pizza
Krishnarjuna Yuddham press meet
`కృష్ణార్జున యుద్ధం` ప్రెస్ మీట్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

26 March 2018
Hyderabad

వ‌రుస విజ‌యాల హీరో నేచ‌ర‌ల్ స్టార్ నాని న‌టిస్తున్న చిత్రం `కృష్ణార్జున యుద్ధం` ఈ ఏప్రిల్ 12న విడుద‌ల కానుంది. వెంక‌ట్ బోయ‌న‌ప‌ల్లి స‌మ‌ర్ప‌ణ‌లో షైన్ స్క్రీన్న్ ప‌తాకంపై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. `వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌`, `ఎక్స్‌ప్రెస్ రాజా` చిత్రాల ద‌ర్శ‌కుడు మేర్ల‌పాక ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్కుతోంది.సినిమా చిత్రీక‌ణ పూర్త‌య్యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. హిప్ హాప్ త‌మిళ సంగీతం అందించిన ఈ సినిమా జ్యూక్ బాక్స్ మార్క‌టో విడుద‌లైంది. ఈ సంద‌ర్భంగా సోమ‌వారం జ‌రిగిన పాత్రికేయుల స‌మావేశంలో...

చిత్ర ద‌ర్శ‌కుడు మేర్ల‌పాక గాంధీ మాట్లాడుతూ - ``వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌, ఎక్స్‌ప్రెస్ రాజా చిత్రాల త‌ర్వాత నా ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న సినిమా `కృష్ణార్జున యుద్ధం`. సినిమా షూటింగ్ పూర్త‌య్యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. అందులో భాగంగా రీసెంట్‌గా డ‌బ్బింగ్ పూర్త‌య్యింది. ఏప్రిల్ 12న సినిమా రిలీజ్ అనుకుంటున్నాం. అంత‌కంటే ముందుగా.. అంటే మార్చి 31న తిరుప‌తిలో ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌ను చేయ‌బోతున్నాం. షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై వ‌స్తున్న తొలి చిత్ర‌మిది. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, రుక్స‌ర్ మీర్ హీరోయిన్స్‌గా న‌టించారు. మంచి స్టార్ కాస్టింగ్ న‌టించారు. నాని అన్న‌.. నాకు మంచి అవ‌కాశం ఇచ్చారు. అందుకు ఆయ‌న‌కు స్పెష‌ల్ థాంక్స్‌`` అన్నారు.

నిర్మాత సాహు గార‌పాటి మాట్లాడుతూ - ``మా బ్యాన‌ర్‌లో సినిమా చేసే అవ‌కాశం ఇచ్చిన నాని, మేర్ల‌పాక గాంధీగారికి థాంక్స్‌. సినిమా చాలా బాగా వ‌చ్చింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ జ‌రుగుతున్నాయి. ఏప్రిల్ 12న సినిమాను రిలీజ్ చేయాల‌నుకుంటున్నాం. మార్చి 31న తిరుప‌తి మున్సిప‌ల్ గ్రౌండ్స్‌లో ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌ను చేయ‌బోతున్నాం`` అన్నారు.

హీరో నాని మాట్లాడుతూ - ``హిప్ హాప్ త‌మిళ సంగీతం అందించిన ఈ సినిమా జ్యూక్ బాక్స్‌ మార్కెట్లో విడుద‌లైంది. నా కెరీర్‌లో వ‌న్ ఆఫ్ ది బెస్ట్ ఆల్బ‌మ్ అవుతుంది. త‌ను చాలా మంచి ఆల్బ‌మ్ ఇచ్చాడు. మార్చి 31న ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌ను తిరుప‌తి కండెక్ట్ చేయ‌బోతున్నాం. ఏప్రిల్ 12న సినిమాను రిలీజ్ చేయ‌బోతున్నాం. అలాగే ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ రోజున థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేస్తున్నాం. గాంధీ డైరెక్ష‌న్ నాకు చాలా ఇష్టం. త‌న‌తో వ‌ర్క్ చేయాల‌ని అనుకునేవాడిని. ఇప్ప‌టికి కుదిరింది. సినిమాను బాగా ఎంజాయ్ చేస్తూ షూటింగ్ చేశాను. ప్రేక్ష‌కుల‌కు సినిమా త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది. కాన్‌టెంప‌రరీ మూవీ. కృష్ణ‌, అర్జున అనే ఇద్ద‌రు వ్య‌క్తులు ఓ ప‌రిస్థిత‌లో ఓ స‌మ‌స్య‌పై చేసే పోరాట‌మే ఈ చిత్రం. ఇందులో కృష్ణ విలేజ్ క్యారెక్ట‌ర్‌లో క‌న‌ప‌డితే.. అర్జున్ రాక్‌స్టార్‌. ప‌ర్స‌న‌ల్‌గా నాకు కృష్ణ పాత్ర అంటే ఇష్టం. పూర్తిస్థాయి చిత్తూరు యాస‌లో మాట్లాడే పాత్ర‌. కొత్త‌గా ట్రై చేశాను. కృష్ణ క్యారెక్ట‌ర్‌ త‌ప్ప‌కుండా ఆడియెన్స్‌కు న‌చ్చుతుంది. దీనికి ఏ సినిమా ఇన్‌స్పిరేష‌న్ లేదు. ఆడియెన్స్‌ను ఎంట‌ర్ టైన్ చేయ‌డ‌మే ప్ర‌ధానంగా సినిమా చేశాం. హై ఎన‌ర్జిటిక్ మూవీ`` అన్నారు.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved