pizza
Malli Raava release on 8 December
డిసెంబర్ 8న సుమంత్ "మళ్లీ రావా" చిత్రం
You are at idlebrain.com > News > Functions
Follow Us

22 November 2017
Hyderabad

శ్రీ నక్క యాదగిరి స్వామి ఆశీస్సులతో స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సుమంత్ హీరోగా, ఆకాంక్ష సింగ్ ప్రధాన పాత్ర దారులుగా గౌతమ్ తిన్న సూరి దర్శకత్వంలోరాహుల్ నక్క నిర్మించిన రొమాంటిక్ డ్రామా 'మళ్లీ రావా' ఈ చిత్రం ఇటీవలే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్ 8న విడుదలకు సిద్ధంగా ఉండడంతో ఈ చిత్ర ఆడియో టీజర్ ను విడుదల చేసారు చిత్ర యూనిట్..

అనంతరం డైరెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ ఇది నా మొదటి సినిమా .. ఈ స్టోరీ 2 ఇయర్స్ బ్యాక్ రాసుకున్నాను...చాలా మంది నిర్మాతలను కలసి స్టోరీ నారెట్ చేశా అందరికీ నచ్చింది కానీ కొత్త కనుక నన్ను నమ్మి ముందుకు రాలేకపోయారు.. ఫైనల్లీ రాహుల్ యాదవ్ సినిమా చేయడంతో ఇక్కడి వరకు వచ్చింది. ఇక కథ విషయానికి వస్తే కార్తిక్- అంజలి ల మధ్య నడిచే లవ్ డ్రామా.. వీరి చుట్టూ ఉన్న వ్యక్తులు కారణంగా వారి లైఫ్ పై ఎలాంటి పరిణామం పడిందో తెలిపే కతాంశమే మళ్లీ రావా... 30 రోజుల్లో చిత్ర షూటింగ్ పూర్తి చేసాము, శ్రవణ్ అందించిన మ్యూజిక్ ఈ చిత్రానికి సోల్ అవుతుందని తెలిపారు..

నిర్మాత రాహుల్ యాదవ్ మాట్లాడుతూ వెరీ గుడ్ స్టోరీ.. అందరూ కష్టపడి ఇష్టపడి చేశారు అందుకే రిజల్ట్ అంత బాగా వచ్చింది. 10 నెలలు ప్రీ ప్రొడక్షన్ చేసాము...సుమంత్ గారు మాకు సపోర్ట్ చేసినందుకు కృతఙ్ఞతలు తెలియ చేస్తున్నా అన్నారు.

హీరో సుమంత్ మాట్లాడుతూ వన్ ఇయర్ బ్యాక్ గౌతమ్ స్టోరీ నారేట్ చేశారు. షాక్ అయ్యా... చాలా క్లారిటీ గా చెప్పాడు.. ఇంత వరకు నా కెరీర్లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సహా చెప్పిన డైరెక్టర్ ను నేను చూడలేదు... విన్న వెంటనే ఫిక్స్ అయ్యా కళ్ళు మూసుకుని సినిమా చేయచ్చు అని. నాచురల్ లవ్ స్టొరీ... గోదావరి సినిమా తరువాత అంతటి సంతృప్తిని ఇచ్చిన సినిమా ఇది. టెస్ట్ షో వేశాము చూసిన వారందరూ కళ్ళలో నీళ్లు పెట్టుకొని అభినందించారు. ఇక హీరోయిన్ ఆకాక్ష సింగ్ హిందీలో చాలా సినిమాలలో నటించింది.. తను ఈ సినిమాలో సప్రైజె ను క్రెయేట్ చేస్తుంది. అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టే చిత్రం అవుతుందని నమ్మకంగా చెప్పగలను అని అన్నారు..

సుమంత్, ఆకాక్ష, సింగ్, అన్నపూర్ణ, కాదంబరి కిరణ్, మిర్చి కిరణ్, కార్తిక్ అడుసుమల్లి, మాస్టర్ సాత్విక్, బేబీ ప్రీతి ఆస్రాని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డీఓపీ: సతీష్ ముత్యాల, సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, ఎడిటింగ్: సత్య గిడుతూరి, లిరిక్స్: కృష్ణ కాంత్, నిర్మాత: రాహుల్ యాదవ్ నక్క, కథ-మాటలు-స్క్రీన్ ప్లే- దర్శకత్వం: గౌతమ్ తిన్న సూరి.



Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved