pizza
Hushaaru press meet
You are at idlebrain.com > News > Functions
Follow Us


29 October 2018
Hyderabad

నలుగురు ఫ్రెండ్స్ జీవితాల్లో జరిగే సంఘటనలే హుషారు సినిమా కథ. ఎన్ని కష్టాలు ఎదురైనా వాటిని ఎలా అధిగమించారు. ఈ సినిమాలో బీర్ ఎలా తయారు చేయవచ్చో అనే విషయాన్ని చక్కగా చూపించాం. కానీ కథకు మద్యం సేవించడానికి సంబంధం లేదు. కథలో ఫీల్ ఉంటుంది. స్క్రీన్ ప్లే బాగుంటుంది. ఏదో ఒక పాత్రకు ప్రేక్షకుడు కనెక్ట్ అవుతాడు. ఈ సినిమాకు ఏ మూవీ కూడా స్ఫూర్తి కాదు అని దర్శకుడు హర్ష తెలిపారు.

ప్రస్టేషన్‌కు గురైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పాత్రలో కనిపిస్తాను. ఈ కథలో నా పాత్ర చాలా కీలకమైంది. సమాజంలో తమకు నచ్చింది చేయలేక మానసిక సంఘర్షణకు గురయ్యే పాత్రలో నటించాను. బీర్ తయారు చేసే సీన్లు ఉన్నా తాగకుండా ఈ సినిమాలో నటించాను. హుషారు సినిమా చూస్తే నిర్మాత విజన్ మీకు స్పష్టంగా కనిపిస్తుంది. సెకండాఫ్‌లో నా పాత్ర ఎంట్రీతో కథ అనేక మలుపులు తిరుగుతుంది. ఫస్ట్ టైం డైరెక్టర్‌గా హర్ష పనితీరు నాకు బాగా నచ్చింది అని నటుడు రాహుల్ రామకృష్ణ తెలిపారు.

నా కెరీర్‌లో హుషారు సినిమా నాకు మూడోది. మొదట అంగీకరించింది ఈ సినిమానే. కెరీర్ తప్ప మరోటి తెలియని నా పాత్ర నాది. అమెరికాకు వెళ్లాలనే తపన పడే పాత్ర నాది. సినిమాలోని నా పాత్ర ఎలివేట్ కావడానికి చాలా వర్క్ చేశాం. షూటింగ్ ముందు రిహార్సల్ చేశాం. మంచి ప్రొడక్షన్‌లో నటించాననే తృప్తి లభించింది అని హీరోయిన్ ప్రియ వడ్లమాని పేర్కొన్నారు.

తేజ్ కంచర్లకు జంటగా నటించాను. నా పాత్రను చాలా మంది హోమ్లీ అమ్మాయిలు పోల్చుకొని చూస్తారు. ఒకరిని మాత్రమే ఇష్టపడి ప్రేమించే అమ్మాయి పాత్ర. నిర్మాత, దర్శకులకు అంచనాలకు తగినట్టుగా నటించాను అని దక్షా నగార్కర్ తెలిపారు. ఈ చిత్రంలో నా పాత్ర ఫుల్ బిందాస్‌తో కూడినది. మంచైనా, చెడైనా ఫ్రెండ్స్‌తో కలిసి చేయాలని అనుకొనే పాత్ర అని మరో హీరో తేజ్ కొర్రపాటి అన్నారు.

మరో హీరో దినేష్ తేజ్ మాట్లాడుతూ.. నా పాత్ర చూడటానికి చాలా టఫ్‌గా కనిపిస్తుంది. కానీ లోపల మాత్రం చాలా సాఫ్ట్‌గా ఉంటాను అని అన్నారు.

హుషారు సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సినిమాకు పనిచేసిన వారందరూ కొత్తవాళ్లే. మా కెరీర్‌కు ఈ సినిమా దోహదపడుతుందనే హోప్ ఉంది. క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సీన్లు ఆకట్టుకొనేలా ఉంటాయి. ప్రతీ ప్రేక్షకుడు నా పాత్రను రిలేట్ చేసుకొంటారు అని హీరో తేజస్ కంచర్ల అన్నారు. రెండు గంటలపాటు ఎంజాయ్ చేయాలంటే హుషారు సినిమాకు రావొచ్చు. వాస్తవంగా నేను ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌ను. డైరెక్టర్ హర్ష సూచన మేరకు యాక్టర్‌గా మారాను. రాహుల్ రామకృష్ణ నాకు బాగా నచ్చింది అని హీరో అభినవ్ తెలిపారు.

నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ.. హుషారు సినిమా అంతా రెడీ అయింది. మేము ఊహించిన దానికంటే ఎక్కువగా అవుట్ పుట్ వచ్చింది. పాటలు ఇప్పటికే ప్రజాదరణ పొందాయి. ట్రైలర్లు యూట్యూబ్‌లో వైరల్ అవతున్నాయి. ప్రేక్షకుడిని హుషారు సినిమా నిరాశపరచకుండా అవుట్‌పుట్‌ను మెరుగుపరుస్తున్నాం. సినిమాను నా ఫ్రెండ్స్, తోటి నిర్మాతలకు చూపిస్తున్నాం. వారి సలహాలను స్వీకరించి సినిమా అవుట్‌పుట్‌ను మరింత బెటర్ చేస్తున్నాం. థియేట్రికల్ ట్రైలర్ రెస్పాన్స్ చాలా అనూహ్యంగా వచ్చింది. హుషారు సినిమాకు పెరుగుతున్న క్రేజ్‌ను చెప్పడానికి ఈ మీడియా సమావేశాన్ని నిర్వహించాం. బిజినెస్ పరంగా చాలా ఏరియాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని 70 కాలేజీలకు వెళ్లే టూర్‌ను ప్లాన్ చేస్తున్నాం. త్వరలోనే ఆ షెడ్యూల్‌ను వెల్లడిస్తాం. టెక్నికల్‌గా చాలా జాగ్రత్తలు తీసుకొంటున్నాం. సింక్ సినిమాలో సౌండ్ డిజైన్ చేస్తున్నాం అని బెక్కెం వేణుగోపాల్ వెల్లడించారు.



Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved