pizza
MLA pre release function
'ఎం.ఎల్‌.ఎ' ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌
You are at idlebrain.com > News > Functions
 
Follow Us

20 March 2018
Hyderabad

నందమూరి కల్యాణ్‌ రామ్‌, కాజల్‌ అగర్వాల్‌ హీరో హీరోయిన్లుగా టి.జి.విశ్వప్రసాద్‌ సమర్పణలో బ్లూ ప్లానెట్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై ఉపేంద్ర మాధవ్‌ దర్శకత్వంలో కిరణ్‌ రెడ్డి, భరత్‌ చౌదరి నిర్మించిన చిత్రం 'ఎంఎల్‌ఎ'. ఈ సినిమా మార్చి 23న విడుదలవుతోంది. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో ...

శ్రీనువైట్ల మాట్లాడుతూ - ''రియల్‌ లైఫ్‌లో ఎవరి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా వచ్చి ఎమ్మెల్యే అవడం ఎంత కష్టమో నాకు తెలియదు. అయితే ఎవరి బ్యాక్‌గ్రౌండ్‌ లేకండా డైరెక్టర్‌ అవడం ఎంత కష్టమో నాకు తెలుసు. ఉపేంద్ర నా దగ్గర చాలా సంవత్సరాలు పనిచేశాడు. తను ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో కూడా తెలుసు. డైరెక్టర్‌ అయ్యే క్రమంలో తనకి ఎదురయ్యే అనుభవాలను నాకు ఎప్పుడూ చెబుతుండేవాడు. నేను కూడా నాకు తోచిన మాటలు చెబుతుండేవాడిని. 'ఎమ్మెల్యే' సినిమాను చేయడానికి తన పడ్డ కష్టం నాకు తెలుసు. తన కలను నిజం చేసింది కల్యాణ్‌ రామ్‌. ఆయనకు థాంక్స్‌. నిర్మాతలు కిరణ్‌రెడ్డి, భరత్‌ రెడ్డి, ప్రసాద్‌గారికి మనస్ఫూర్తిగా థాంక్స్‌. సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్‌తో నాకు మంచి పరిచయం ఉంది. సినిమా పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ - ''కల్యాణ్‌రామ్‌ యు.ఎస్‌లో ఉన్నప్పుడు తను హీరో కావాలనుకుంటున్నాడని మాట్లాడుకునే క్రమంలో తన ఫోటోలను కొన్నింటిని చూశాను. అప్పుడు తను చబ్బి చబ్బీగా ఉండేవాడు. ఇండస్ట్రీకి ఎన్టీఆర్‌గారు, ఎయన్నార్‌గారు రెండు కళ్లులాంటివారు. వారి మనవడుగా ఇండస్ట్రీలోకి వచ్చే క్రమంలో బిజినెస్‌, ఉద్యోగం ఇలా అన్నింటిని వదులుకున్నాడు. హరికృష్ణగారు ఎంతటి నిజాయితీ పరులో కల్యాణ్‌రామ్‌ అంతటి మంచి హృదయమున్న వ్యక్తి. కల్యాణ్‌రామ్‌ ఎమ్‌.ఎల్‌.ఎ అంటే ఇక్క మంచి లక్షణాలున్న అబ్బాయి. అలా మంచి లక్షణాలున్న అబ్బాయి కావడం కంటే.. తను రాజకీయంగా ఎమ్‌.ఎల్‌.ఎ కావడం వ్యక్తిగతంగా నాకు ఇష్టం. తనలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే.. సమాజం ఎంతో బాగుంటుంది'' అన్నారు.

జెమిని కిరణ్‌ మాట్లాడుతూ - ''కల్యాణ్‌రామ్‌, ఉపేంద్రమాధవ్‌ సహా యూనిట్‌ సభ్యులకు అభినందనలు'' అన్నారు.

భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ - ''కల్యాణ్‌రామ్‌గారు అజాత శత్రువు. మంచి డిసిప్లేన్‌ ఉన్న హీరో. తనకు మంచి భవిష్యత్‌ ఉండాలి. నిర్మాతలు విశ్వప్రసాద్‌, కిరణ్‌రెడ్డిగారు, భరత్‌చౌదరిలతో నాకు మంచి అనుబంధం ఉంది. ప్యాషన్‌తో సినిమాలు చేస్తున్నారు'' అన్నారు.

వి.ఎన్‌.ఆదిత్య మాట్లాడుతూ - ''నేనే రాజు నేనే మంత్రితో సక్సెస్‌ కొట్టిన కిరణ్‌ రెడ్డి, భరత్‌ చౌదరిగారితో పాటు అలామొదలైంది సినిమాకు కో ప్రొడ్యూసర్‌గా చేసిన వివేక్‌గారు కాంబినేషన్‌లో రానున్న సినిమా ఇది. వీరికి విశ్వప్రసాద్‌గారు జత కలిశారు. విశ్వప్రసాద్‌గారికి సినిమా అంటే ఎంతో ప్యాషన్‌ ఉన్న వ్యక్తి. తనకి ఈ సినిమాతో మంచి సక్సెస్‌ను అందుకుంటారు. కల్యాణ్‌రామ్‌ వంటి మంచి హీరో, ఉపేంద్ర మాధవ్‌ దర్శకుడిగా రూపొందిన సినిమా. ఎంటైర్‌ టీమ్‌కి ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు.

రవికిషన్‌ మాట్లాడుతూ - ''కల్యాణ్‌ రామ్‌కి సినిమా పెద్ద హిట్‌ అవుతుంది. నేను నటుడిగా పాతికేళ్ల ప్రయాణంలో 500 సినిమాలు చేశాను. ఆ అనుభవంతో సినిమా తప్పకుండా ఆకట్టుకుంటుందని చెబుతున్నాను'' అన్నారు.

బ్రహ్మానందం మాట్లాడుతూ - ''డైరెక్టర్‌ ఉపేంద్ర మాధవ్‌ తన బాధ్యతను ఎక్కువగా ప్రేమించే డైరెక్టర్స్‌లో ఒకరు. తను బాగా కష్టపడతాడు. తనలాంటి డైరెక్టర్స్‌కి తప్పకుండా సక్సెస్‌ దొరుకుతుంది. కిరణ్‌రెడ్డి, భరత్‌ చౌదరి, విశ్వప్రసాద్‌ యువ నిర్మాతలుగా చేసిన చిత్రమిది. కల్యాణ్‌రామ్‌తో తొలిసినిమా చేసిన కాజల్‌ పదేళ్ల తర్వాత మళ్లీ కలిసి నటించింది. తప్పకుండా సినిమా పెద్ద హిట్‌ అవుతుంది. సాలూరి రాజేశ్వరరావు తర్వాత ఆ స్థాయిలో సంగీతం అందించగల మ్యూజిక్‌ డైరెక్టర్‌ మణిశర్మగారి సంగీతంలో సినిమా రూపొందింది. ఎంటైర్‌ టీంకు అభినందనలు'' అన్నారు.

ఎం.ఎల్‌.కుమార్‌ చౌదరి మాట్లాడుతూ - ''కల్యాణ్‌రామ్‌, కాజల్‌ అంటే చాలా మంచి కాంబినేషన్‌. నిర్మాతలు విశ్వప్రసాద్‌, కిరణ్‌ రెడ్డి, భరత్‌ చౌదరి, వివేక్‌లు మంచి ప్యాషన్‌తో చేసిన సినిమా ఇది. సినిమా పెద్ద హిట్‌ అయ్యి ఉపేంద్రమాధవ్‌కు మంచి పేరు రావాలి'' అన్నారు.

ఎన్‌.శంకర్‌ మాట్లాడుతూ - ''కల్యాణ్‌రామ్‌గారికి ఈ ఎం.ఎల్‌.ఎ టైటిల్‌ చక్కగా యాప్ట్‌ అవుతుంది. తను ముందు నుండి డిఫరెంట్‌ క్యారెక్టర్స్‌ చేసుకుంటూ వెళుతున్నాడు. అలాగే కాజల్‌ కూడా చాలా ప్రాముఖ్యత ఉన్న పాత్రలో నటించాడు. వీరిద్దరి జోడి తెరపై చాలా బావుంటుంది. రవికిషన్‌, పోసాని, బ్రహ్మానందం, పృథ్వీ వంటి ఎందరో మంచి నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేసిన చిత్రమిది. ఉపేంద్ర మాధవ్‌కి, నిర్మాతలకు మంచి సినిమా పేరు, డబ్బులను తెచ్చి పెట్టాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

కోన వెంకట్‌ మాట్లాడుతూ - ''సినిమా రిలీజ్‌ తర్వాత భారీ మెజారిటీని సాధిస్తుందని చెప్పగలను. ఎందుకంటే స్క్రిప్ట్‌ స్టేజ్‌ నుండి ఈ సినిమాను ఫాలో అవుతున్నాను. రీసెంట్‌గా సినిమాను చూశాను కూడా. ఉపేంద్ర మాధవ్‌ రైటింగ్‌లో నాకు, గోపీ మోహన్‌కు శిష్యుడు. టైమింగ్‌, రైమింగ్‌ ఉన్న దర్శకుడుగా ప్రూవ్‌ చేసుకుంటుంటాడు. 'జైలవకుశ' సినిమాకు పనిచేయడంతో.. నాకు, కల్యాణ్‌రామ్‌కు మంచి అనుబంధం ఏర్పడింది. కిరణ్‌రెడ్డి, భరత్‌చౌదరి, విశ్వప్రసాద్‌, వివేక్‌ అందరూ మంచి టేస్ట్‌ ఫుల్‌ నిర్మాతలు'' అన్నారు.

డి.సురేశ్‌ బాబు మాట్లాడుతూ - ''కల్యాణ్‌రామ్‌, కాజల్‌ అగర్వాల్‌, రవికిషన్‌ సహా నటీనటులు, సాంకేతిక నిపుణులకు అభినందనలు. మణిశర్మ చక్కటి సంగీతాన్ని అందించారు. సినిమా పెద్ద హిట్‌ అవుతుందనే నమ్మకం ఉంది'' అన్నారు.

వంశీ పైడిపల్లి మాట్లాడుతూ - ''నేను, ఉపేంద్ర కలిసి పనిచేశాం. తను మంచి టైమింగ్‌ ఉన్న డైరెక్టర్‌. మంచి సినిమాను మంచి హీరో, టీంతో కలిసి చేయడం అంత సులభం కాదు. నిర్మాతలు విశ్వప్రసాద్‌, కిరణ్‌రెడ్డి, భరత్‌చౌదరిలతో మంచి పరిచయం ఉంది. సినిమాను వెనుకుండి నడిపిస్తున్న వివేక్‌గారికి థాంక్స్‌. కాజల్‌ 12 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. తను ఇంకా మరిన్ని మంచి సినిమాల్లో నటించాలి. మంచి లక్షణాలున్న అబ్బాయికి కల్యాణ్‌రామ్‌ మంచి ఉదాహరణ. ఆయన భవిష్యత్‌లో గొప్ప సినిమాలు చేయాలి. పటాస్‌ తర్వాత అదే ఎనర్జీ కల్యాణ్‌రామ్‌లో కనపడుతుంది. ఈ సినిమా తనకు మంచి హిట్‌ అవుతుంది'' అన్నారు.

నిర్మాత కిరణ్‌ రెడ్డి మాట్లాడుతూ - ''బ్లూప్లానెట్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో మా రెండో సినిమా. నేనే రాజు నేనే మంత్రి సమయంలోనే ఉపేంద్రగారు నాకు ఈ కథను చెప్పారు. థ్రిల్లింగ్‌గా సినిమాను కళ్లకు కట్టినట్లు నెరేట్‌ చేశారు. కథ విన్న కల్యాణ్‌రామ్‌గారు సినిమా చేయడానికి అంగీకరించారు. ఆయనతో ఈ సినిమాకు పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది. నిర్మాతల గురించి ఆలోచించే హీరో. చేతికి గాయమైనా.. కమిట్‌మెంట్‌తో సినిమాను పూర్తి చేశారు. కాజల్‌ వంటి లక్కీహీరోయిన్‌తో మరోసారి చేసిన సినిమా ఇది. మార్చి 23న సినిమా విడుదలవుతుంది. టీం సభ్యులందరూ సినిమాను అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి థాంక్స్‌'' అన్నారు.

నిర్మాత టి.జి.విశ్వ ప్రసాద్‌ మాట్లాడుతూ - ''కల్యాణ్‌రామ్‌గారితో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో తొలి సినిమా చేయడం హ్యాపీగా ఉంది. ఆయనతో మరిన్ని సినిమాలను చేయాలనుకుంటున్నాను. రెండు రోజుల ముందు సినిమా చూశాను. ఔట్‌ అండ్‌ ఔట్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌'' అన్నారు.

దర్శకుడు ఉపేంద్ర మాధవ్‌ మాట్లాడుతూ - ''ఈ సినిమా విషయంలో ముందుగా కల్యాణ్‌రామ్‌గారికి థాంక్స్‌. డైరెక్టర్స్‌ హీరో. ఏమీ తినకుండా 16 గంటల పాటు ఉండేవారు. దర్శకుడిగా నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. కథ విన్న ఆయన 'మనం ఈ సినిమా చేస్తున్నాం' అని అన్నారు. ఎక్కువ సమయం తీసుకోకుండా ఓకే చెప్పేశారు. నేను చెప్పిన బడ్జెట్‌ ఏంటో నాకు తెలుసు. కానీ ఇప్పుడు ఎంత బడ్జెట్‌ అయ్యిందో తెలుసు. సినిమాటోగ్రాఫర్‌ ప్రసాద్‌ మూరెళ్లగారు నాకు ఎంతో సపోర్ట్‌ చేశారు. అలాగే కాజల్‌ అగర్వాల్‌, తమ్మిరాజు, మణిశర్మ వంటి మంచి మ్యూజిక్‌ డైరెక్టర్‌నిచ్చారు. మణిశర్మగారి గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. సాంగ్స్‌ ఎంత బాగా చేశారో.. రీరికార్డింగ్‌ను అంత కంటే బాగా చేశారు. ఆర్ట్‌ డైరెక్టర్‌ కిరణ్‌గారు.. ఎడిటర్‌ తమ్మిరాజుగారు, రైటర్‌ ప్రవీణ్‌ వర్క్‌ పరంగా ఎంతో సపోర్ట్‌ చేశారు. అందరికీ థాంక్స్‌'' అన్నారు.

అల్లరి నరేశ్‌ మాట్లాడుతూ - ''నిర్మాతలతో ఉన్న పరిచయంతో పాటు... మా బాబాయ్‌ కల్యాణ్‌రామ్‌గారితో ఉన్న పరిచయం ఉన్న కారణంగా ఇక్కడకు వచ్చాను. కల్యాణ్‌కి ఎం.ఎల్‌.ఎ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అవుతుంది. దర్శకుడు ఉపేంద్ర మాధవ్‌ మంచి వ్యక్తి. తనకు ఈ సినిమా మంచి హిట్‌ అవుతుంది. మణిశర్మగారి పాటలెంతో బావున్నాయి. ఈ నెల 23న సినిమా విడుదలవుతుంది. ఎంటైర్‌టీంకు ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు.

నందమూరి కల్యాణ్‌ రామ్‌ మాట్లాడుతూ - ''కథను నమ్ముకుని సినిమాలు తీసే నిర్మాతలంటే నాకు ఎంతో ఇష్టం. అటువంటి వారిలో ఈ నిర్మాతలు ముందుంటారు. కథ వినగానే ఇంకా ఎన్‌హెన్స్‌ చేయాలనుకునే నిర్మాతలు. తప్పకుండా భవిష్యత్‌లో పెద్ద నిర్మాతలు అవుతారు. పటాస్‌ విన్నప్పుడు ఎంత ఎగ్జయిట్‌ అయ్యానో.. ఈ సినిమాకు కూడా అంతే ఎగ్జయిట్‌ అయ్యాను. తను సినిమాను కళ్లకు కట్టినట్లు నెరేషన్‌ ఇచ్చాడు. ఈ సినిమాలో నన్ను కొత్తగా చూపించాడు. పటాస్‌, ఇజం సినిమాలకు ఎంత బాగా ఫీలయ్యానో.. ఈ సినిమాకు కూడా అలాగే ఫీలయ్యాను. కొత్త దర్శకుడిని గైడ్‌ చేయాల్సిన బాధ్యత సినిమాటోగ్రాఫర్‌ది. దర్శకుడు, సినిమాటోగ్రాఫర్‌ది భార్య భర్తల సంబంధం. నేను పనిచేసిన కెమెరామెన్స్‌లో బెస్ట్‌ కెమెరామెన్‌ ప్రసాద్‌ మూరెళ్లగారు. రవికిషన్‌గారు నాకు దేవుడిచ్చిన అన్నయ్యలాగా దొరికారు. ఆయన బోజ్‌పురిలో సూపర్‌స్టార్‌. అలాంటి ఓ వ్యక్తి... మన ఇండస్ట్రీలో ఎంటాగనిస్ట్‌ చేయడం చాలా గొప్ప విషయం. 500 సినిమాలు చేసిన రవికిషన్‌గారు ఇంకా ఏదో నేర్చుకోవాలని ప్రయత్నిస్తుంటారు. ఆయన్ను చూసి ఇన్‌స్పైర్‌ అయ్యాను. ఈ సినిమాలో కొత్త కల్యాణ్‌రామ్‌ని చూస్తారు. సినిమా చూసిన వారెవ్వరూ బోర్‌ ఫీల్‌ కారు. ఎందుకంటే తమ్మిరాజుగారు ఏ మోహమాటం లేకుండా నచ్చకపోతే.. ఎడిట్‌ చేసేశారు. ప్రతి ఒక్కరి కష్టం తెరపై కనపడుతుంది. కాజల్‌ అగర్వాల్‌తో నేను చేసిన రెండో సినిమా. నేను పద్నాలుగు సినిమాలు చేస్తే.. తను 50 సినిమాలు చేసింది. అందుకు కారణం తన డేడికేషన్‌. ఈ 12 ఏళ్లలో తను ప్రొఫెషనల్‌గా ఎంతో ఎదిగింది. తను మరో 50 సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. సినిమా చూశాను. చాలా బాగా నచ్చింది. నా హృదయానికి దగ్గరెన సినిమా. తప్పకుండా ప్రేక్షకులందరికీ నచ్చింది. సహకారం అందించిన యూనిట్‌కి అభినందనలు'' అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పృథ్వీ, రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


 
Photo Gallery (photos by G Narasaiah)
 

 

 
 

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved