pizza
Tholi Kiranam platinum disc function
అనందోత్సాహాల మధ్య ‘తొలికిరణం’ ప్లాటినం డిస్క్ వేడుక
You are at idlebrain.com > News > Functions
Follow Us

14 July 2017
Hyderabad

సువర్ణ క్రియేషన్స్ పతాకం పై, జె జాన్ బాబు దర్శకత్వంలో, టి. సుధాకర్ నిర్మిస్తున్న చిత్రం ‘తొలికిరణం’ ప్లాటినం డిస్క్ వేడుక సినీ ప్రముఖుల, అభిమానుల సమక్షంలో శుక్రవారం ప్రసాద్ లాబ్ లో ఘనంగా జరిగింది. 50 లక్షల పైగా సి.డిలు అమ్ముడు పోయిన సందర్భాన్ని పురస్కరించుకుని, అనందోత్సాహాల మధ్య జరిపారు.

చిత్రంలో పని చేసిన యూనిట్ సభ్యులకు, నటీనటులకు,  మా అసోసియేషన్ అధ్యక్షులు శివాజీరాజా, సీనియర్ నటుడు భానుచందర్ చేతుల మీదుగా షీల్డ్ ల పంపిణీ జరిగింది. వేదిక పై ఉన్న ముఖ్యులు ప్రతాని రామకృష్ణ గౌడ్, చంద్రబోస్, ఆర్.పి పట్నాయక్, హీరో హీరోయిన్, పి.వి రాజు. అభినయ, జె.జె ప్రకాష్ర్ రావు తదితురల సమక్షంలో, దర్శకుడి తల్లి విజయమ్మ 77వ జయంతిని పురస్కరించుకుని కేక్ కట్ చేసారు. 100 మందికి పైగా పేదలకు, దుస్తులు, గృహోపకరణాలను పంపిణీ చేసారు. 

ముఖ్యఅతిది శివాజి రాజా మాట్లాడుతూ... ప్రార్థించే పెదవులకన్నా, సాయం చేసే చేతులు మిన్న అని జాన్ బాబును కొనియాడారు.

ఆర్.కె గౌడ్ మాట్లాడుతూ... సంగీత సాహిత్యల కలయిక అయిన ఈ పాటలను వినడం ఆనందంగా ఉందని అన్నారు.

దర్శకుడు జాన్ బాబు మాట్లాడుతూ... ఈ చిత్రకథ అనుకున్నప్పుడే హీరో, హీరోయిన్లను ఎన్నుకున్నాని,ఇప్పుడు రష్ చూసాక నా నమ్మకం వమ్ము కాలేదని, సంతోషంగా ఉందని అన్నారు.

నిర్మాత సుధాకర్ మాట్లాడుతూ... బడ్జట్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా, కంటెంట్ కు ప్రాధాన్యత ఇచ్చామని, నటీనటులతో పాటు, సంగీత దర్శకుడు ఆర్.పి, రచయిత చంద్రబోస్ ప్రాణం పోసారని,త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.



Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved