pizza
Aithe 2.0 release on 16 March
మార్చి 16న 'ఐతే 2.0'
You are at idlebrain.com > News > Functions
 
Follow Us

14 March 2018
Hyderabad

ఇంద్రనీల్‌ సేన్‌గుప్తా, జారా షా, అభిషేక్‌, కర్తవ్య శర్మ, నీరజ్‌, మ ణాల్‌, మ దాంజలి కీలక పాత్రధారులుగా రాజ్‌ మాదిరాజు దర్శకత్వం చేసిన చిత్రం 'ఐతే 2.0'. ఫర్మ్‌ 9 పతాకంపై కె.విజయరామారాజు, హేమంత్‌ వల్లపురెడ్డి నిర్మించారు. ఈ సినిమా ఫిభ్రవరి 16న విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో...

sమాట్లాడుతూ - ''బెంగాలీ, హిందీ చిత్రాల్లో దాదాపు నలబై సినిమాల్లో నటించాను. నా తొలి తెలుగు సినిమా ఇది. దర్శకుడు రాజ్‌ మాదిరాజ్‌, నిర్మాతలకు థాంక్స్‌. సినిమా ఎంటైర్‌ ప్రాసెస్‌ను బాగా ఎంజాయ్‌ చేశాను. సైబర్‌ క్రైమ్‌ నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఎంటర్‌టైనింగ్‌గా సాగే టెక్నో థ్రిల్లర్‌ ఇది'' అన్నారు.

నిర్మాత విజయ రామరాజు మాట్లాడుతూ - ''మా నాన్న కూడా జర్నలిస్ట్‌గా పనిచేసేవారు. అప్పట్లో రజకార్లు చేసిన పనులు గురించి ఊరి గోడలపై బొగ్గుత రాసేవారు. అప్పటి జర్నలిజంకు.. ఇప్పటి జర్నలిజంకు చాలా తేడా ఉంది. ఇప్పుడు టెక్నికల్‌గా ఎంతో ముందున్నాం. ఇలాంటి సాంకేతికతలో మనం ఎక్కడున్నామనేది ఎవరికీ అర్థం కావడం లేదు. ఇప్పటి వరకు ఎవరూ టచ్‌ చేయని పాయింట్‌తో స్టూడెంట్స్‌ చుట్టూ తిరిగే కథతో చేసిన సినిమా ఇది. ఈ సినిమా యు.ఎస్‌లో 37-40 సెంటర్స్‌లో విడుదల కానుండటం మాకు ఎంతో ఆనందంగా ఉంది. సినిమా ఈ నెల 16న విడుదలవుతుంది'' అన్నారు.

దర్శకుడు రాజ్‌ మాదిరాజు మాట్లాడుతూ - ''సినిమా ప్రేక్షకుల నుండి ఎలాంటి రాబట్టుకుంటుందోననే డౌట్‌ ఉండేది. కానీ రీసెంట్‌గా మేం యూనిట్‌తో కలిసి రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ఇంజనీరింగ్‌ కాలేజీస్‌కు వెళ్లాం. అక్కడ మా యూనిట్‌కు వచ్చిన స్పందన చూసిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. ముఖ్యంగా చాలా కాన్ఫిడెంట్‌ వచ్చింది. ఇక సినిమా మేకింగ్‌లో యూనిట్‌ సభ్యుల నుండి కొత్త విషయాలను చాలానే నేర్చుకున్నాను. ఒకే రకమైన కథాంశాలతో విసిగిపోయిన ప్రేక్షకులకు కొత్త కాన్సెప్ట్‌ సినిమాలు ఎంతో అవసరం. అలాంటి కథాంశంతో రూపొందిన చిత్రమే ఇది. మనలో ప్రతి ఒక్కరి కదథిది. టెక్నో సీట్‌ ఎడ్జింగ్‌ థ్రిల్లర్‌. ఈ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది'' అన్నారు.

ఈ కార్యక్రమంలో చిత్రంలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొని సినిమా సక్సెస్‌ చేయమని ప్రేక్షకులను కోరారు.

ఈ చిత్రానికి కెమెరా: కౌశిక్‌ అభిమన్యు, ఎడిటింగ్‌: కార్తీక్‌ పల్లె, ఆర్ట్‌ డైరెక్టర్‌: రాజీవ్‌ నాయర్‌, మాటలు, పాటలు: కిట్టు విస్సాప్రగడ, సంగీతం: అరుణ్‌ చిలువేరు. నిర్మాతలు : కె.విజయరామరాజు, డా.హేమంత్‌ వల్లపు రెడ్డి దర్శకత్వం: రాజ్‌ మాదిరాజ్‌.



 
Photo Gallery (photos by G Narasaiah)
 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved