pizza
Taxiwaala pre release function
'టాక్సీవాలా' ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us


11 November 2018
Hyderabad

విజయ్‌దేవరకొండ, ప్రియాంక జవాల్కర్‌, మాళవికా నాయర్‌ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'టాక్సీవాలా'. జి.ఎ 2 పిక్చర్స్‌, యు.వి.క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో ఎస్‌.కె.ఎన్‌ నిర్మిస్తోన్న చిత్రం 'టాక్సీవాలా'. ఈ సినిమా నవంబర్‌ 17న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో ట్రైలర్‌ను అల్లు అర్జున్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా...

బివిఎస్‌.రవి మాట్లాడుతూ ''నిర్మాతల్లో కూడా కొత్త టాలెంట్‌ను వెతికి వారిని నిర్మాతలుగా తీర్చుదిద్దుతున్న అరవింద్‌గారికి హ్యాట్సాఫ్‌. విజయ్‌ దేవరకొండ యూనిక్‌ హీరో. ఇమిటబుల్‌, ఇంపర్‌ఫెక్ట్‌ పర్సన్‌ విజయ్‌గారు. సంక్రిత్యాన్‌కు అభినందనలు. నిర్మాత ఎస్‌.కె.ఎన్‌కు ఈ సినిమా మంచి విజయాన్ని అందించాలి'' అన్నారు.

డైరెక్టర్‌ పరుశురాం మాట్లాడుతూ - ''విజయ్‌గారు సంస్కారమున్న హీరో. టాక్సీవాలా కోసం చాలా ఓర్పుగా వెయిట్‌ చేశాడు. నా కెరీర్‌లో ఎత్తు పల్లాలున్న సమయంలో అరవింద్‌గారు నన్ను గుర్తించి నా ఫ్యామిలీ తలెత్తుకుని తిరిగేలా చేశారు. టాక్సీవాలకు పనిచేసిన అందరూ నాకు కావాల్సిన వారే. సినిమా పెద్ద హిట్‌ అయ్యి విజయ్‌ దేవరకొండ హవా ఇలాగే కొనసాగాలి'' అన్నారు.

విఐ.ఆనంద్‌ మాట్లాడుతూ - ''నేను కూడా టాక్సీవాలా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. విజయ్‌, రాహుల్‌, ఎస్‌.కె.ఎన్‌ సహా అందరికీ ఈ సినిమా చాలా పెద్ద హిట్‌ కావాలి'' అన్నారు.

నటి యమున మాట్లాడుతూ - ''మంచి క్యారెక్టర్‌ అయితేనే సినిమాల్లో నటించాలి. లేకుంటే సీరియల్స్‌లతో ఎలాగూ బిజీఆ ఉన్నాను కదా అని అనుకున్నాను. నేను అనుకున్నట్లే మంచి క్యారెక్టర్‌ ఉన్న సినిమా చేశాను. అవకాశం ఇచ్చిన రాహుల్‌ సంక్రిత్యాన్‌, జి.ఎ2, యు.వి.క్రియేషన్స్‌కు థాంక్స్‌'' అన్నారు.

మారుతి మాట్లాడుతూ - ''కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్‌ చేయడానికి బన్ని ఎప్పుడూ ముందుటారని మరోసారి రుజువైంది. రాహుల్‌ చెప్పిన కథను నమ్మి విజయ్‌ దేవరకొండ, జి.ఎ2, యు.వి సంస్థలు ఎస్‌.కె.ఎన్‌ నిర్మాతగా చేస్తున్న సినిమా ఇది. ఎస్‌.కె.ఎన్‌తో ఈరోజుల్లో నుండి నాకు పరిచయం ఉంది. మంచి వ్యక్తి. మంచి టీమ్‌ వర్క్‌. సినిమాను అందరూ ఆదరించాలి'' అన్నారు.

కిషోర్‌ తిరుమల మాట్లాడుతూ - ''విజయ్‌ మనం రాసుకున్న పాత్రను వందశాతం జనంలోకి తీసుకెళ్లి డైరెక్టర్‌ డ్రీమ్‌ను నిజం చేయగల హీరో. ఆయనకు కథ చెప్పాలని చాలా మంది తెలుగు దర్శకులే కాదు.. తమిళ దర్శకులు ఆసక్తితో ఉన్నారు. ఎంటైర్‌ యూనిట్‌కు అభినందనలు'' అన్నారు.

వెంకీ కుడుముల మాట్లాడుతూ ''రాహుల్‌ నాకు ఇంటర్‌ క్లాస్‌మేట్‌ అయితే.. విజయ్‌ నాకు ఇండస్ట్రీ క్లాస్‌మేట్‌. ఆల్‌ ది బెస్ట్‌ టు టాక్సీవాలా'' అన్నారు.

డైరెక్టర్‌ రాహుల్‌ సంక్రిత్యాన్‌ మాట్లాడుతూ - ''టాక్సీవాలా చాలా పెద్ద జర్నీ. నాకే కాదు.. నా టీమ్‌ అందరికీ మంచి మెమొరీ. ఫస్టాఫ్‌ను మూడు గంటల్లో రాసేశాం. సెకండాఫ్‌ రాయడానికి ఆరు నెలలు పట్టింది. ఈ స్క్రిప్ట్‌ ఇంత బాగా రావడానికి బన్ని వాసుగారే కారణం. మంచి పాటలు రాసిన కృష్ణకాంత్‌, మంచి ఎడిటింగ్‌ వర్క్‌ చేసిన శ్రీజిత్‌ సారంగ్‌, మంచి విజువల్స్‌ అందించిన సాజిత్‌ సారంగ్‌, మంచి పాటలు, బాగ్రౌండ్‌ స్కోర్‌ అందించిన జేక్స్‌ బిజాయ్‌లకు థాంక్స్‌. అలాగే మంచి టీమ్‌ కుదిరింది. బ్యూటీఫుల్‌ జర్నీ. జి.ఎ 2, యు.వి సంస్థల్లో విజయ్‌దేవరకొండతో చేస్తున్న సినిమా తప్పకుండా హిట్‌ అవుతుంది. సినిమా చాలా రకాల అటుపోటులను చూసింది. అదంతా దిష్టి అని అనుకుంటున్నాం. నవంబర్‌ 17న సినిమా విడుదల కాబోతుంది'' అన్నారు.

హీరోయిన్‌ ప్రియాంక జవాల్కర్‌ మాట్లాడుతూ - ''రెండు సంవత్సరాలు ఈ సినిమా కోసం వెయిట్‌ చేశాను. ఓ రకంగా స్వార్ధంతోనే వెయిట్‌ చేశాను. నిర్మాత ఎస్‌.కె.ఎన్‌, బన్నివాసుగారికి థాంక్స్‌. నా డెబ్యూ మూవీతో సక్సెస్‌ అందుకోబోతున్నానని నమ్మకంగా చెప్పగలను. డైరెక్టర్‌ రాహుల్‌ పర్‌ఫెక్షనిస్ట్‌'' అన్నారు.

నిర్మాత ఎస్‌.కె.ఎన్‌ మాట్లాడుతూ - ''ఈ స్టేజ్‌పై నేను నిర్మాతగా ఉండటానికి కారణం అల్లు అరవింద్‌గారు. చిరంజీవిగారు, పవన్‌కల్యాణ్‌ సినిమాలకు ఏలూరులో బ్యానర్స్‌ కట్టేవాడిని. అభిమానులంటే కేవలం జెండాలు మాత్రమే కట్టరు. ఆ జెండాల్లో వారి పేరు కూడా ఉండేలా చేయాలని ప్రపంచంలో ఏ ప్రొడ్యూసర్‌ అనుకోడు. వాళ్ల కుటుంబంలో వ్యక్తినే నిర్మాతగా చేస్తారే కానీ.. మన ఫ్యాన్‌. టాలెంట్‌ ఉందని చెప్పి నిర్మాత చేసిన వ్యక్తి అల్లు అరవింద్‌గారు మాత్రమే. అవకాశం దక్కడం ఎంత కష్టమో నాకు తెలుసు. బన్నివాసు అయినా.. నేనైనా ఇండస్ట్రీకి వచ్చి 10-15 ఏళ్ల పాటు మా టాలెంట్‌ను నిరూపించుకున్నాం. మమ్మల్ని అరవింద్‌గారు నిర్మాతల్ని చేశారు. అలాగే యు.వి.క్రియేషన్స్‌ వంశీకి థాంక్స్‌. 300-400 కోట్లతో భారతదేశం గర్వించే సినిమా సాహోను చేస్తున్న వ్యక్తి వంశీ. నన్ను పిలిచి మంచి కథ తెచ్చుకో నిర్మాతగా సినిమా చేద్దువుగాని అన్నాడు. ఆ విషయాన్ని నేను మారుతికి చెబితే ఆయన రాహుల్‌ చెప్పిన పాయింట్‌ను డెవలప్‌ చేసుకోమని నాకు ఇచ్చారు. ఇది రెగ్యులర్‌ సినిమా కాదు. సూపర్‌ నేచురల్‌ సైంటిఫిక్‌ థ్రిల్లర్‌. ఈ సినిమాలో యూనిక్‌ పాయింట్‌తో సినిమా చేసిన హీరో విజయ్‌ దేవరకొండ. ప్రతి సంవత్సరం బ్లాక్‌బస్టర్‌ సినిమాలు ఇచ్చిన హీరో. వందకోట్ల సినిమా హీరోగా ఎదిగారు. మాపై నమ్మకంతో ఆయన ఈ సినిమా చేశారు. ఈ సినిమా ఫుటేజ్‌ లీక్‌ అయ్యింది కదా.. అనే భయం లేదు. ఎందుకంటే సినిమాలో మంచి కంటెంట్‌ ఉంది. నవంబర్‌ 17 సినిమా అందరినీ అలరిస్తుంది. విజయ్‌ దేవరకొండ లేకపోతే ఈ సినిమాయే లేదు. అలాగే నా హీరో బన్ని గురించి చెప్పుకోవాలి. అందరికీ జీవితం ఎ తో స్టార్ట్‌ అయితే నాకు ఎఎతో స్టార్ట్‌ అయ్యింది. జీతం తీసుకున్నవాళ్ల గురించి చెప్పకపోయినా పరావాలేదు.. జీవితం ఇచ్చినవాళ్ల గురించి చెప్పాలి. ఆయనే నన్ను పి.ఆర్‌.ఒ చేశారు. తనతో పాటు తన వాళ్లు కూడా ఎదగాలని భావించే వ్యక్తి బన్ని. ఆయననొక లీడర్‌. మా ఎదుగుదలకు ఇన్ని రకాలుగా సపోర్ట్‌ చేస్తున్న బన్నిగారికి థాంక్స్‌. మంచి మనసున్న బన్నిగారికి తెలుగులోనే కాదు.. అన్ని రాష్ట్రాల్లో అభిమానులుంటారు'' అన్నారు.

అల్లు అరవింద్‌ మాట్లాడుతూ - ''విజయ్‌ దేవరకొండ వెరైటీ ఉన్న కథలనే ఎంచుకుంటాడు. కథ వినగానే డిఫరెంట్‌గా ఫీలై సినిమా చేశాడు. రాహుల్‌కి కంగ్రాట్స్‌. తన కెరీర్‌కి ఈ సినిమా మైల్‌ స్టోన్‌ అవుతుంది. హీరోయిన్‌ ప్రియాంకకు అభినందనలు. నవంబర్‌ 17న సినిమా విడుదలకానుంది. పెద్ద సక్సెస్‌ సాధించాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ - ''బన్ని అన్న ముందు నుండి నన్ను ఎంకరేజ్‌ చేస్తూ వస్తున్నారు. అర్జున్‌ రెడ్డి, గీత గోవిందం సినిమాల సక్సెస్‌ను ఆయనెంతో ఎంజాయ్‌ చేశారు. ఆయన ఈసినిమాకు ముఖ్య అతిథిగా రావడం ఆనందంగా ఉంది. బన్ని అన్నలా డాన్స్‌ జీవితంలో చేయలేను. నా టైప్‌ సినిమాలు, నేను ఉండే విధానం ప్రేక్షకులకు నచ్చి ఉండొచ్చు. ఇండస్ట్రీకి నేను ఔట్‌ సైడర్‌ని. మా కష్టంపై పెళ్ళిచూపులు, అర్జున్‌ రెడ్డిలాంటి సినిమాలు చేస్తే గీతగోవిందం, ఇప్పుడు టాక్సీవాలాతో గీతాఆర్ట్స్‌, యు.వి.క్రియేషన్స్‌ దారి చూపించారు. నేను కూడా అలాగే నాతో పాటు కొంతమందిని ముందుకు తీసుకెళతాను. నా కాలేజ్‌లో నా సబ్‌ జూనియర్‌ విష్ణు నాకు ఫ్రెండ్‌ అయిపోయాడు. టాక్సీవాలాలో తను హాలీవుడ్‌ అనే రోల్‌ చేశాడు. పెళ్ళిచూపులులో ప్రియదర్శి, అర్జున్‌ రెడ్డిలో రాహుల్‌ రామకృష్ణ ఎలా గుర్తుండిపోయారో.. ఈసినిమాలో విష్ణు అలాగే గుర్తుండిపోతాడు. రైటర్‌ సాయి విషయానికి వస్తే.. తను బ్రిలియంట్‌ రైటర్‌. చాలా మంచి స్క్రిప్ట్‌ రాశాడు. మా హీరోయిన్‌ ప్రియాంక .. చిన్న చిన్న షార్ట్‌ ఫిలింస్‌ చేస్తూ వచ్చింది. ఈ సినిమాతో హీరోయిన్‌గా మారింది. తనకు ఈ సినిమా సక్సెస్‌ అయితే తనకు కెరీర్‌ సెటిల్‌ అవుతుంది.
అలాగే డైరెక్టర్‌ రాహుల్‌ సంక్రిత్యాన్‌ ఎవరి దగ్గరా పనిచేయకుండా.. ఇంటర్నెట్‌ సెంటర్‌లో సినిమాల గురించి తెలుసుకుని వాళ్ల ఫ్రెండ్స్‌ సహకారంతో వీడియోస్‌ చేస్తూ ఎడిటింగ్‌ నేర్చుకున్నాను. నాలుగేళ్లుగా ఉద్యోగం వదిలేసి ఈ సినిమా కోసం కష్టపడ్డాడు. చాలా మంచి సినిమా చేశాడు. తనకొక కెరీర్‌ సెటిల్‌ అవుతుంది. మా సినిమాటోగ్రాఫర్‌ సుజిత్‌ సారంగ్‌ విషయానికి వస్తే నెక్‌ బ్యాండ్‌ వేసుకుని ఫిజియో థెరఫీ చేసుకుంటూ ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ చేశాడు. తను నా నెక్స్‌ట్‌ మూవీ డియర్‌ కామ్రేడ్‌కి కూడా వర్క్‌ చేస్తున్నాడు. బెస్ట్‌ విజువల్స్‌ ఇచ్చాడు. మ్యూజిక్‌ చేసిన జేక్స్‌ బిజోయ్‌కి.. సినిమా అంటే పిచ్చి. వాళ్ల తండ్రికి ఆరోగ్యం బాగోలేకపోయినా.. సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. అద్భుతమైన సంగీతం, బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ అందించాడు. అందరికీ చెప్పే విషయమొకటే.. ఇదేదో రికార్డులు బద్దలు కొట్టే సినిమా కాదు. కానీ ఓ మంచి సినిమా. అందరూ ఎంజాయ్‌ చేస్తారు. అది నేను ఇచ్చే గ్యారంటీ. నవంబర్‌ 17న సినిమాను థియేటర్‌కు వెళ్లి సినిమా చూసి సినిమాను పైరేట్‌ చేసి వాళ్లకి మధ్య వేలుని చూపించే సక్సెస్‌ను ఇవ్వాలని కోరుకుంటున్నాను. తప్పకుండా సినిమాను ఎంజాయ్‌ చేస్తారు'' అన్నారు.

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ మాట్లాడుతూ - ''ఇక్కడకు వచ్చిన రౌడీస్‌ అందరికీ వెల్‌కమ్‌. ఈ సినిమాకు రైటర్‌గా పనిచేసిన సాయికుమార్‌గారికి, పాటలు రాసిన కృష్ణకాంత్‌గారికి అభినందనలు. మ్యూజిక్‌ ఇచ్చిన జేక్స్‌, సినిమాటోగ్రఫీ చేసిన సుజిత్‌ సారంగ్‌ సహా అందరికీ అభినందనలు. ఉన్న అన్ని ఇండస్ట్రీస్‌లో అమ్మాయిలకు ఎక్కువ గౌరవం ఇచ్చేది తెలుగు ఇండస్ట్రీ మాత్రమే. కాబట్టి తెలుగు ఇండస్ట్రీలోకి అమ్మాయిలు ధైర్యంగా రండి. కొత్త కొత్తగా ఇంటర్నెట్‌ వచ్చిన టైమ్‌లో మన మెగాస్టార్‌గారి గురించి భయంకరంగా ఫైట్‌ చేసేస్తున్నాడట అని తెలిసింది. అభిమానులు గుర్తించే విషయంలో మా తమ్ముడు శిరీష్‌ను అభినందించాలి. తను మెగా అభిమానులు ప్రత్యేకంగా కలుస్తుంటాడు. ఇంద్ర సినిమా సమయంలో తనను కలిశాను. ఆ తర్వాత ఫ్యామిలీలో ఏదో ఇన్‌సిడెంట్‌ జరిగితే అందరూ కామెంట్స్‌ చేస్తుంటే తనొకడే అందరికీ రిప్లయ్‌లు ఇస్తున్నాడు. దాదాపు లక్ష మందికి రిప్లయ్‌లు ఇచ్చాడు. తను హార్డ్‌ కోర్‌ మెగాభిమాని ఎస్‌.కె.ఎన్‌ తను హైదరాబాద్‌ రావడం మెల్ల మెల్లగా ఎదగడాన్ని వస్తున్నాను. జర్నలిస్ట్‌గా కెరీర్‌ స్టార్ట్‌ చేయడం తర్వాత ఓ ఛానెల్‌లో మంచి పోజిషన్‌కి రావడం.. అక్కడ నుండి పి.ఆర్‌ ఏజెన్సీ పెట్టుకుని సినిమాలకు పి.ఆర్‌ చేయడం .. తర్వాత కో ప్రొడ్యూస్‌ చేయడం ఇప్పుడు ప్రొడ్యూస్‌ చేయడం .. నా కళ్ల ముందు అంతగా ఎదిగిన వాళ్లలో ఎస్‌.కె.ఎన్‌ ఒకడు. తనను చూసి వ్యక్తిగతంగా ఎంతగానో గర్వంగా ఫీల్‌ అవుతున్నాను. తనకు టాక్సీవాలా విడుదల సందర్భంగా అభినందనలు. భాగమతి తర్వాత 'మీరు నాకు బాగా నచ్చారు. మనం కలిసి సినిమా చేస్తే బావుంటుంది' అని నేను అడిగిన ఏకైక సంస్థ యు.వి.క్రియేషన్స్‌. అలాంటి యు.వి. సంస్థతో బన్నివాసు జి.ఎ 2తో కలిసి ఎస్‌.కె.ఎన్‌ నిర్మాతగా సినిమా చేయడం ఆనందంగా ఉంది. నాతో పాటు ఉన్న వ్యక్తులు ఉన్నతంగా ఎదగాలని కోరుకునే వ్యక్తుల్లో నేను ఒకడిని. విజయ్‌ దేవరకొండ కూడా అలాంటి వ్యక్తే. ఎందుకంటే అతను చాలా మంది దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు. ఆర్‌ ఆర్‌ ఆర్‌ ఫిలింలాంచ్‌ అయ్యింది. నా ఫేవరేట్‌ మెగాపవర్‌స్టార్‌ రామచరణ్‌కి.. నేను సరదాగా బావ అని పిలిచే తారక్‌కి, ప్రైడ్‌ ఆఫ్‌ తెలుగు సినిమా రాజమౌళిగారికి అభినందనలు. విజయ్‌ గురించే చెప్పాలంటే.. తనతో ఓ ఒరిజినాలిటీ ఉంటుంది. నిజం చెప్పాలంటే మేం కానీ.. ఇప్పటి హీరోలు కానీ ఓ రొట్టలో స్ట్రక్‌ అయిపోయుంటాం. కానీ తను ఆ రొట్టలో లేకుండా కొత్తగా చేస్తున్నాడు. ఆ కొత్తదనం జనాలకు బాగా నచ్చింది. విజయ్‌ ఫెంటాస్టిక్‌ పెర్ఫామర్‌. మేమంతా గోల్డెన్‌ ప్లేట్‌ నుండి వచ్చినవాళ్లం. నా లాంచ్‌ రాఘవేంద్రరావుగారిలాంటోళ్లు, అల్లు అరవింద్‌గారిలాంటోళ్లు, అశ్వనీదత్‌గారి లాంటోళ్లుతో జరిగింది. ఈజీగా వచ్చేశాం. తన ఎవడే సుబ్రమణ్యం సినిమా చూసినప్పుడు తను మంచి క్యారెక్టర్‌ చేసి.. పెళ్ళిచూపులు వంటి మంచి సినిమా చేసి షార్ట్‌ ఫిలింస్‌ చూసి కాన్‌టెంపరరీ ట్రెండ్స్‌ పట్టుకుని డిఫరెంట్‌ సినిమా అర్జున్‌ రెడ్డి వంటి సక్సెస్‌ కొట్టి అలా తనకు తానుగా పైకెదిగిన వ్యక్తి విజయ్‌ దేవరకొండ. మేం ఎంత పెద్ద యాక్టర్‌ అయినా సెల్ఫ్‌మేడ్‌ యాక్టర్‌ అని చెప్పుకోలేను. తనని తాను చెక్కుకున్న శిల్పం తను. వండర్‌ఫుల్‌ పెర్ఫామర్‌. ఇలాంటి వ్యక్తులు ఎదిగినప్పుడు నెగిటివ్‌ ఫోర్సెస్‌ కూడా ఉంటాయి. వాటి గురించి తను పట్టించుకోకపోతేనే మంచిది. అలా ఉంటే జెమ్‌ ఆఫ్‌ ఎ స్టార్‌ అవుతాడు. ఎంత నెగిటివిటీ ఉన్నా తను కొడతాడనే నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే రియల్‌ పెర్ఫామర్‌. అన్ని క్రెడిట్స్‌ను తను అర్హుడు. ఎన్ని సక్సెస్‌లు వచ్చినా.. నాకంటే ఎక్కువ వచ్చినా తను లవ్‌లీ టాలెంటెడ్‌ యాక్టర్‌. తన సక్సెస్‌ ఇలాగే కంటిన్యూ కావాలి. తన సక్సెస్‌ను చూసి ఎంజాయ్‌ చేసేవాళ్లలో నేను ఒకడిని. సినిమా పైరసీ కావడం చాలా పెద్ద తప్పు. సినిమాటోగ్రాఫర్‌కి మెడనొప్పి ఉన్నా ఈ సినిమాకు కష్టపడ్డారు. అలాగే మ్యూజిక్‌ డైరెక్టర్‌ తన తండ్రికి బాగో లేకపోయినా ఈ సినిమా కోసం కష్టపడ్డారు. సినిమా అంటే ఎంటర్‌టైన్‌మెంట్‌. టైమ్‌ ఉన్నప్పుడు మూడు గంటలు ప్రేక్షకులు సమయం వెచ్చిస్తుంటారు. దీన్ని నేను కూడా ఒప్పుకుంటాను. కానీ అది ప్రేక్షకులకు మాత్రమే. మాకు అది నా లైఫ్‌. నేను పొద్దున లేచినప్పటి నుండి నా సినిమా ఏంటి? నా లైఫ్‌ ఏంటి? అని ఆలోచిస్తుంటాను. చిన్న చిన్న వాళ్లకి గౌరవం ఇచ్చే మనం సినిమా వాళ్లకి కూడా గౌరవం ఇవ్వండి. దయచేసి పైరసీని ఎంకరేజ్‌ చేయకండి. కంట్రోల్‌ చేయండి. మా జీవితాలు, డబ్బు, పెట్టుబడి అన్ని అందులోనే ఉన్నాయి. అందరికీ ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు.

 


Photo Gallery (photos by G Narasaiah)

 

 

 

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved