రెంగ్త్ ఉన్న ద‌ర్శ‌కుడితో వ‌ర్క్ చేయ‌డం ఆనందంగా ఉంది. అప్ప‌ట్లో రాజేంద్ర‌ప్ర‌సాద్‌గారు చేసిన క్యారెక్ట‌ర్స్ త‌ర‌హాలో ఈ సినిమాలో నా క్యారెక్ట‌ర్ ఉంటుంది. అందాల రాముడు, పూల రంగ‌డు సినిమాల త‌ర‌హాలో ఎంజాయింగ్‌గా ఉంటుంది. రీసెంట్‌గా విడుద‌ల చేసిన ఫ‌స్ట్‌లుక్‌ను కూడా ద‌ర్శ‌కుడు క్రాంతి మాధ‌వ్ ఓ ఇన్నోవేష‌న్‌తో కాన్సెప్ట్ ప్ర‌కారం ఫస్ట్‌లుక్‌ను త‌యారు చేశారు. ఓ ఐదారు రోజుల మిన‌హా షూటింగ్ మొత్తం పూర్త‌య్యింది. ఈ రోజు చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న సాంగ్‌తో సినిమా పాట‌ల‌న్నీ పూర్తవుతాయి. సినిమాలో ఐదు సాంగ్స్ ఉన్నాయి. ఈ సినిమాలో నా క్యారెక్ట‌ర్ విష‌యానికి వ‌స్తే హీరో చిన్న పిల్లాడి వంటి మ‌న‌స్త‌త్వం ఉండే మంచి వ్య‌క్తి. జాత‌కాల‌ను న‌మ్మే క్యారెక్ట‌ర్‌. ఈ సినిమాలో ప్ర‌కాష్ రాజ్ వంటి సీనియ‌ర్ న‌టుడుతో కూడా న‌టించడం మంచి అనుభ‌వాన్నిచ్చింది. మంచి కామెడితో పాటు సోష‌ల్ ఆవేర్‌నెస్ ఉన్న చిత్రం. సినిమాలో పాత్ర కోసం ఇంత‌కు ముందు సునీల్‌లా లావుగా క‌న‌ప‌డాల‌ని డైరెక్ట‌ర్‌గారు అడ‌గ‌డంతో పాత్ర కోసం ఐదు కిలోల బ‌రువు పెరిగాను`` అన్నారు.

చిత్ర ద‌ర్శ‌కుడు క్రాంతి మాధ‌వ్ మాట్లాడుతూ - ``ప్ర‌స్తుతం చిత్రీక‌రిస్తున్న పాట‌తోపాట‌ల‌న్నీ పూర్త‌వుతాయి. ప్యాచ్ వ‌ర్క్ మిన‌హా చిత్రీక‌ర‌ణ అంతా పూర్త‌య్యింది. సినిమాను ఈ వేస‌విలో విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నాం. అవుటండ్ అవుట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌. సునీల్‌గారు చ‌క్క‌టి కామెడిని పండించారు. పాత్ర కోసం బ‌రువు కూడా పెరిగారు. ఒక‌ప్పుడు త‌న‌దైన కామెడితో ప్రేక్ష‌కుల‌ను న‌వ్వించిన సునీల్‌ను నేను ఎలా చూడాల‌నుకుంటున్నానో అలా ఈ సినిమాలో చూపించాను. మ‌ళ్ళీ మ‌ళ్ళీ ఇది రాని రోజు త‌ర్వాత కామెడి సినిమా చేయాల‌ని కామెడి స్క్రిప్ట్‌ను త‌యారుచేసుకున్నాను. హీరో క్యారెక్ట‌ర్ చాలా గ‌మ్మ‌త్తుగా ఉంటుంది. డిఫ‌రెంట్ కామెడి. ఓ టైంలో జంధ్యాలగారు తీసిన కామెడిలా కంటిన్యూస్ లాఫ‌ట‌ర్ సినిమాలో ఉంటుంది. అమాయ‌క‌మైన కుర్రాడు క‌థ‌. జాత‌కాల‌ను న‌మ్మే వ్య‌క్తి. ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతం అందించారు. ప్ర‌కాష్ రాజ్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, వెన్నెల‌కిషోర్ వంటి న‌టీన‌టులు న‌టించారు. నిర్మాత‌ల స‌హ‌కారంతో అనుకున్న ప్లానింగ్‌లో సినిమాను పూర్తి చేశాం`` అన్నారు.

సునీల్, మియా జార్జ్, ప్రకాష్ రాజ్, పోసాని కృష్ణ మురళి, ఆశిష్ విద్యార్థి, ఆలీ, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, రాజా రవీంద్ర, మధు నందన్, ప్రభాస్ శ్రీను, తాగుబోతు రమేష్, దువ్వాసి మోహన్, సత్తెన్న, చిత్రం శ్రీను, సత్యం రాజేష్, విజయ్ కుమార్, నల్ల వేణు, అనంత్, మిర్చి హేమంత్, ఐమాక్స్ వెంకట్, రమణా రెడ్డి, శ్రీ హర్ష, శివన్ నారాయణ, మాస్టర్ హన్సిక్, కె.ఎల్.ప్రసాద్, జెమిని ప్రసాద్, మణిచందన, హరి తేజ, మౌళిక, మిధున న‌టించిన ఈ చిత్రానికి మ్యూజిక్ః జిబ్రాన్, లిరిక్స్ః రామ జోగయ్య శాస్త్రి, రెహమాన్, సినిమాటోగ్రఫిః సర్వేష్ మురారి, శ్యామ్ కె నాయుడు, ఎడిటింగ్ః కోటగిరి వెంకటేశ్వర రావు, ఫైట్ మాస్టర్ః వెంకట్, డైలాగ్స్ః చంద్ర మోహన్ చింతాడ, ఆర్ట్ః ఎ.ఎస్.ప్రకాష్, కొరియో గ్రఫిః భాను మాస్టర్

నిర్మాతః పరుచూరి కిరీటి, ద‌ర్శ‌క‌త్వంః కె. క్రాంతి మాధవ్.


Photo Gallery (photos by G Narasaiah)
 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved