pizza
Naa Love Story release on 29 June
నా లవ్ స్టోరీ చూసి పేరెంట్స్ మారతారు - శివగంగాధర్
You are at idlebrain.com > News > Functions
Follow Us


28 June 2018
Hyderabad

యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్స్ కు ఆడియన్స్ లో ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. ప్రేక్షకులను మెప్పించగలిగే అంశాలు ఉండేలా చూసుకుని.. కాస్త ఎమోషన్, మరికాస్త సెంటిమెంట్ రంగరించి దాన్ని ప్రేమకథకు ముడేస్తే అంతకు మించిన హిట్ మెటీరియల్ ఏమీ ఉండదు. ఇప్పుడు అలాంటి అన్ని అంశాలతో కలిసి వస్తోన్న సినిమానే నా లవ్ స్టోరీ. రేపు జూన్ 29న విడుదల కాబోతోన్న ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను దర్శకుడు శివగంగాధర్ మీడియాతో పంచుకున్నాడు..

ఈ సందర్భంగా శివగంగాధర్ మాట్లాడుతూ ‘‘దర్శకుడిగా ఇది నా మొదటి సినిమా.. ఈ సినిమాలో కథే హీరో.. యూత్ కనెక్ట్ అయ్యేలా ఉండే యూనివర్సల్ లవ్ స్టోరీ ఇది. ప్రతి సీన్ కథలో మిళితమయ్యే ఉంటుంది. ఏ సన్నివేశం కూడా కథను దాటి వెళ్లదు. మంచి స్క్రీన్ ప్లే ఉంటుంది. హీరోయిన్ నటన ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. అలాగే హీరో సింప్లీ సూపర్బ్. హీరో, హీరోయిన్లకు ఫాదర్ క్యారెక్టర్స్ చేసిన శ్రీ మన్నారాయణ, తోటపల్లి మధుల పాత్రలు అద్భుతంగా నవ్విస్తాయి. మిగతా అందరూ సీనియర్ ఆర్టిస్టుల్లా నటించారు. కథానుగుణంగా చూస్తే.. హీరోతో మొదలయ్యే లవ్ స్టోరీ హీరోయిన్ తో ఎండ్ అవుతుంది. ఇది ఇప్పటి వరకూ రాని పాయింట్. ఈ లవ్ స్టోరీలో ఈ ప్రేమికులిద్దరూ కలిసి ఓ నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం పేరెంట్స్ లో మార్పు తీసుకువస్తుంది. సినిమా చూస్తే చాలామంది పేరెంట్స్ మారతారనే నమ్మకం ఉంది. ఇక ఇందులో పాటలు భువనచంద్ర, శివశక్తి దత్తా రాశారు. అద్భుతమైన సాహిత్యం అందించారు వారు. అలాగే మంచి ట్యూన్స్ కూడా కుదిరాయి. అందుకే పాటలు చాలా చాలా బావున్నాయనే పేరొచ్చింది.

ఇక ఏ ప్రేమకథకైనా సంగీతం చాలా ఇంపార్టెంట్. అది ఈ సినిమాకు వరంలా దొరికింది. సంగీత దర్శకుడు వేదనివాస్ అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారు. మొత్తంగా ఈ సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా ఆద్యంతం హాయిగా సాగిపోతుంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలన్నీ నా లవ్ స్టోరీలో ఉంటాయి’’ అని చెప్పాడు.

రేపు విడుదల కాబోతోన్న నా లవ్ స్టోరీలో మహీధర్, సోనాక్షి సింగ్ జంటగా నటిస్తున్నారు. తోటపల్లి మధు, శివన్నారాయణ, ఛమ్మక్ చంద్ర, డి.విలతో పాటు మరికొందరు నూతన ఆర్టిస్టులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. సాంకేతిక నిపుణులు సినిమాటోగ్రఫీ : వై.ఇ. కిరణ్, సంగీతం : వేద నివాన్, పిఆర్వో : జి.ఎస్.కే మీడియా, ఎడిటర్ : నందమూరి హరి, మాటలు : మల్కారి శ్రీనివాస్, బ్యానర్ : అశ్వని క్రియేషన్స్, కో డైరెక్టర్ : సేతుపతి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కాకర్ల శేషగిరిరావు, నిర్మాత : జి. లక్ష్మి, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : శివ గంగాధర్.

 


Photo Gallery (photos by G Narasaiah)
 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved