pizza
Ungarala Rambabu pre release function
`ఉంగ‌రాల రాంబాబు` ప్రీరిలీజ్ వేడుక‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

10 September 2017
Hyderaba
d

సునీల్‌, మియాజార్జ్‌ జంటగా యునైటెడ్‌ కిరిటీ మూవీస్‌ లిమిటెడ్‌ బ్యానర్‌పై రూపొందిన చిత్రం 'ఉంగరాల రాంబాబు'. పరుచూరి కిరిటీ నిర్మాత. క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా సెప్టెంబర్‌ 15న విడుదలవుతుంది. ఈ సందర్భంగా ఆదివారం హైద‌రాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుక జ‌రిగింది. 15 మంది క‌మెడియ‌న్స్ ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు.

పోసాని మాట్లాడుతూ ``క‌మెడియ‌న్లు అంద‌రినీ న‌వ్విస్తార‌ని అనుకుంటారు. మా వెన‌క కూడా చాలా క‌ష్టాలుంటాయి. అలీ నాకు 32 ఏళ్ల ప‌రిచ‌యం. త‌ను ఎప్పుడూ బాధ‌ప‌డింది లేదు, ఎవ‌రినీ బాధ‌పెట్టిందీ లేదు. అలాంటిది ఈ మ‌ధ్య చాలా బాధ‌ప‌డ్డాడు. దానికి కార‌ణం ఏంటంటే మా అవ‌కాశాల‌ను వేరే వాళ్ల‌కు మ‌ళ్లించేంత వెధ‌వ‌లు ఇంకా ప‌రిశ్ర‌మ‌లో ఉండ‌ట‌మే. `ఉంగ‌రాల రాంబాబు` ట్రైల‌ర్‌లో డైలాగులు విన్నాక‌, 30 ఏళ్ల క్రితం నేను చెన్నైలో ఉన్న‌ప్ప‌టి ప‌రిస్థితులు గుర్తుకొచ్చాయి. ఇందులో నేను కూడా మంచి కేర‌క్ట‌ర్ చేశా. సునీల్‌లో మ‌రో కోణాన్ని ఆవిష్క‌రించే సినిమా ఇది. స‌మాజానికి ఉప‌యోగ‌ప‌డే సినిమా. కామెడీ కూడా ఉంటుంది. ట్రైల‌ర్‌లో చెప్పిన మాన‌వ‌త్వం ఇవాళ మ‌నుషుల్లో లేదు. మాకు స్టేజ్ మీదే న‌వ్వులుంటాయి. జీవితంలో కాదు. సునీల్ క‌మెడియ‌న్‌గా కెరీర్ మొద‌లుపెట్టి హీరోగా మారాడు. స‌క్సెస్ ఫెయిల్యూర్‌లు అంద‌రికీ ఉంటాయి. ఈ సినిమా అత‌నికి త‌ప్ప‌కుండా స‌క్సెస్ అవుతుంది`` అని చెప్పారు.

Manjusha glam gallery from the event

అలీ మాట్లాడుతూ ``ఏ ప‌రిశ్ర‌మ‌లో అయినా క‌మెడియ‌న్ల‌కు క‌లిసి ఉండ‌టం తెలీదు. ఎంత‌మంది ఉన్నా, ఎంత పోటీ ఉన్నా తెలుగు ప‌రిశ్ర‌మ‌లో మాత్ర‌మే ఒక ఫ్యామిలీగా ఉండ‌గ‌ల‌రు. ఆ గౌర‌వం తెలుగు ప‌రిశ్ర‌మ‌కే ద‌క్కింది. న‌టించేట‌ప్పుడు మాత్ర‌మే ఆయా పాత్ర‌ధారులుగా మారుతాం. బ‌య‌టికి వ‌చ్చాక మా మ‌ధ్య భేదాలు ఉండ‌వు. సునీల్ త‌న‌లోని అన్నీ కోణాల‌ను చూపించాడు. నాలుగేళ్లు క‌ష్ట‌ప‌డి సునీల్ చేసిన సిక్స్ ప్యాక్ ప్ర‌శంస‌నీయం. కామెడీ చేసినోడు ఏదైనా చేయ‌గ‌ల‌డ‌ని అప్పుడెప్పుడో ర‌జ‌నీకాంత్ గారు అన్నారు. క‌మెడియ‌న్ కామెడీ, ట్రాజెడీ ఏదైనా చేయ‌గ‌ల‌డు. అందుకు ఉదాహ‌ర‌ణ‌గా సునీల్‌ను తీసుకోవ‌చ్చు`` అని చెప్పారు.

సునీల్ మాట్లాడుతూ ``చేసుకున్న క‌ర్మ‌ను అనుభ‌వించేవారిని న‌వ్వించ‌డ‌మే మేం చేయాల్సిన ప‌ని. ఈ మంచి ప‌ని భ‌విష్య‌త్తులో మా పిల్ల‌ల‌కు మంచి చేస్తుంద‌ని కోరిక‌. క్రాంతిమాధ‌వ్ నాలో ఒక యాక్ట‌ర్‌ని చూశారు. క్వాలిటీ కోస‌మే సినిమా కాస్త లేట్ అయింది. ఈ నెల 15న విడుద‌ల చేస్తున్నాం. నాక్కూడా మంచి సినిమా అవుతుంది`` అని తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మంలో శ్రీనివాస‌రెడ్డి, అదుర్స్ ర‌ఘు, స‌త్య‌, ప్ర‌వీణ్‌, వెన్నెల కిశోర్‌, స‌త్యం రాజేశ్‌, స‌ప్త‌గిరి, ర‌ఘుబాబు, తాగుబోతు ర‌మేశ్‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved