pizza
Shambho Shankara pre release function
`శంభోశంక‌ర‌` ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us


25 June 2018
Hyderabad

క‌మెడియ‌న్ ట‌ర్న్‌డ్ హీరోలుగా రాణిస్తున్న ఈ టైమ్‌లో ష‌క‌ల‌క శంక‌ర్ హీరోగా అదృష్టం ప‌రీక్షించుకుంటున్న సంగ‌తి తెలిసిందే. శంక‌ర్ న‌టించిన‌ `శంభో శంక‌ర‌` ట్రైల‌ర్‌, పోస్ట‌ర్ల‌కు అద్భుత స్పంద‌న వ‌చ్చింది. ష‌క‌ల‌క శంక‌ర్‌ని హీరోగా, శ్రీధ‌ర్‌ను ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ ఆర్. ఆర్. పిక్చ‌ర్స్ సంస్థ, ఎస్.కె. పిక్చ‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో వై. ర‌మ‌ణారెడ్డి, సురేష్ కొండేటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా జూన్ 29న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా సోమ‌వారం జ‌రిగిన ప్రీరిలీజ్ ఫంక్ష‌న్‌లో బిగ్ సీడీ, ఆడియో సీడీల‌ను మ్యూజిక్ డైరెక్ట‌ర్ సాయికార్తీక్ విడుద‌ల చేయ‌గా.. తొలి సీడీని హీరో శంక‌ర్ అందుకున్నారు. ఈ సంద‌ర్భంగా...

డైరెక్ట‌ర్ శ్రీధ‌ర్ మాట్లాడుతూ ``రైట‌ర్ భాను ప్ర‌సాద్‌గారు చాలా మంచి డైలాగ్స్ ఇచ్చారు. సినిమా చాలా బాగా వ‌చ్చింది. సినిమా కోసం ఏమైనా ప‌రావాలేద‌ని శంక‌ర్ ప్రాణం పెట్టి ప‌నిచేశారు. ర‌మ‌ణారెడ్డిగారు , సురేశ్ కొండేటిగారు నిర్మాత‌లుగా మాకెంతో స‌హ‌కారాన్ని అందించారు. ఈ నెల 29న సినిమా విడుద‌ల‌వుతుంది. సినిమాను ఆద‌రించాల‌ని కోరుకంటున్నాను`` అన్నారు.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ సాయికార్తీక్ మాట్లాడుతూ - ``శ్రీధ‌ర్‌గారు సినిమాను చాలా చ‌క్క‌గా డైరెక్ట్ చేశారు. శంక‌ర్ సినిమా కోసం బాగా క‌ష్ట‌ప‌డ్డారు. త‌ను బాగా డాన్సులు చేస్తాడు కాబ‌ట్టే నేను మంచి మ్యూజిక్ ఇవ్వ‌గ‌లిగాను. ఈ సినిమాను నిర్మించిన ర‌మ‌ణారెడ్డిగారికి అభినంద‌న‌లు. సినిమా మంచి పేరు తెస్తుంద‌ని ఆశిస్తున్నాను`` అన్నారు.

ని్ర్మాత సురేశ్ కొండేటి మాట్లాడుతూ - ``ఈ సినిమాకు ఫ‌స్ట్ టెక్నీషియ‌న్ సాయికార్తీక్‌గారే. ఆయ‌న త‌ర్వాతే మిగిలిన టెక్నీషియ‌న్స్ అంద‌రూ సెట్ అయ్యారు. ఆరు నెల‌ల క‌ష్టానికి ప్ర‌తిఫ‌ల‌మే ఈ సినిమా. శంక‌ర్ హీరో ఏంటి? అని అనుకున్న‌వాళ్లంద‌రికీ ఈ సినిమా స‌మాధానం చెబుతుంది. శంక‌ర్‌తో ఎందుకు ఈ సినిమా చేశామో ఈ సినిమా చూస్తే అర్థ‌మ‌వుతుంది. ర‌మ‌ణారెడ్డిగారు సినిమా అవుట్ పుట్ బాగా రావ‌డానికి ఏం కావాలో వాటిని అడ‌గ్గానే కాంప్ర‌మైజ్ కాకుండా ఇచ్చారు. ఆయ‌న వ‌ల్లే సినిమా ఇంత బాగా వ‌చ్చింది. నాకు తెలిసి ఈ ఏడాది ఇది బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ అవుతుంది. బిజినెస్ కూడా పూర్త‌య్యింది అంద‌రి న‌మ్మ‌కం ఫ‌లిస్తుంద‌ని ఆశిస్తున్నాం`` అన్నారు.

నిర్మాత ర‌మ‌ణారెడ్డి మాట్లాడుతూ - `` నా గొంతు బాగోలేదు. కాబ‌ట్టి నేను స‌రిగ్గా మాట్లాడ‌లేక‌పోతున్నాను. శంక‌ర సినిమా విష‌యంలో మాకు స‌పోర్ట్ చేసిన న‌టీన‌టులు, సాంకేతిక నిఫుణులు స‌హా అంద‌రికీ థాంక్స్‌`` అన్నారు.

శంక‌ర్ మాట్లాడుతూ ``డైరెక్ట‌ర్ శ్రీధ‌ర్‌, నాకు మ‌ధ్య ఎన్నో ఏళ్లుగా మంచి స్నేహం ఉంది. మాకు సినిమాలంటే ఆస‌క్తిని క‌లిగేలా చేసింది నిర్మ‌ల‌మ్మ‌. ఆవిడ వ‌ల్ల‌నే సినిమా జీవితం గురించి మేం తెలుసుకున్నాం. ఆవిడ ఆశీర్వాదం ఎప్ప‌టికీ ఉంటుంద‌ని ఆశిస్తున్నాను. ఈ సినిమాను దిల్‌రాజు, శిరీష్‌, ల‌క్ష్మ‌ణ్ ద‌గ్గ‌రికీ తీసుకెళ్లాను. వారు చేస్తామ‌న్నారు కానీ.. రెండేళ్ల స‌మ‌యం అడిగారు. మా బాధ‌ను నెల్లూరులోని ర‌మ‌ణారెడ్డిగారు అర్థం చేసుకున్నారు. ఆయ‌నే ఈ సినిమా చేశారు. అలాంటి నిర్మాత‌లుంటే నాలాంటి వారెంద‌రో హీరోలుగా, శ్రీధ‌ర్‌లాంటివాళ్లు ద‌ర్శ‌కులుగా ఇండ‌స్ట్రీలోకి వ‌స్తారు. నేను న‌టుడిగా ప‌ది రూపాయ‌ల‌ను సంపాదిస్తే.. అందులో ఎనిమిది రూపాయ‌ల‌ను క‌ష్టాల్లో ఉన్న‌వారికే ఇచ్చేస్తాను. ఇక సినిమా చాలా బాగా వ‌చ్చింది. ఈ నెల 29న మా సినిమా రిలీజ్ అవుతుంది. మేమెంత క‌ష్ట‌ప‌డ్డామో అంద‌రికీ అర్థ‌మ‌వుతుంది`` అన్నారు.

షకలక శంక‌ర్, కారుణ్య నాగినీడు, అజ‌య్ ఘోష్, ర‌వి ప్రకాష్, ప్ర‌భు, ఏడిద శ్రీరామ్ త‌దిత‌రులు న‌టించారు. ఈ చిత్రానికి కెమెరా: రాజ‌శేఖ‌ర్, సంగీతం: సాయి కార్తిక్, ఎడిటింగ్: ఛోటా.కె. ప్ర‌సాద్, నిర్మ‌తలు: వై. ర‌మ‌ణారెడ్డి, సురేష్ కొండేటి, క‌థ‌, స్ర్కీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: శ్రీధ‌ర్. ఎన్.

 

 

 


Photo Gallery (photos by G Narasaiah)
 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved