pizza
Meda Meeda Abbayi pre release function
`మేడ‌మీద అబ్బాయి` డెఫ‌నెట్‌గా హిట్ కొట్ట‌బోతున్నాను - అల్ల‌రి న‌రేష్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

3 September 2017
Hyderaba
d

అల్లరి నరేష్ కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రం `మేడమీద అబ్బాయి`. ప్రజిత్ దర్శకత్వం వహించారు. నిఖిలా విమల్ కథానాయిక. జాహ్నవి ఫిల్మ్స్ పతాకంపై బొప్పన చెంద్రశేఖర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబ‌ర్ 8న విడుద‌ల‌వుతుంది. ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ ఆదివారం హైద‌రాబాద్‌లో జరిగింది. అందులో భాగంగా షాన్ రెహ‌మాన్ సంగీతం అందించిన ఈ సినిమా పాట‌ల బిగ్ సీడీని హీరో నిఖిల్‌, సందీప్ కిష‌న్ విడుద‌ల చేశారు. ఆడియో సీడీల‌ను హీరో నిఖిల్ విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో..

సందీప్ కిష‌న్ మాట్లాడుతూ - ``ఇన్నాళ్లు న‌రేష్ అన్న‌య్య‌, ఈ మ‌ధ్య తండ్రిగా మారాడు. అల్ల‌రి న‌రేష్ అనేది ఒక బ్రాండ్‌. ఆ బ్రాండ్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చి చేసిన ఓ నార్మ‌ల్ సినిమాయే మేడ‌మీద అబ్బాయి. త‌ను కొత్త‌గా ప్ర‌య‌త్నం చేసిన ప్ర‌తిసారి స‌క్సెస్ అయ్యారు. నాకు ఈ సినిమా మ‌ల‌యాళ మాతృక అంటే ఎంతో ఇష్టం. న‌రేష్ స‌హా ఎంటైర్ టీంకు ఆల్ ది బెస్ట్‌`` అన్నారు.

అవ‌స‌రాల శ్రీనివాస్ మ‌ట్లాడుతూ - ``ప్రేక్ష‌కులు మంచి సినిమాల‌ను ప్రేక్ష‌కులు ఆదరిస్తున్నారు. మేడ మీద అబ్బాయి మంచి సినిమా. అంద‌రం క‌ష్ట‌ప‌డి సినిమా చేశాం. పాట‌లు క్యాచీగా ఉన్నాయి. సినిమాలో ప‌నిచేసిన అంద‌రికీ అభినంద‌నలు`` అన్నారు.

హీరో నిఖిల్ మాట్లాడుతూ - ``మనం అంద‌రం కొత్త సినిమాలు చూడాల‌ని అనుకుంటున్నాం. కొత్త జోన‌ర్ సినిమాలు చూస్తున్నారు. అలాంటి కొత్త న్యూ ఏజ్ జోన‌ర్ మూవీయే మేడ మీద అబ్బాయి. క‌థ నాకు తెలుసు. అవుటండ్ అవుట్ ఎంట‌ర్‌టైన‌ర్‌. కొత్త‌ద‌నంతో కూడిన సినిమా. ట్రైల‌ర్‌, టీజ‌ర్ సూప‌ర్బ్‌గా ఉన్నాయి. సినిమా త‌ప్ప‌కుండా పెద్ద స‌క్సెస్ సాధిస్తుంది`` అన్నారు.

ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ మాట్లాడుతూ - `` ఈ సినిమా టైటిల్‌ను న‌రేష్ ఎప్పుడో చెప్పాడు. టైటిల్ విన‌గానే న‌చ్చింది. పాట‌లు చాలా బావున్నాయి. షాన్ రెహ‌మాన్ మంచి సంగీతం అందించారు. న‌రేష్‌కు ఇది కొత్త ర‌క‌మైన సినిమా. సినిమా అతి పెద్ద విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

నవీన్ చంద్ర మాట్లాడుతూ - ``మ‌న తెలుగు ఇండ‌స్ట్రీలో మంచి న‌టుల్లో న‌రేష్ ఒక‌రు. త‌న కామెడి టైమింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అలాగే ఇన్‌టెన్స్ క్యారెక్ట‌ర్స్‌లో చ‌క్క‌గా న‌టిస్తారు. ద‌ర్శ‌కుడు ప్రజిత్‌, హీరోయిన్ విమ‌ల స‌హా అంద‌రికీ ఆల్ ది బెస్ట్‌`` అన్నారు.

Glam gallery from the event

అల్ల‌రి న‌రేష్ మాట్లాడుతూ - ```మేడ మీద అబ్బాయి` అనే టైటిల్‌ను 2012 నుండి మేం రిజిష్ట‌ర్ చేసుకుంటూ వ‌స్తున్నాం. కృష్ణ భ‌గ‌వాన్‌గారు ఈ టైటిల్‌ను నాకు చెప్పారు. డిఫ‌రెంట్ క‌థ‌ల‌తో సినిమాలు చేయాల‌నుకున్న‌ప్పుడు ఆ క‌థ‌ను ముందుగా నిర్మాత న‌మ్మాలి. సార్ మీరు కామెడి సినిమాలే చేస్తున్నారు. ఓ డిఫ‌రెంట్ సినిమా చేయాల‌ని నిర్మాత చంద్ర‌శేఖ‌ర్ గారు నాతో అన్నారు. అన్న‌మాట ప్ర‌కార‌మే చంద్ర‌శేఖ‌ర్‌గారు ఈ క‌థ‌తో నా వ‌ద్ద‌కు వ‌చ్చారు. నా శ్రేయోభిలాషులు అంద‌రూ ట్రాక్ మార్చి సినిమాలు చేయ‌మ‌ని అన్నారు. అంద‌రి స‌ల‌హా మేర ట్రాక్ మార్చి నేను చేసిన సినిమా ఇది. క‌చ్చితంగా ఈ సినిమా త‌ర్వాత నా ద‌గ్గ‌ర‌కు రైట‌ర్స్ డిఫ‌రెంట్ క‌థ‌ల‌తో వ‌స్తారు. మాతృక‌ను డైరెక్ట్ చేసిన ప్ర‌జిత్‌గారు, ఈ సినిమాను తెలుగులో కూడా డైరెక్ట్ చేశారు. నిఖిలా విమ‌ల్‌, అవ‌స‌రాల శ్రీనివాస్ ఇలా మంచి టీంతో వ‌ర్క్ చేశాను. హైప‌ర్ ఆది ఈ సినిమాలో పూర్తి స్థాయి న‌టుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. భాస్క‌ర భ‌ట్ట‌, భువ‌న‌చంద్ర స‌హా అంద‌రికీ థాంక్స్‌. త‌ప్ప‌కుండా ఈసినిమాతో హిట్ కొట్ట‌బోతున్నాన‌ని క‌చ్చితంగా చెప్ప‌గ‌ల‌ను`` అన్నారు.

ద‌ర్శ‌కుడు ప్ర‌జిత్ మాట్లాడుతూ - ``తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో సినిమా చేయ‌డం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను మ‌ల‌యాళంలోడైరెక్ట్ చేసిన సినిమానే తెలుగులో డైరెక్ట్ చేశాను. నాకు అవ‌కాశం ఇచ్చిన బొప్ప‌న చంద్ర‌శేఖ‌ర్‌గారికి, అల్ల‌రి న‌రేష్‌గారికి థాంక్స్‌`` అన్నారు. అవసరాల శ్రీనివాస్, జయప్రకాష్, తులసి, సుధ, సత్యం రాజేష్, మధునందన్, జబర్దస్త్ ఆది, పద్మ జయంతి, రవిప్రకాష్, వెన్నెల రామారావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఉన్ని ఎస్. కుమార్, సంగీతం: షాన్ రెహమాన్, ఆర్ట్: రాజీవ్ నాయర్, ఎడిటర్: నందమూరి హరి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎం.ఎస్.కుమార్, సమర్పణ: శ్రీమతి నీలిమ, నిర్మాత: బొప్పన చంద్రశేఖర్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి.ప్రజిత్.

 

 

 


Photo Gallery (photos by G Narasaiah)

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved