pizza
London Babulu 1st song launch
`లండ‌న్‌బాబులు` సాంగ్ రిలీజ్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

15 August 2017
Hyderaba
d


ర‌క్షిత్, స్వాతి జంట‌గా రూపొందిన చిత్రం `లండ‌న్ బాబులు`. చిన్నికృష్ణ ద‌ర్శ‌కుడు. మారుతి నిర్మాత‌. ఏవీఎస్ స్టూడియో స‌మ‌ర్ప‌ణ‌లో మారుతి టాకీస్ ప‌తాకంపై రూపొందుతోంది. ఈ సినిమా పాట విడుద‌ల కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. కె.సంగీతం అందించిన ఈ సినిమాలోని తొలి పాట‌ను స్వాంత‌త్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా విడుద‌ల చేశారు. ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ పాట‌ను విడుద‌ల చేశౄరు. త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్పెషల్ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా...

హరీష్ శంక‌ర్ మాట్లాడుతూ - సినిమా జీవితాన్ని పెద్ద‌గా చూపిస్తే, టీవీ చిన్న‌గా చూపెడుతుంది. కానీ జీవితాన్ని జీవితంగా చూపెట్టేది నాటంక మాత్ర‌మే. ఈ టీజ‌ర్‌, సాంగ్ చూస్తుంటే నాకు నాట‌కాల్లో ప‌నిచేసిన రోజులు గుర్తుకు వ‌చ్చాయి. ఆరోజుల‌ను నాకు గుర్తు చేసిన ద‌ర్శ‌కుడు చిన్నికృష్ణ‌కు థాంక్స్‌. స్వాతి ఏదైనా సినిమా చేస్తుందంటే క‌చ్చితంగా ఆ క‌థ బావుంటుంద‌నే అర్థం. హీరో ర‌క్షిత్ కొత్త‌వాడైనా మంచి ఎక్స్‌పీరియెన్స్ ఉన్న యాక్ట‌ర్‌లా చేశాడు. ఈ సినిమాలో త‌న పేరు గాంధీ. ఛాలెంజ్‌లో కూడా చిరంజీవిగారి పేరు గాంధీ. నిర్మాతగా మారుతిగారు నాకు ఇన్‌స్పిరేష‌న్‌. కొత్త కాన్సెప్ట్ సినిమాలు ఆడితేనే కొత్త న‌టీన‌టులు, టెక్నిషియన్స్ రావ‌డానికి ఆస‌క్తి చూపిస్తారు. ఈ సినిమా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ మాట్లాడుతూ - ``సినిమాలో క్యారెక్ట‌ర్స్‌, వాటి తీరు తెన్నులు కొత్త‌గా అనిపిస్తున్నాయి. టీజ‌ర్ బావుంది. పాట కూడా బావుంది.

మారుతి మాట్లాడుతూ - ``ద‌ర్శ‌కుడు చిన్నికృష్ణ అండ్ టీం జెన్యూన్‌గా చేసిన మంచి ప్ర‌య‌త్న‌మిది. కె మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పెద్ద ఎసెట్ అవుతుంది. వ‌చ్చే నెల ఫ‌స్ట్ వీక్‌లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. ఆండ‌వ‌న్ క‌ట్ట‌ళై అనే త‌మిళ సినిమాను స్వీట్ మ్యాజిక్ ప్ర‌సాద్‌గారు చూసి, న‌న్ను చూడ‌మ‌న్నారు. ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ సినిమా అని అనుకున్నా. కానీ విజ‌య్ సేతుప‌తి చాలా ప్యాష‌న్‌తో చేశార‌ని ఆయ‌న‌తో మాట్లాడితే తెలిసింది. ర‌క్షిత్‌కి చాలా మంచి సినిమా అవుతుంది. పాస్‌పోర్ట్ కోసం ప‌డే తిప్ప‌ల్ని గురించి చెప్పాం. స్వాతిలో మంచి రైట‌ర్‌, డైర‌క్ట‌ర్ కూడా ఉన్నారు. ఆవిడ‌కి క‌థ న‌చ్చి చేస్తాన‌ని అన‌గానే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ సినిమా రెగ్యుల‌ర్‌గా ఉండ‌దు. మామూలుగా నేను నిర్మించే సినిమాల‌కు పేరు వేసుకోవ‌డానికి చాలా ఆలోచిస్తాను. కానీ నాకు బాగా న‌చ్చ‌డంతో వేసుకున్నాను. చిన్నికృష్ణ‌కు మంచి సినిమా అవుతుంది`` అన్నారు.

చిన్నికృష్ణ మాట్లాడుతూ ``సినిమాల‌కు దూరంగా వైజాగ్‌లో ఉన్న న‌న్ను పిలిచి మారుతిగారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధ‌న్య‌వాదాలు. పావుగంట క‌థ విని నిఖిల్ నాకు వీడుతేడా అవ‌కాశ‌మిచ్చారు. స్వీట్‌మేజిక్ వాళ్ల అబ్బాయిని ఇంట్ర‌డ్యూస్ చేయ‌డం ఆనందంగా ఉంది. నాకు ముందు వినాయ‌కుడిలా, వెనుక మారుతిగారే స‌పోర్ట్‌గా నిలిచారు. మంచి వినోదాత్మ‌క చిత్ర‌మిది. లండ‌న్ వెళ్లాల‌నుకున్న ఓ యువ‌కుడి క‌థ ఇది`` అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో స్వాతి, ఎ.వి.ఎస్‌.ప్ర‌కాష్‌, మ‌ల్లిక్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఆలీ, ముర‌ళిశ‌ర్మ‌, రాజార‌వీంద్ర‌, జీవా, ధ‌న‌రాజ్‌, స‌త్య‌, అజ‌య్ ఘోష్, ఈరోజోల్లో సాయి, వేణు, స‌త్య‌కృష్ణ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి

సినిమాటోగ్రాఫర్ - శ్యామ్ కె నాయుడు, మ్యూజిక్ - కె, ఎడిటర్ - ఎస్.బి.ఉద్దవ్, కో డైరెక్టర్ - కొప్పినీడి పుల్లారావు, ఆర్ట్ డైరెక్టర్ - విఠల్ కోసనం

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - కిరణ్ తలసిల, దాసరి వెంకట సతీష్.


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved