pizza
Aswamedham press meet
`అశ్వ‌మేథం` మూవీ సాంగ్ రిలీజ్
You are at idlebrain.com > News > Functions
Follow Us


6 September 2018
Hyderabad

ఔరోస్ అవ‌తార్ ఎంట‌ర్‌టైన్‌మెంట‌ట్ రూపొందిస్తున్న సినిమా `అశ్వ‌మేథం`. ధ్రువ క‌రుణాక‌ర్‌, శివంగి, సోనియా కీల‌క పాత్ర‌ధారులు.నితిన్‌.జి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఐశ్వ‌ర్యా యాద‌వ్‌, ప్రియా నాయ‌ర్ నిర్మాత‌లు. చిత్ర యూనిట్ హైద‌రాబాద్ లోని ప్ర‌సాద్ ల్యాబ్స్ లో గురువారం ఉద‌యం ప్రెస్‌మీట్ ను నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో గ‌జాన‌న అనే పాట‌ను నిర్మాత ఐశ్వ‌ర్య యాద‌వ్ విడుద‌ల చేశారు.

రైట‌ర్ జ‌గ‌దీశ్ మెట్ల మాట్లాడుతూ ``ఈ ప్రాజెక్ట్ మాకు చాలా స్పెష‌ల్‌. స్పై థ్రిల్ల‌ర్ ఇది. ఇంటెన్ష‌న్‌తో ఉంటుంది. ఎంట‌ర్‌టైన్‌మెంట్ కూడా ఉంటుంది. ప్రియా నాయ‌ర్‌గారు క‌థ కావాలంటే రాశా. చాలా ఉత్సాహంగా చేశారు`` అని అన్నారు.

చ‌ర‌ణ్ అర్జున్ మాట్లాడుతూ ``నా మ్యూజిక్ మార్కెట్‌లోకి రాక నాలుగేళ్లు అయింది. ఫ్రెష్ మ్యూజిక్‌తో వ‌స్తున్నాను. అంత‌కు ముందు నేను చిన్ని చ‌ర‌ణ్‌గా చాలా సినిమాలు చేశాను. ఇప్పుడు చ‌ర‌ణ్ అర్జున్ అని పేరు మార్చుకున్నాను. వినాయ‌కుడి పాట‌తో నేను చ‌ర‌ణ్ అర్జున్‌గా రీ లాంచ్ కావ‌డం ఆనందంగా ఉంది. చాలా మంది మ్యూజిక్ డైర‌క్ట‌ర్లు ఇంత‌కు ముందే వినాయ‌కుడి మీద గొప్ప పాట‌లు చేశారు. వాళ్ల త‌ర్వాతైనా నేను వ‌రుస‌లో ఉండాల‌న్న ఆశ‌తో చేశాను. నా పాట‌ను తెర‌మీద చూసుకుంటుంటే ఆనందంగా ఉంది. అంద‌రూ ఎంక‌రేజ్ చేస్తార‌నే న‌మ్మ‌కం ఉంది`` అని చెప్పారు.

జ‌య‌పాల్ రెడ్డి మాట్లాడుతూ ``అవ‌కాశానికి ధ‌న్య‌వాదాలు`` అని అన్నారు.

ఐశ్వ‌ర్య యాద‌వ్ మాట్లాడుతూ ``ఈ ప్రాజెక్ట్ని అంద‌రూ ఆద‌రిస్తార‌ని న‌మ్మ‌కం ఉంది. మేం ప‌రిశ్ర‌మ‌కి కొత్త‌. అయినా ఇక్క‌డ ప్రోత్సాహిస్తార‌నే న‌మ్మ‌కం ఉంది`` అని చెప్పారు.

ప్రియ మాట్లాడుతూ ``మ‌న‌స్ఫూర్తిగా క‌ష్ట‌ప‌డి తెర‌కెక్కించిన సినిమా ఇది. చాలా మంచి టీమ్ కుదిరింది`` అని అన్నారు.

ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ ``గ‌జాన‌న పాటను తెర‌మీద చూస్తున్న‌ప్పుడు నాకు మేజిక‌ల్ మొమంట్‌లాగా అనిపించింది. గ‌ణేశ్ మాస్ట‌ర్ ఈ సినిమాకు కొరియోగ్ర‌ఫీ చేశారు. తెలుగు ప్ర‌జ‌లు ప్ర‌తిభావంతులు. టెక్నిక‌ల్‌గా వృద్ధిలో ఉన్నారు. తెలుగు ప‌రిశ్ర‌మ‌లో ఆడియ‌న్స్ హాన‌స్ట్ గా ఉంటారు. ప్రాడెక్ట్ బావుంటే అప్రిషియేట్ చేస్తారు. మా సినిమాకు కూడా అదే రీతిలో ప్రోత్స‌హిస్తార‌ని న‌మ్ముతున్నాను`` అని చెప్పారు.

శివాంగి మాట్లాడుతూ ``ఇంత మంచి టీమ్‌తో ప‌నిచేయ‌డానికి అవ‌కాశం దొర‌క‌డం అదృష్టంగా భావిస్తున్నాను`` అని అన్నారు.

ధ్రువ మాట్లాడుతూ ``నేను తెలుగు నేర్చుకుంటున్నాను ఇప్పుడు. తెలుగులో లాంచ్ కావ‌డం ఆనందంగా ఉంది. మా ద‌ర్శ‌క‌,నిర్మాత‌ల‌కు ధ‌న్య‌వాదాలు. యూనిక్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ఇది. ఎమోష‌న‌ల్ అటాచ్‌మెంట్ ఉన్న సినిమా ఇది. శ్రీధ‌ర్ స్టంట్స్, చ‌ర‌ణ్ పాట‌లు, గ‌ణేష్ డ్యాన్సులు సినిమాకు హైలైట్ అవుతాయి`` అని చెప్పారు.

సుమ‌న్‌, రామ‌జోగ‌య్య‌శాస్త్రి, వెన్నెల కిశోర్‌,ప్రియ‌ద‌ర్శి, సుమ‌న్‌, రామ‌జోగ‌య్య‌శాస్త్రి, అమిత్ తివారి, బేబి ప్రాచి, శ‌శిధ‌ర్‌, అవి,నామాలు మూర్తి కీల‌క పాత్రధారులు. ఈ సినిమాకు సంగీతం: చ‌ర‌ణ్ అర్జున్‌, కో ప్రొడ్యూస‌ర్‌: న‌గేష్ పూజారి, కెమెరా: ఎన్‌. జ‌య‌పాల్ రెడ్డి, ఎడిట‌ర్‌: త‌మ్మిరాజు, ఆర్ట్: జె.కె.మూర్తి, నృత్యాలు: గ‌ణేష్ స్వామి, స్టంట్‌: శ్రీ, రామ‌కృష్ణ‌, క‌థ‌, స్క్రీన్‌ప్లే: జ‌గ‌దీష్ మెట్ల‌, మాట‌లు: శ‌్రీకాంత్ విస్సా, ప్ర‌శాంత్‌, లైన్ ప్రొడ్యూస‌ర్‌: సైపు ముర‌ళి.

Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved