pizza
Jawan pre release function
`జ‌వాన్‌` ప్రీ రిలీజ్ వేడుక
You are at idlebrain.com > News > Functions
Follow Us

19 November 2017
Hyderabad

సాయిధ‌ర‌మ్‌తేజ్‌, మెహ‌రీన్ ఫిర్జాదా జంట‌గా న‌టించిన చిత్రం `జ‌వాన్‌`. కృష్ణ నిర్మించారు. దిల్‌రాజు స‌మ‌ర్పించారు. బీవీయ‌స్ ర‌వి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఇదే వేడుక‌లో ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందించిన పాట‌లను కూడా విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా...

గుహ‌న్ మాట్లాడుతూ ``సినిమా చాలా బాగా వ‌చ్చింది. తేజ్ ఫ్యాన్స్ కి ఫీస్ట్ లాగా ఉంటుంది ఈ చిత్రం`` అని అన్నారు.

బ్ర‌హ్మ క‌డ‌లి మాట్లాడుతూ ``సినిమాకు ప‌నిచేయ‌డం చాలా ఆనందంగా ఉంది. అంద‌రూ చాలా మంచి స‌పోర్ట్ ఇచ్చారు`` అని చెప్పారు.

బీవీయ‌స్ ర‌వి మాట్లాడుతూ ``డ్ర‌స్ వేసుకున్న ప్ర‌తి పోలీసూ ఓ పౌరుడే. అలాగే డ్ర‌స్ వేసుకున్న ప్ర‌తి పౌరుడూ జ‌వానే. ఇందులో మా హీరో డ్ర‌స్ వేసుకోని జ‌వాన్‌. త‌న ఇంటి కోసం ఏం చేశాడ‌నేది ఆస‌క్తిక‌రం.

చిత్ర ర‌చ‌యిత‌లు సాయికృష్ణ‌, క‌ల్యాణ్, వంశీ మాట్లాడుతూ `` ఇది రెగ్యుల‌ర్ చిత్రం కాదు. జెన్యూన్‌గా కథ‌ను న‌మ్మి సినిమా చేస్తే ఎలా ఉంటుందో ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవ‌చ్చు`` అని చెప్పారు.

భోగ‌వ‌ల్లి ప్ర‌సాద్‌, భ‌గ‌వాన్‌, పుల్ల‌రావు మాట్లాడుతూ ``ఈ సినిమా చేసిన హీరో, ద‌ర్శ‌కుడు, నిర్మాత‌ల‌కు మంచి హిట్ రావాలి`` అని చెప్పారు.

అనిల్ రావిపూడి మాట్లాడుతూ ``రాజుగారి స‌మ‌ర్ప‌ణ‌లో కృష్ణ‌గారు తెర‌కెక్కిస్తున్న సినిమా. డ్యాన్స్, ఫైట్స్ ఎన‌ర్జిటిక్‌గా ప‌నిచేస్తారు. ఆయ‌న‌కూ, ర‌విగారికి హిట్ కావాలి. మొద‌టి సినిమా హిట్ అయితే ద్వితీయ విఘ్నం అంటారు. మొద‌టి సినిమా ఫ్లాప్ అయితే ద్వితీయ ల‌గ్నం అని అంటారు. ఈ సినిమా అంద‌రికీ మంచి పేరు తెచ్చిపెట్టాలి`` అని తెలిపారు.

గోపీచంద్ మ‌లినేని మాట్లాడుతూ ``అంద‌రూ నాకు ఆప్తులే. మా కృష్ణ‌గారు, మా హీరో, మా ర‌వి, మా రాజుగారు అంద‌రూ క‌లిసి చేసిన చిత్రం ఇది. పోసాని ద‌గ్గ‌ర చేసేట‌ప్ప‌టి నుంచి ర‌వి నాకు ప‌రిచ‌యం. జెన్యూన్ స్క్రిప్ట్ తో ఈ సినిమా చేస్తున్నారు. మంచి సినిమా అవుతుంద‌ని తెలుసు. విజువ‌ల్స్ బావున్నాయి. పాట‌లు న‌చ్చాయి. దిల్‌రాజుగారి ఆధ్వ‌ర్యంలో ఈ సినిమా మా కృష్ణ‌గారికి పెద్ద హిట్‌ కావాలి`` అని చెప్పారు.

విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ మాట్లాడుతూ ``భార‌త‌దేశంలో కాంట్ర‌వ‌ర్శీ లేనిది ఒక‌టి ఉంది. అదే జ‌వాన్. అంత మంచి పేరు పెట్టుకున్నారు ర‌వి. మంచి టీమ్‌ని ఎంపిక చేసుకున్నారు. స‌క్సెస్ క‌ళ ముందే క‌నిపిస్తోంది`` అని చెప్పారు.

స‌తీశ్ వేగేశ్న మాట్లాడుతూ ``త‌ల్లిదండ్రుల త‌ర్వాత ఏ దేశంలోనైనా అంద‌రూ గుర్తుంచుకోవాల్సింది, సెల్యూట్ చేయాల్సింది జ‌వాన్‌కి, కిసాన్‌కి. త‌ల్లిదండ్రుల‌కు ఇచ్చినంత గౌర‌వం వాళ్ల‌కు ఇవ్వాలి. ర‌వి మా కులం. అంటే ర‌చ‌యిత‌ల కులం. ఈ టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్`` అని చెప్పారు.

డీవీవీ దాన‌య్య మాట్లాడుతూ ``సినిమా మంచి హిట్ కావాలి`` అని అన్నారు.

మారుతి మాట్లాడుతూ ``ర‌విగారి చాన్నాళ్ల కోరిక నెర‌వేర‌నుంది. మెగా, ప‌వ‌ర్‌స్టార్ మిక్స్ తేజ్‌. దిల్‌రాజుగారి హ్యాండ్ చాలా బావుంది. మెహ్రీన్ ఇంకో స‌క్సెస్ కొడుతుంది. టీమ్ అంద‌రికీ స‌క్సెస్ తెచ్చిపెట్టే సినిమా ఇది`` అని అన్నారు.

హ‌రీశ్ శంక‌ర్ మాట్లాడుతూ ``ఇది తేజ్ ఆడియో వేడుక‌లా లేదు. నిజంగా ప‌వ‌ర్‌స్టార్ ఆడియో వేడుక‌లా ఉంది. త‌మ‌న్ చాలా బాగా సంగీతం చేశారు. బంగారు పాట‌ను మ‌చ్చ ర‌వి తీసుకోక‌పోయి ఉంటే, నా సినిమాకు నేను తీసుకుని ఉండేవాడిని. ర‌వి ర‌చ‌యిత‌గా మిగ‌తా సినిమాల‌కు ప‌నిచేస్తూ ఎప్పుడు ఫోన్ చేసినా బిజీగా ఉన్నాను అని అనేవాడు. బ‌య‌ట ప‌నులు చేసుకుంటూ ఈ స్క్రిప్ట్ వ‌ర్క్ చేశాడు. ఈ క‌థ విన్న త‌ర్వాత బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా అనిపించింది. ర‌వి రోజుకు 20 గంట‌లు ప‌నిచేయ‌డం నాకు తెలుసు. ఈ సినిమా మొద‌లు కావ‌డానికి సాయిధ‌ర‌మ్‌తేజ్ అమ్మ కార‌ణం. క‌థ న‌చ్చి నిర్మాత‌గా చేయాల‌ని అనుకున్నా. కానీ ద‌ర్శ‌క‌త్వం ప‌నులు మొద‌ల‌య్యాయి. అందుకే నేను, కృష్ణ‌గారూ క‌లిసి దిల్‌రాజును క‌లిశాం. తేజ్ చేసిన అన్ని సినిమాల్లోకీ ఈ సినిమా క‌ల్యాణ్‌గారికి చాలా న‌చ్చుతుంది. ర‌చ‌యిత క‌థ‌లో నిజాయ‌తీ తోడైతే చాలా బావుంటుంది. నేను పాట‌లు, ర‌ష్ చూశాను. గుహ‌న్ సినిమాటోగ్ర‌ఫీ, తేజ్ మూవ్స్, కృష్ణ‌గారి ప్రొడ‌క్ష‌న్ వేల్యూస్ చాలా బావున్నాయి`

క‌రుణాక‌ర‌న్ మాట్లాడుతూ ``ఎప్పుడూ చెప్పేదే.. అమ్మా, నాన్న‌, ప‌వ‌న్ క‌ల్యాణ్ అని. నేను త‌మ్ముడితో త‌ర్వాతి సినిమా చేయ‌బోతున్నాను. టెన్ష‌న్‌గా ఉంది. పెద్ద హిట్ కావాలి`` అని చెప్పారు.
బ‌న్నీ వాసు మాట్లాడుతూ ``ప‌వ‌న్‌గారు అవార్డు తీసుకున్నారు. తేజ్ ఆడియో వేడుక జ‌రుగుతోంది. మ‌న‌కు అంద‌రికీ చాలా పండుగ‌లాగా ఉంది. ఈ సినిమా పెద్ద హిట్ కావాలి`` అని చెప్పారు.
బాబీ మాట్లాడుతూ ``మా రైట‌ర్స్ ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన ద‌ర్శ‌కుడు ర‌వి. స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ రివ్యూలు వ‌చ్చాయి. ఆ స‌మ‌యంలో టెన్ష‌న్‌గా ఉంటే, కల్యాణ్గారు, ర‌వితేజ‌గారు ఫోన్‌లు చేశారు. ఆ త‌ర్వాత తేజ్ ఫోన్ చేశారు. మంచి క‌థ ఉటే సినిమా చేద్దామ‌న్నారు. చాలా ఆనందంగా అనిపించింది. స‌క్సెస్‌లు ఉన్న డైర‌క్ట‌ర్లు అక్క‌ర్లేదు ఆయ‌న‌కి. క‌థ న‌చ్చాలి. మ‌నిషి న‌చ్చాలి. అంతే. అంత మంచి మ‌న‌సున్న సాయి చేసిన సినిమా పెద్ద హిట్ కావాలి`` అని తెలిపారు.

మెహ‌రీన్ మాట్లాడుతూ ``మెగాస్టార్ ఫ్యాన్స్ కుటుంబంలో నేనూ ఒక‌దాన్న‌ని ఫీల్ అవుతున్నాను. కృష్ణ‌గాడివీర‌ప్రేమ‌గాథ త‌ర్వాత నేను సంత‌కం చేసిన సినిమా ఇది. ఈ సినిమాలో గ్లామ‌ర‌స్‌గా క‌నిపించాను. నాకు న‌చ్చింది. మీకు కూడా న‌చ్చుతుంద‌ని అనుకుంటున్నాను`` అని చెప్పారు.

ప్ర‌స‌న్న మాట్లాడుతూ ``జ‌వాన్ నా కెరీర్‌లో చాల కీల‌క‌మైన చిత్రం. ఈ స్టేజ్‌లో నేను ఉన్నానంటే అందుకు కార‌ణం కోన వెంక‌ట్‌, గోపీమోహ‌న్‌గారు. ఈ పాత్ర కోసం ర‌విగారు యాక్ట‌ర్‌ను వెతుకుతున్న‌ప్పుడు వారిద్దరూ నా పేరు చెప్పారు. సినిమాలో నాకు ర‌వి నెగ‌టివ్ పాత్ర ఇచ్చారు. కానీ నా కెరీర్‌లో మాత్రం చాలా ఇంపాక్ట్ ఇచ్చారు. నేను త‌మిళ్‌లో 15 ఏళ్లుగా ఉన్నాను. కానీ తెలుగులో చాలా బాగా వెల్‌క‌మ్ చేశారు. నిర్మాత ప్యాష‌న్‌ని నేను క‌ళ్లారా చూశాను`` అని తెలిపారు.

ప్ర‌స‌న్న మాట్లాడుతూ ``జ‌వాన్ నా కెరీర్‌లో చాల కీల‌క‌మైన చిత్రం. ఈ స్టేజ్‌లో నేను ఉన్నానంటే అందుకు కార‌ణం కోన వెంక‌ట్‌, గోపీమోహ‌న్‌గారు. ఈ పాత్ర కోసం ర‌విగారు యాక్ట‌ర్‌ను వెతుకుతున్న‌ప్పుడు వారిద్దరూ నా పేరు చెప్పారు. సినిమాలో నాకు ర‌వి నెగ‌టివ్ పాత్ర ఇచ్చారు. కానీ నా కెరీర్‌లో మాత్రం చాలా ఇంపాక్ట్ ఇచ్చారు. నేను త‌మిళ్‌లో 15 ఏళ్లుగా ఉన్నాను. కానీ తెలుగులో చాలా బాగా వెల్‌క‌మ్ చేశారు. నిర్మాత ప్యాష‌న్‌ని నేను క‌ళ్లారా చూశాను`` అని తెలిపారు.


వినాయ‌క్ మాట్లాడుతూ ``చిరంజీవిని, ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌ల‌పోతే సాయిధ‌రమ్‌తేజ్‌. త‌న‌తో నేను ఒక సినిమా చేస్తున్నాను. ఇప్ప‌టి వ‌ర‌కు 40 రోజులు షూటింగ్ చేశాం. ఈ 40 రోజుల్లో ఏ రోజూ త‌ను సెకండ్ టేక్ అని చెప్పించుకోలేదు. సినిమా ప‌ట్ల త‌ను ఫోక‌స్‌గా ఉన్నాడు. అలాగే నాకు ఇష్ట‌మైన ద‌ర్శ‌కుల్లో బీవీయ‌స్ ర‌వి ఒక‌డు. అత‌నికి సాయి ద‌ర్శ‌కుడిగా పిలిచి అవ‌కాశం ఇచ్చాడు. నిర్మాత కృష్ణ తొలిసారి చేస్తున్న ఈ సినిమా స‌క్సెస్ కావాలి`` అని తెలిపారు.


కొర‌టాల మాట్లాడుతూ ``బీవీయ‌స్ ర‌వి నా కాలేజ్ మేట్‌. త‌న‌తో ఉంటే స‌మ‌య‌మే తెలియ‌దు. అంత‌లా ఎంట‌ర్‌టైన్ చేస్తుంటాడు. కృష్ణ‌కూడా నాకు ఎంతో కావాల్సిన వ్య‌క్తి. నాకు కావాల్సిన వాళ్లు క‌లిసి చేస్తున్న సినిమా ఇది. అంద‌రూ 100 శాతం ఎఫెక్ట్ పెట్టి చేశారు. సాయిధ‌ర‌మ్‌తేజ్ చాలా పాజిటివ్ హీరో. అలాంటి వారు ప‌రిశ్ర‌మ‌లో చాలా త‌క్కువ‌. త‌ను ఎప్పుడు క‌లిసినా పాజిటివ్‌గా రెస్పాండ్ అవుతుంటాడు. త‌ను త్వ‌ర‌లోనే పెద్ద లీగ్ హీరో కావాల‌ని కోరుకుంటున్నాను. త‌మ‌న్ పాట‌లు బావున్నాయి`` అని చెప్పారు.


బీవీయ‌స్ ర‌వి మాట్లాడుతూ ``2015లో తేజ్‌కి ఈ క‌థ చెప్పాను. క‌థ విన‌గానే సినిమా చేస్తాన‌ని చెప్పాడు. కానీ సినిమా మొద‌లుకావ‌డానికి ఏణ్ణ‌ర్ధం ప‌ట్టింది. ఈ జ‌ర్నీలో సాయిధ‌ర‌మ్‌తేజ్ నాకు పూర్తిగా స‌హ‌క‌రించాడు. నేను ఎంతో నిజాయ‌తీతో, నిక్కచ్చిగా త‌యారు చేసుకున్న పాత్ర ఇది. అంతే నిజాయ‌తీగా తేజ్ క‌ష్ట‌ప‌డ్డాడు. ఇంటికో జ‌వాన్ ఉండాల‌ని చెప్పే సినిమా ఇది. కృష్ణ‌గారి స‌హ‌కారం మ‌ర్చిపోలేను. యూనిట్‌కి కావాల్సిన‌వి స‌మ‌కూర్చారు. దిల్‌రాజు మా సినిమాకు బ్యాక్‌బోన్‌. త‌మ‌న్ ట్యూన్‌లే కాదు.. ఆర్‌.ఆర్‌. కూడా బాగా ఇచ్చాడు. డిసెంబ‌ర్ 1న ఈ సినిమా విడుద‌ల కానుంది`` అని అన్నారు.


దిల్‌రాజు మాట్లాడుతూ ``జవాన్ టైటిల్ సాంగ్‌కి ఇన్‌స్పిరేష‌న్ ఖుషి, బద్రి సినిమాల నుంచి తీసుకున్న‌దే. కృష్ణ చాలా మంచి వ్య‌క్తి. ర‌వితో నాకు భ‌ద్ర నుంచి ప‌రిచ‌యం ఉంది. త‌ను మంచి ర‌చ‌యిత‌. ఈ సినిమా స్క్రిప్ట్ విష‌యంలో స్నేహితుడు ర‌వికోసం కొర‌టాల స‌పోర్ట్ చేయ‌డం చాలా ఆనందంగా అనిపించింది. తేజ్‌, నేను క‌లిసి చేసిన సినిమాల‌న్నీ మంచి స‌క్సెస్‌లయ్యాయి. ఆ స‌క్సెస్ జ‌ర్నీ ఈ సినిమాతో మ‌రోసారి కంటిన్యూ అవుతుంది. రీరికార్డింగ్‌తో సినిమా చూశా . త‌మ‌న్ ఎక్స్ ట్రార్డిన‌రీ రీ రికార్డింగ్ ఇచ్చాడు. డిఫ‌రెంట్ అప్రోచ్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది`` అని చెప్పారు.


సాయిధ‌ర‌మ్‌తేజ్ మాట్లాడుతూ ``మ‌నం తినే ప్ర‌తి మెతుకు పైనా పేరు రాసి ఉంటుంద‌ని అంటారు. నేను తినే ప్ర‌తి మెతుకుపైనా మా ముగ్గురి మావ‌య్య‌ల పేర్లు ఉంటాయి. మా ఫ్యామిలీకి చిరంజీవి, ప‌వ‌న్ మావ‌య్య‌లు ఎలా జ‌వాన్లుగా నిల‌బ‌డ్డారో, అలా ప్ర‌తి ఫ్యామిలీ కి ఓ జ‌వాన్ అండ‌గా ఉంటాడు. ఈ సినిమా అలాంటి జ‌వాన్ల‌ను ఆధారంగా చేసుకుని చేసిన విష‌యం. నిర్మాత కృష్ణ‌గారు చాలా మంచి వ్య‌క్తి. మేకింగ్‌లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాలేదు. త‌మ‌న్ మంచి పాట‌ల్ని, చ‌క్క‌టి రీరికార్డింగ్‌ని అందించారు. ఇటీవ‌లే సినిమా చూసి థ్రిల్ అయ్యాను. ప్ర‌స‌న్న వంటి సీనియ‌ర్ ఆర్టిస్టుతో న‌టించ‌డం చాలా ఆనందంగా అనిపించింది. నాకు బ్ర‌ద‌ర్‌లాగా స‌పోర్ట్ చేశారు. గోల్డెన్ లెగ్‌గా పేరు తెచ్చుకున్న మెహ‌రీన్ కూడా న‌టించ‌డం చాలా హ్యాపీ. ఖుషి సినిమా స‌మ‌యం నుంచి నాకు గుహ‌న్‌గారు తెలుసు. ఈ సినిమాలో ఆయ‌న‌తో క‌లిసి ప‌నిచేయ‌డం మంచి ఎక్స్ పీరియ‌న్స్. న‌న్ను ధైర్యంగా ఉండేలా చేసి, మా ఇంటికి జ‌వాన్‌లా నిలిచేలా చేసింది ప‌వ‌న్ క‌ల్యాణ్‌గారు. మా ముగ్గురు మావ‌య్య‌ల సాయంతోనే ఇలా ఉన్నాను. వాళ్ల ఇంటి ముందు జ‌వాన్‌గా నిల‌బ‌డ‌టానికి సిద్ధంగా ఉన్నాను. ఈ టైటిల్ పెట్ట‌గానే బాధ్య‌త‌గా చేసిన సినిమా ఇది. డిసెంబ‌ర్ 1న విడుద‌ల కానుంది. త‌ప్ప‌కుండా ఆద‌రించాలి`` అని అన్నారు.

 

 


Photo Gallery (photos by G Narasaiah)

 

 

 

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved