pizza
Nenostha release on 30 December
డిసెంబ‌ర్ 30న విడుద‌ల‌వుతున్న `నేనొస్తా`
You are at idlebrain.com > News > Functions
Follow Us

29 December 2016
Hyderaba
d

జ్ఞాన్ ప్ర‌కాశ్‌, సూర్య శ్రీనివాస్‌, ప్రియాంక ప‌ల్ల‌వి ప్రధాన పాత్రల్లో రైజింగ్‌ డ్రీమ్స్‌ ప్రొడక్షన్‌ సమర్పణలో బాషా మజహర్ నిర్మాత‌గా ప‌రంద్ క‌ల్యాణ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `నేనొస్తా`.ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 30న గ్రాండ్ గా విడుద‌ల‌వుతోంది. ఈ సంద‌ర్భంగా గురువారం హైద‌రాబాద్ ప్ర‌సాద్‌ల్యాబ్స్‌లో జ‌రిగిన‌ పాత్రికేయుల స‌మావేశంలో..

హీరో జ్ఞాన్ ప్ర‌కాశ్ మాట్లాడుతూ` - ``హీరో అవ్వాల‌న్న‌ది నా పదేళ్ల క‌ల‌. ఈ సినిమాతో నెర‌వేరుతుంది. నా పాత్ర చాలా టిపిక‌ల్ గా ఉంటుంది. ఇంత మంచి అవ‌కాశం క‌ల్పించిన ద‌ర్శ‌క నిర్మాత‌లిద్ద‌రికీ థ్యాంక్స్`` అన్నారు.

రాజ్ కందుకూరి మాట్లాడుతూ...``ట్రైల‌ర్ చాలా బావుంది. ట్రైల‌ర్‌లో ద‌ర్శ‌కుడి టాలెంట్ ఏంటో తెలుస్తుంది. ద‌ర్శ‌కుడిలోని ప్ర‌తిభ, మాట్లాడాక నిర్మాత‌కున్న క్లారిటీ ఏంటో అర్థ‌మైంది. ద‌ర్శ‌క నిర్మాత‌లిద్ద‌రికీ కూడా మంచి భ‌విష్య‌త్ ఉంది. ఈ సినిమాకు హిట్ట‌య్యే ల‌క్ష‌ణాలు మెండుగా క‌నిపిస్తున్నాయి. సినిమాటోగ్ర‌ఫీ, మ్యూజిక్ మంచి క్వాలిటీ తో ఉన్నాయి. యూనిట్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్`` అన్నారు.

చిత్ర నిర్మాత బాషా మ‌జ‌హ‌ర్ మాట్లాడుతూ - ``ద‌ర్శ‌కుడు ప‌రంధ్ క‌ళ్యాణ్ చెప్పిన క‌థ న‌చ్చడంతో సినిమా చేయ‌డానికి రెడీ అయ్యాను. ఒక మంచి టీంను సెల‌క్ట్ చేసుకున్నాను. సినిమాను సిన్సియ‌ర్ గా తెర‌కెక్కించాము. నిత్యం మ‌న‌కు ఎదుర‌య్యే పాత్ర‌ల‌తో పాటు ఓ టిపిక‌ల్ క్యార‌క్ట‌ర్ మా సినిమాలో ఉంటుంది. ఆ క్యార‌క్ట‌ర్ నిజ జీవితంలో మ‌న‌కు ఎదురైతే ఏంటి ప‌రిస్థితి అన్నదే చిత్ర క‌థాంశం. ల‌వ్, రొమాన్స్, థ్రిల్లింగ్ అంశాల‌తో ఆద్యంతం ఆక‌ట్టుకునేలా సినిమా ఉంటుంది. మా సినిమా న‌చ్చి అభిషేక్ పిక్చ‌ర్స్ వారు నైజాంలో విడుద‌ల చేయ‌డానికి ముందుకు రావ‌డం మాకు ద‌క్కిన తొలి విజ‌యంలా భావిస్తున్నాం. ఈ నెల 30న గ్రాండ్ గా సినిమాను విడుద‌ల చేస్తున్నాం`` అన్నారు.

Priyanka Pallavi glam gallery from the event

ద‌ర్శ‌కుడు ప‌రంధ్ క‌ళ్యాణ్ మాట్లాడుతూ - ``ఎంతో ఇష్టంతో క‌ష్ట‌ప‌డి చేసిన సినిమా ఇది. ల‌వ్, రొమాన్స్,థ్రిల్లింగ్ అంశాలు ఆకట్టుకునేలా ఉంటాయి. మా ఆర్టిస్స్ట్ మ‌రియు టెక్నీషియ‌న్స్ పూర్తి స‌హ‌కారం వ‌ల్ల సినిమా బాగా వ‌చ్చింది. ఈ నెల 30న విడుద‌ల‌వుతోన్న మా చిత్రం అంద‌రికీ న‌చ్చుతుంద‌న్న న‌మ్మ‌కం ఉంది``అన్నారు.

సంధ్యాజ‌న‌క్ మాట్లాడుతూ - ``యంగ్ టీమ్ చేసిన మంచి ప్ర‌య‌త్నం `నేనొస్తా`. నేను హీరో మ‌ద‌ర్ గా న‌టించా. ద‌ర్శ‌క నిర్మాత‌లు ఎక్క‌డా రాజీప‌డ‌కుండా ఎంతో పాష‌న్ తో సినిమాను రూపొందించార‌న్నారు.

ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో హీరోయిన్ ప్రియాంక‌ ప‌ల్ల‌వి, సూర్య శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ బ‌ల్లా హ‌నుమ, ధీర‌జ్ త‌దిత‌రులు పాల్గొని సినిమా స‌క్సెస్ చేయాల‌ని ప్రేక్ష‌కుల‌ను కోరారు.

జ్ఞాన్ ప్ర‌కాశ్‌, సూర్య శ్రీనివాస్‌, ప్రియాంక ప‌ల్ల‌వి, సంధ్యాజనక్‌, బిహెచ్‌ఇఎల్‌ ప్రసాద్‌, మాస్ట‌ర్ విజ‌య్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎడిటర్‌: ఎస్‌.జె.శివకిరణ్‌; సంగీతం: అనురాగ్‌ వినీల్‌; నిర్మాత: బాషా మజహర్‌; రచన-దర్శకత్వం: పరంధ్ కళ్యాణ్‌.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved