pizza
Mahanubhavudu press meet
`మహానుభావుడు` పాట‌లు ప్ర‌ద‌ర్శ‌న‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

18 September 2017
Hyderaba
d

శ‌ర్వానంద్ హీరోగా, మెహ్రీన్ హీరోయిన్ గా, మారుతి ద‌ర్శ‌క‌త్వంలో యు.వి.క్రియోష‌న్స్ బ్యాన‌ర్ లో వంశీ, ప్ర‌మొద్ లు సంయుక్తంగా తెర‌కెక్కిస్తున్న చిత్రం `మ‌హ‌నుభావుడు`. ఈ సినిమా సెప్టెంబ‌ర్ 29న విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా సోమ‌వారం హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో పాట‌ల ప్ర‌ద‌ర్శ‌న జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా...

ద‌ర్శ‌కుడు మారుతి మాట్లాడుతూ - ``మ‌హానుభావుడు చిత్రాన్ని ఎప్పుడో రిలీజ్ చేయాల‌నుకున్నాం. అయితే మ‌ధ్యలో హాలీడేస్ రావడంతో వ‌ద్ద‌ని అనుకున్నాం. ద‌స‌రా పండ‌గ‌కి ఇలాంటి ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఉన్న సినిమా వ‌స్తే బావుంటుంద‌ని నిర్మాత‌లు అన‌డంతో సినిమాను సెప్టెంబ‌ర్ 29న విడుద‌ల చేస్తున్నాం. హీరో శ‌ర్వానంద్‌, మెహ‌రీన్ అంద‌రూ మంచి ఎఫ‌ర్ట్ పెట్టి వ‌ర్క్ చేశారు. చిన్న పిల్ల‌ల ద‌గ్గ‌ర నుండి పెద్ద‌వాళ్ల వ‌ర‌కూ కుటుంబం అంతా క‌లిసి సినిమా చూసేలా ఉంటుంది. శ‌ర్వానంద్ కొత్త లుక్‌లో క‌న‌ప‌డ‌తాడు. సినిమా అవుటండ్ అవుట్ ఎంట‌ర్ టైన‌ర్‌`` అన్నారు.

హీరో శ‌ర్వానంద్ మాట్లాడుతూ - ``బాగా ఎంజాయ్ చేసిన క్యారెక్ట‌ర్ ఇది. నా కెరీర్‌లో ఇలాంటి క్యారెక్ట‌ర్‌ను చేయ‌లేదు. ఇలాంటి స్క్రిప్ట్ మ‌ళ్లీ మ‌ళ్లీ వ‌స్తుంద‌ని అనుకోవ‌డం లేదు. సినిమా ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందింది. సెప్టెంబ‌ర్ 29న విడుద‌ల‌వుతుంది`` అన్నారు.

హీరోయిన్ మెహ‌రీన్ మాట్లాడుతూ - ``సినిమాలో అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు థాంక్స్‌. చాలా మంచి క్యారెక్ట‌ర్ చేశాను. మారుతిగారు చాలా చ‌క్క‌గా డైరెక్ట్ చేశారు. సినిమా కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌. ప్ర‌తి ఒక్క‌రికీ న‌చ్చుతుంద‌ని ఆశిస్తున్నాను`` అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో జెమిని సురేష్‌, మ‌ధుమ‌ణి, బాలు, ఎస్‌.కె.ఎన్‌, వంశీ, ప్ర‌మోద్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

 

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved