pizza
ఘ‌నంగా జోగేంద్ర యువ‌గ‌ర్జ‌న
Nene Raju Nene Mantri Jogendra Yuvagarjana (Nene Raju Nene Mantri prerelease function)
You are at idlebrain.com > News > Functions
Follow Us

2 August 2017
Hyderabad

సురేశ ప్రొడక్షన్స్, బ్లూ ప్లానెట్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి’. డా.డి.రామానాయుడు సమర్పిస్తున్నారు. తేజ దర్శకత్వం వహిస్తున్నారు. అనూప్‌ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. డి. సురేశ్‌బాబు, ఎం.వి.కిరణ్‌ రెడ్డి, సి. భరత్‌ చౌదరి నిర్మాతలు. వివేక్‌ కూచిభొట్ల, అభిరామ్‌ దగ్గుబాటి ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతలు. కాజల్‌ అగర్వాల్‌, కేథరిన్‌ ట్రెసా నాయికలు. నవదీప్‌ కీలక పాత్రధారి. ఈ నెల 11న విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించి ‘జోగేంద్ర యువగర్జన’ కార్యక్రమం హైదరాబాద్ లో బుధవారం సాయంత్రం జరిగింది. వెంకటేశ్‌ అభిమానుల సతీమణులు పూర్ణ ఆధ్వర్యంలో సుఖీభవ సాంగ్‌ లాంచ్‌ చేశారు.

రానా మాట్లాడుతూ ‘‘సినిమాల పరంగా, వ్యక్తిగతంగా, జీవితపరంగా నందమూరి తారకరామారావుగారంటే నాకు దేవుడులాంటివారు. ఎన్టీఆర్‌గారి, ఎంజీఆర్‌గారి ఫిలాసఫీలు జోగేంద్ర అనే పాత్రలో ఉంటాయి. అందుకే ఈ సినిమా చేశా. ఈ సినిమా నాకు చాలా ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయిన సినిమా. ఈ సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సినిమా గురించి నేను చాలా గర్వంగా ఉన్నా. ఈ సినిమాను మా తాత చూడలేకపోయారనే లోటు ఉంది. ఈ రోజు ఈ వేదిక మీద నిలబడ్డామంటే ఆయన వల్లే. ఆయనతో సినిమా చేయలేదనే బాధ ఉండేది. నాకు తెలిసి ఆయన వెళ్లిపోయాక చాలా పాజిటివ్స్‌ జరుగుతున్నాయి. పైనుంచి ఆయనే సెట్‌ చేస్తున్నారని అనిపిస్తోంది. మా నాన్నతో ఫస్ట్‌ టైమ్‌ కలిసి చేశాం. మా నాన్న రియలీ గుడ్‌ ప్రొడ్యూసర్‌. సినిమా మీద తేజగారికున్న అవగాహన చాలా ఎక్కువ. ఇది జోగేంద్ర జీవిత చరిత్ర. అది రాయాలంటే జీవితంపై అవగాహన ఉండాలి. లేకుంటే రాయలేరు. వెంకటేశ్‌గారి అభిమానులు నాకు తోడు ఉన్నారన్న ధైర్యంతోనే నేను అన్నీ చేస్తున్నా. ఇదే సపోర్ట్‌ ఇస్తే హాలీవుడ్‌ సినిమా కూడా చేస్తాను. ప్రతి సినిమా చేస్తున్నప్పుడు కొత్తగా చేయాలని ఉంటుంది. ప్ర‌తి క్యారెక్ట‌ర్ కొత్తగా ఉండాలని అనుకుంటా. ఈ సినిమాలో చాలా స‌న్న‌గా క‌నిపిస్తాను. లావుగా క‌నిపిస్తాను. కండ‌లు కూడా తిరిగి ఉంటాయి. త్వ‌ర‌లోనే యువ‌త కోసం భారీ కార్య‌క్ర‌మం చేస్తాం. ఈ నెల 11న విడుద‌ల చేస్తాం`` అని తెలిపారు.

తేజ మాట్లాడుతూ ‘‘రానా గారికి కథ చెప్పగానే ఆయనకి నచ్చిందని చేశాం. రానా అంత పొడవుగా ఉన్న అమ్మాయి కావాలని కాజల్‌గారి దగ్గరకు వెళ్లాం. స్టైలిష్‌ కేరక్టర్‌ కోసం కేథరిన్‌ని తీసుకున్నాం. కొత్తోళ్లతో సినిమా చేసి బోర్‌ కొట్టిందని పాత వాళ్లతో తీశా`` అని చెప్పారు.

Glam galleries from the event

కాజల్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా నాకు స్పెషల్‌ సినిమా. రానాతో నాకు ఎంత పరిచయం ఉన్నా నాకు జోగేందర్‌గానే గుర్తుండిపోతాడు. సినిమాని ఎలా చూడాలో, ఎలా ప్రేమించాలో తేజగారి దగ్గర నేర్చుకున్నా. తేజగారికి ఎప్పటికీ రుణపడి ఉంటా. ఆయన నాకు గురువులాంటివారు’’ అని చెప్పారు.

కేథ‌రిన్ మాట్లాడుతూ `` ఈ సినిమాకు ప‌నిచేయ‌డం చాలా ఆనందంగా ఉంది. ఇందులో నా పాత్ర పేరు దేవికారాణి`` అని తెలిపారు.

భరతచౌదరి మాట్లాడుతూ ‘‘తేజగారు, రానా గారి కాంబినేషనలో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది’’ అని చెప్పారు.

కిరణ్‌ మాట్లాడుతూ ‘‘మా సంస్థలో రూపొందించే సినిమా ఇది. సూపర్‌హిట్‌ సినిమా చేశామని ఆనందంగా ఉంది. తెర వెనుక పడే కష్టమంతా నాకు తెలుసు. ఒక సినిమా కోసం ఇంత కష్టపడతారా? అనే విషయం ఈ చిత్రంతో నాకు అర్థమైంది’’ అని చెప్పారు.

డి.సురేశ్‌ బాబు మాట్లాడుతూ ‘‘బాహుబలి అయిన తర్వాత ఈ కథని ఓకే చేశాం. కథలంటే నాకు మామూలుగా భయం, అదీ నా కొడుకుతో సినిమా అంటే చాలా భయం. రానా ఈ క‌థ విని సెట్‌ అవుతుందనుకున్నాడు. ఆ తర్వాత ఆ కథని చాలా బాగా తయారుచేశారు. రానాకి యాక్టింగ్‌ బాగా వస్తుందా? రాదా? అని కూడా ఆలోచించాను. రష్‌ చూసిన తర్వాత నిర్మాత‌ కిరణ్‌ బావుందన్నారు. కేరక్టరైజేషన ఓరియంటడ్‌ పొలిటికల్‌ డ్రామా ఇది. కాజల్‌, రానా చాలా బాగా చేశారు. కేథరిన్‌ చాలా బాగా చేసింది. తేజ వాళ్లందరి చేత చాలా బాగా చేశారు`` అని అన్నారు.

నవదీప్‌ మాట్లాడుతూ ‘‘సురేశ్ సంస్థలో నాకు ఇది రెండో చిత్రం. రామానాయుడుగారి దగ్గర సినిమా గురించి చాలా నేర్చుకున్నా. ఇప్పుడు సురేశ్‌బాబుగారు, రానా దగ్గర కూడా సినిమా గురించే మాట్లాడుకుంటాం. రానాని చూసి చాలా నేర్చుకున్నాం. ఇందులో కథకి, జోగేంద్రకి సపోర్టింగ్ కేర‌క్ట‌ర్‌ చేశా. నా సినిమా కెరీర్‌ తేజ గారి దగ్గర నుంచే స్టార్ట్‌ అయింది. మధ్యలో కొన్ని సినిమాలు చేసే స్టేజ్‌కి వెళ్లాయి. కానీ కుదరలేదు. ఆయనతో మ‌ర‌లా చేయడం చాలా హ్యాపీ’’ అని చెప్పారు.

ఈ కార్యక్రమంలో పరుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు, ప‌రుచూరి గోపాలకృష్ణ, తనికెళ్ళ భరణి, జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి, లక్ష్మీభూపాల్‌, వెంక‌ట్‌, శివాజీరాజా తో పాటు చిత్ర యూనిట్‌ సభ్యులు పలువురు పాల్గొన్నారు.

 

 


Photo Gallery (photos by G Narasaiah)

 

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved