pizza
Happy Wedding pre release function
ఎం.ఎస్.రాజు గారి గురించే హ్యాపి వెడ్డింగ్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ కి వచ్చాను - మెగా పవర్ స్టార్ రాంచరణ్
You are at idlebrain.com > News > Functions
Follow Us


21 July 2018
Hyderabad

సుమంత్ అశ్విన్, నిహారిక జంటగా లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం హ్యాపి వెడ్డింగ్. యువి క్రియేషన్స్, పాకెట్ సినిమా సంయుక్తంగా నిర్మించారు. శక్తికాంత్ కార్తిక్ పాటలందించారు. తమన్ రీ రికార్డింగ్ అందిస్తున్నారు. ఈనెల 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్బంగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ ముఖ్య అతిథిగా ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా

మెగా పవర్ స్టార్ రాంచరణ్ మాట్లాడుతూ... హ్యాపి వెడ్డింగ్ నాకు రిలేషన్ షిప్స్ తో కూడుకున్న ఫంక్షన్. నిహారిక గురించో ఈ సినిమా గురించో మాట్లాడటానికి రాలేదు. ఎం.ఎస్ రాజు గారి గురించే వచ్చాను. యు వి క్రియేషన్స్ వంశీ అన్నా విక్కీ, ప్రమోద్ నాకు చిన్నప్పటి బాగా తెలుసు. వాళ్లు మంచి మనసుతో సినిమాలు తీస్తున్నారు. అందుకే అన్ని హిట్లు అందుకుంటున్నారు. వాళ్ల మీద నమ్మకంతో కూడా చెప్పగలను ఈ సినిమా హిట్ అవుతుందని. నిహారిక చెప్పిన మాటలు, ట్రైలర్స్ చూసిన తర్వాత తప్పకుండా విజయం సాధిస్తుందని డైరెక్టర్ కి చెప్పాను. ట్రైలర్ పండిందంటే సినిమా కూడా విజయం సాధిస్తుందని నమ్ముతాను. శక్తికాంత్ గారి మ్యూజిక్ ఫిదా నాకు చాలా ఇష్టం. మురళీ శర్మ గారితో ఎవడులో కలిసి వర్క్ చేశాం. మళ్లీ కలిసి పనిచేయాలని ఎదురుచూస్తున్నా. శాస్త్రి గారు నా మొదటి సినిమాకు రాశారు. ఇప్పుడు సైరాలో వెరీ వెరీ ఇంపార్టెంట్ సాంగ్ రాస్తున్నారు. చాలా థాంక్స్ సర్. సుమంత్ నాకు చిన్నప్పటి నుంచి చాలా బాగా తెలుసు. యాక్టర్ గా ఎంత కష్టపడతాడో నాకు తెలుసు. ఈ సినిమా తన కెరీర్లో మైల్డ్ స్టోన్ గా మిగాలలి. నెల క్రితం ఎం.ఎస్.రాజు గారి గురించి నాన్నగారు ఓ సంఘటన గురించి చెప్పారు. నేను పుట్టకముందు మా నాన్నకి, అమ్మకి డబ్బులు సరిపోకపోతే చాలామంది నిర్మాతల్ని అడిగారు. ఇవ్వలేదట. అప్పుడు నాన్న గారు ఎం.ఎస్.రాజు గారిని అడిగితే వెంటనే 5000 ఇచ్చారు. అలాంటి మంచి మనసున్న వ్యక్తి రాజు గారు. నేను ఈ ఫంక్షన్ ఇక్కడికి రావడం పెద్ద విషయం కాదు. నా డ్యూటీ అది. మంచి ఫ్యామిలీ ఎప్పుడూ సక్సెస్ ఫుల్ గా ఉండాలని కోరుకుంటున్నాను. థాంక్యూ విష్ యూ ఆల్ ది బెస్ట్. అని అన్నారు.

హీరోయిన్ నిహారిక మాట్లాడుతూ.... ఇక్కడికి వచ్చినందుకు చరణ్ అన్నా చాలా థాంక్స్. హ్యాపి వెడ్డింగ్ స్టోరీ వినగానే ఈ సినిమా ఒప్పుకోవడానికి నాకు ఎక్కువ టైం పట్టలేదు. ఓ అమ్మాయిగా స్టోరీకి కనెక్ట్ అయ్యాను. చాలా రోజులు డైలాగ్స్ హాంట్ చేశాయి. అమ్మాయిలు ఎక్కువగా కనెక్ట్ అవుతారు. లక్ష్మణ్ గారు చాలా థాంక్స్... మంచి స్క్రిప్ట్ ఇచ్చారు. మా సినిమాటోగ్రాఫర్ బాల్ రెడ్డి గారు నన్ను గాజుబొమ్మలా అందంగా చూపించారు. డీటెయిలింగ్ విషయంలో చాలా క్లారిటీ గా ఉంటుంది. డైలాగ్ రైటర్ భవానీ ప్రసాద్ గారు డైలాగ్స్ వల్లే ఈ సినిమా ఒప్పుకున్నాను. ఫిదా సాంగ్స్ లూప్ లో విన్నాను. శక్తికాంత్ గారు హ్యాపి వెడ్డింగ్ కు కూడా పాటలు చాలా బాగా ఇచ్చారు. తమన్ ఆర్ ఆర్ నాకు చాలా ఇష్టం. బ్రూస్లీలో డాడీ వచ్చినప్పుడు వచ్చే ఆర్ ఆర్ నాకు చాలా చాలా ఇష్టం. ఈ సినిమాకు కూడా ఆర్ ఆర్ చేసినందుకు వెరీ వెరీ హ్యాపీ. యువి క్రియేషన్స్ వంశీ గారు ప్రమోద్ గారు స్క్రిప్ట్ చూసి, రషెస్ చూసి ప్రెజెంట్ చేశారు. వెరీ లక్కీ. మురళీ శర్మ గారితో వర్క్ చేసినప్పుడు మా నాన్న గారే గుర్తొచ్చేవారు. చాలా చాలా థాంక్స్ . నరేష్ గారి లాంటి సీనియర్స్ తో వర్క్ చేసే అవకాశం దొరికింది. సెట్లో నిజంగానే పెళ్లి వాతావరణం ఉండేది. సుమంత్ చాలా మంచి కో స్టార్... ఆనంద్ క్యారెక్టర్ లో వేరే వాళ్లను ఊహించుకోలేం. అని అన్నారు.

హీరో సుమంత్ మాట్లాడుతూ... ముందుగా యువి క్రియేషన్స్ ప్రమోద్ గారికి వంశీ గారికి చాలా చాలా థాంక్స్. వాళ్లు లేకపోతే ఈసినిమా ఉండేది కాదు. చరణ్ గారికి చాలా థాంక్స్. ఎంత హార్డ్ వర్క్ చేస్తారో నాకు తెలుసు. నిహారిక కాకుండా అక్షర క్యారెక్టర్ వేరేవాళ్లను ఊహించుకోలేం. సెకండాఫ్ లో కొన్ని సీన్స్ లో నేను ఎమోషనల్ గా చాలా బాగా కనెక్ట్ అయ్యాను. నరేష్ గారు, మురళీ శర్మ గారితో మంచి మెమొరీస్ దొరికాయి. ఈ సినిమా ద్వారా మ్యారేజ్ గురించి చాలా నేర్చుకున్నాను. నా టెక్నీషియన్స్ కి అందరికీ చాలా చాలా థాంక్స్. ఆడియెన్స్ బ్లెస్సింగ్స్ నాకు కావాలి. అని అన్నారు.

అల్లు అరవింద్ గారు మాట్లాడుతూ.... యువి క్రియేషన్స్ వంశీ, ప్రమోద్, విక్కీ గురించి చెప్పాలి. ఫిల్మ్ ఇండస్ట్రీ అంటేనే రిస్క్. రిస్క్ తీసుకోవడంలో పతాకస్థాయికి వెళ్తారు. అలాంటి మంచి వాళ్ల చేతుల్లో దర్శకుడు ఈ సినిమా చేశాడంటే వెరీ లక్కీ. నిహారిక మా ముందు పుట్టి పెరిగి... ఇప్పుడు పోస్టర్స్ లో హీరోయిన్ గా చూస్తుంటే డిఫరెంట్ ఫీలింగ్ కలుగుతుంది. సుమంత్ డీసెంట్, ప్లెజెంట్, రొమాంటిక్ హీరో. ఎం.ఎస్.రాజు చాలా మంచి నిర్మాత. మురళీ శర్మకు ఎస్.వి.రంగారావు అవార్డ్ ఉంటే ఇచ్చేయాలి.
సమ్మోహనం సినిమాలో నరేష్ అద్భుతంగా చేశాడు. అలాంటి మంచి నటీనటులు ఇందులో ఉన్నారు. ఫీల్ గుడ్ ఫిల్మ్ ఇది. అందరికీ ఆల్ ది బెస్ట్. అని అన్నారు.

సిరివెన్నెల సీతారామశాస్త్రి మాట్లాడుతూ.. ఈ చిత్రంలో నేను ఒక పాట రాశాను. ఆ క్రెడిట్ లక్ష్మణ్ కార్యకు దక్కుతుంది. యువి క్రియేషన్స్ వారిని అభినందిస్తున్నా. అభిరుచి, విజయం కలిసి సినిమాలు తీస్తున్నారు. సుమంత్ అశ్విన్ బొద్దుగా ముద్దుగా ఉండేవాడు. సినిమాల కోసం సన్నగా చేశాడు హానీ. ప్రతీ చిత్రంలో క్రమక్రమంగా పరిణితి చెందుతున్నాడు. ఈ సినిమా కథ అందరికీ చాలా అవసరమైంది. లక్ష్మణ్ కార్య చాలా సఫలీకృతుడయ్యాడు. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. అని అన్నారు.

దర్శకుడు లక్ష్మణ్ కార్య మాట్లాడుతూ... సీతారామ శాస్త్రి గారి గురించి ముందుగా చెప్పాలి. ఇంత టైం ఆయనతో స్డేజ్ మీద స్పెండ్ చేస్తా అని అనుకోలేదు. నాకు ఏదైతే కావాలో అది ఇచ్చారు. నా దృష్టిలో ప్రతీ ఒక్కరి లైఫ్ లో అతి పెద్ద ఈవెంట్ మ్యారేజ్. ప్రతీ అబ్బాయి అమ్మాయి, తల్లీ తండ్రీ, రిలేటివ్స్ కనెక్ట్ అవుతారు. థియేటర్ నుంచి బయటికి వచ్చేటప్పుడు హ్యాపీ వెడ్డింగ్ తీసుకెళ్తారు. యువి క్రియేషన్స్, పాకెట్ సినిమాకు చాలా చాలా థాంక్స్. సుమంత్ , నిహారిక ఎంత సపోర్ట్ ఇచ్చారో నాకు తెలుసు. నాతో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ చాలా చాలా థాంక్స్. ఈనెల 28న మీ ముందుకు వస్తున్నాం. చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నా. అని అన్నారు.

న‌టీన‌టులు.. సుమంత్ అశ్విన్‌, నిహారిక, న‌రేష్, ముర‌ళి శ‌ర్మ‌, ప‌విత్ర లోకేష్, తుల‌సి, ఇంద్ర‌జ‌, మ‌ధుమ‌ణి త‌దిత‌రులు..

సాంకేతిక నిపుణులు..

యువి క్రియేష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో
మ్యూజిక్ డైరెక్టర్ - శక్తికాంత్
రీ రీ రికార్డింగ్ - ఎస్. ఎస్. తమన్
కెమెరా - బాల్ రెడ్డి
మ్యూజిక్ - శ‌క్తికాంత్ కార్తిక్‌
పి.ఆర్‌.ఓ-ఏలూరు శ్రీను
నిర్మాత‌ - పాకెట్ సినిమా
ద‌ర్శ‌క‌త్వం - ల‌క్ష్మ‌ణ్ కార్య‌

 


Photo Gallery (photos by G Narasaiah)

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved