pizza
Nene Raju Nene Manthri press meet
కొత్త టెక్నాల‌జీతో `నేనే రాజు -నేనే మంత్రి`
You are at idlebrain.com > News > Functions
Follow Us

19 July 2017
Hyderabad

డి.రామానాయుడు స‌మ‌ర్ప‌ణ‌లో సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, బ్లూ పానెట్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ` నేనే రాజు నేనే మంత్రి`. రానా, కాజ‌ల్ హీరో హీరోయిన్లుగా న‌టించారు. తేజ ద‌ర్శక‌త్వంలో డి.సురేష్‌బాబు, కిర‌ణ్ రెడ్డి, భ‌ర‌త్ చౌద‌రి ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్ర‌స్తుతం సినిమా నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. ఈ సంద‌ర్భంగా బుధ‌వారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో..

డి.సురేష్ బాబు మాట్లాడుతూ - ``నేనే రాజు నేనే మంత్రి సినిమాలో త్రీడీ ఆగ్‌మెంటెడ్ రియాలిటీ(ఎ.ఆర్‌) ఉప‌యోగించాం. ఈ టెక్నాల‌జీలో ఓ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, దాని ద్వారా నేనే రాజు నేనే మంత్రి పోస్ట‌ర్‌ను స్కాన్ చేస్తే, మ‌న‌తో ఆ పోస్ట‌ర్‌లో ఎవ‌రుంటేవారు వ‌చ్చి మ‌న ప‌క్క‌నున్న‌ట్లు, మ‌న‌తో ఫోటో దిగుతున్న‌ట్లు క‌న‌ప‌డుతుంది. ఇందులో రికార్డెడ్ మెటీరియ‌ల్ ఉంటుంది. భ‌విష్య‌త్‌లో వీడియో తీసుకునే టెక్నాల‌జీని కూడా తీసుకురానున్నాం. అనూప్ పాట పాడుతున్న‌ట్లు, సినిమాకు సంబంధించిన ప‌ది ప‌దిహేను మంది యూనిట్ స‌భ్యుల‌తో ఈ టెక్నాల‌జీని ఉప‌యోగిస్తాం. దీనివ‌ల్ల థియేట‌ర్‌కు వ‌చ్చే ప్రేక్ష‌కులు ఓ ఎగ్జ‌యిట్‌మెంట్ ఉంటుంది`` అన్నారు.

 



Photo Gallery (photos by G Narasaiah)
 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved