pizza
Chalo first song launch
`ఛలో` ఫ‌స్ట్ సాంగ్ రిలీజ్‌
You are at idlebrain.com > News > Functions
 
Follow Us

3 December 2017
Hyderaba
d

నాగ‌శౌర్య‌, ర‌ష్మిక మండ‌న్నా హీరో హీరోయిన్లుగా ఐరా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న చిత్రం `ఛ‌లో`. శంక‌ర్ ప్రసాద్ ముప్ప‌లూరి ఈ చిత్రాన్ని సమ‌ర్పిస్తున్నారు. వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో ఉషా ముప్ప‌లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫ‌స్ట్ సాంగ్‌ను హైద‌రాబాద్‌లో విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా...

ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ - ``సాంగ్ రెస్పాన్స్, కామెంట్స్ అన్ని బావున్నాయి. సినిమా బాగా వ‌చ్చింది. సినిమాను ప్ర‌తి ఒక్క‌రూ ఎంజాయ్ చేస్తారు. సాంగ్‌ను గుంటూరు ఏసీ కాలేజ్‌లో చిత్రీక‌రించాం.డీ మానిటైజేష‌న్ టైంలో నా స్క్రిప్ట్‌ను ఓకే చేశారు. అడిగిన దాని కంటే నాకు ఎక్కువ‌గానే ఇచ్చారు`` అన్నారు.

నాగ‌శౌర్య మాట్లాడుతూ - ``ఓ పాట‌ను విడుద‌ల చేశాం. పాట‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. అల్రెడి విడుద‌లైన టీజ‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. సాయిశ్రీరామ్ సినిమాకు బ్యాక్‌బోన్‌లా నిల‌బ‌డి, ప్ర‌తి సీన్‌ను అందంగా చూపించారు. క‌న్న‌డంలో హిట్ అయిన కిరిక్ పార్టీలో న‌టించిన ర‌ష్మిక ఈ సినిమాలో హీరోయిన్‌. త‌ను చ‌క్క‌గా న‌టించింది. పాట‌ల‌న్నీ బావుంటాయి. సాగ‌ర్ మ‌హ‌తి చ‌క్క‌టి మ్యూజిక్ ఇచ్చారు. సాగ‌ర్ తండ్రిగారైన మ‌ణిశ‌ర్మ‌గారికి మ్యూజిక్ బ్ర‌హ్మ అనే పేరుంటే, సాగ‌ర్‌కి మ్యూజిక్ ప్రిన్స్ అని పేరు పెట్టాల‌నుకుంటున్నాను. మా అమ్మా నాన్న‌లే నిర్మాత‌లు. నా కోసం సినిమా చేస్తున్నారు. నేను న‌మ్మిన స్క్రిప్ట్‌ను న‌మ్మి వారు న‌మ్మ‌డంతోనే సినిమా చేశారు.

శంక‌ర్ ప్రసాద్ ముప్ప‌లూరి మాట్లాడుతూ - ``ఐరా క్రియేష‌న్స్‌కు ప్రేక్ష‌కులు ఆద‌ర‌ణ ల‌భిస్తుందంటే అందుకు కార‌ణం మీడియానే. ఈ సంద‌ర్భంగా వారికి నా కృత‌జ్ఞ‌త‌లు`` అన్నారు.

ఈ చిత్రానికి సంగీతం- సాగ‌ర్ మ‌హ‌తి, సినిమాటోగ్ర‌ఫి- సాయి శ్రీరామ్‌, నిర్మాత‌- ఉషా ముల్పూరి, సమర్పణ - శంక‌ర ప్ర‌సాద్ ముల్పూరి, ద‌ర్శ‌క‌త్వం- వెంకి కుడుముల‌.


 
Photo Gallery (photos by G Narasaiah)
 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved