pizza
Pittagoda release on 24 December
'పిట్టగోడ` నాలుగో సాంగ్ రిలీజ్
You are at idlebrain.com > News > Functions
Follow Us

15 December 2016
Hyderaba
d

విశ్వదేవ్‌ రాచకొండ, పునర్నవి హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ స్టార్‌ ప్రొడ్యూసర్‌ డి.సురేష్‌బాబు సమర్పణలో సురేష్‌ ప్రొడక్షన్స్‌, సన్‌షైన్‌ సినిమాస్‌ పతాకాలపై అనుదీప్‌ కె.వి. దర్శకత్వంలో దినేష్‌కుమార్‌, రామ్మోహన్‌ పి. నిర్మించిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'పిట్టగోడ'. ఈ చిత్రంలోని నాలగవ సాంగ్‌ను డిసెంబర్‌ 15న హైదరాబాద్‌ రామానాయుడు స్టూడియోలో డి.సురేష్‌బాబు లాంచ్‌ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో చిత్రంలో నటించిన హీరో విశ్వదేవ్‌, హీరోయిన్‌ పునర్నవి, నటులు రాజు, రాము, శ్రేయాన్‌, దర్శకుడు అనుదీప్‌, ప్రాజెక్ట్‌ క్రియేటివ్‌ హెడ్‌ నాని బండ్రెడ్డిలను మీడియా వారికి పరిచయం చేశారు.

చిత్ర సమర్పకులు స్టార్‌ ప్రొడ్యూసర్‌ డి.సురేష్‌బాబు మాట్లాడుతూ - ''కొత్తవాళ్లందర్నీ ఎంకరేజ్‌ చేస్తూ ఎంతోమందిని ఇండస్ట్రీకి పరిచయం చేసారు రామ్మోహన్‌. అది ఇష్టమో, ప్రేమో తెలీదు. అలా చేయడం వల్ల ఎంతోమంది టాలెంట్‌ వున్న వాళ్ళు బయటికి వస్తారు. మళ్లీ 'పిట్టగోడ' చిత్రంతో చాలామందిని పరిచయం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఎక్స్‌లెంట్‌గా నటించారు. సినిమా చూశాను. చాలా బాగా వచ్చింది. ఓవర్సీస్‌లో షో వేస్తే ఒక డిస్ట్రిబ్యూటర్‌ సినిమా కొన్నాడు. అతని దగ్గర్నుండి ఇంకొంచెం డబ్బులు ఎక్కువ ఇచ్చి మరొక డిస్ట్రిబ్యూటర్‌ కొన్నారు. డెఫినెట్‌గా ఈ సినిమా సక్సెస్‌ అవుతుందని నమ్మకంతో ఉన్నాం. కమలాకర్‌ చాలా మంచి మ్యూజిక్‌ అందించాడు. ముఖ్యంగా రీ-రికార్డింగ్‌ బ్యూటిఫుల్‌గా చేసాడు. 'ఉయ్యాలా జంపాలా' సినిమా లాస్ట్‌ డిసెంబర్‌ 25న రిలీజ్‌ అయ్యింది. ఈ సినిమాని డిసెంబర్‌ 24న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం. మా బేనర్‌ పెట్టి 52 సంవత్సరాలైంది. ఎంతోమంది కొత్తవాళ్లు ఎన్నో కలలు కంటారు. వారి కలలను ఫుల్‌ ఫిల్‌ చేశాం. వారంతా సెల్యులాయిడ్‌ పై సక్సెస్‌ అయ్యారు. 'పిట్టగోడ' చిత్రం ద్వారా కొత్త టాలెంట్‌ని ఇంట్రడ్యూస్‌ చేస్తున్నాం. మంచి సినిమా. సోషల్‌, డిజిటల్‌ మీడియాలో ఈ సినిమా మంచి హైప్‌ క్రియేట్‌ అయ్యింది. అలాగే ప్రేక్షకుల సపోర్ట్‌, ఎంకరేజ్‌మెంట్‌ ఇలాగే వుండాలి. మా నాన్నగారు అనారోగ్యంతో వున్నప్పుడు నేను బెంగుళూరులో వున్నాను. ఆ టైమ్‌లో రామ్మోహన్‌ అనుదీప్‌ని తీసుకుని వచ్చాడు. శాడ్‌ మూడ్‌లో వున్నప్పుడు అనుదీప్‌ 'పిట్టగోడ' స్టోరి చెప్పి నవ్వించాడు. గోదావరిఖని వంటి రియల్‌ లొకేషన్స్‌లో ఈ సినిమా చేవారు. మంచి సినిమా చేశాం. సక్సెస్‌ అవుతుందని చాలా కాన్ఫిడెంట్‌గా వున్నాం'' అన్నారు.

Punarnavi Bhupalam Glam gallery from the event

నిర్మాత రామ్మోహన్‌ పి. మాట్లాడుతూ - ''ఉయ్యాలా జంపాలా'లో చిన్న క్యారెక్టర్‌ చేసిన పునర్నవి 'పిట్టగోడ' చిత్రంలో మెయిన్‌ లీడ్‌ రోల్‌ చేసింది. స్వాతి తర్వాత మళ్లీ 'పిట్టగోడ'తో ఒక తెలుగు అమ్మాయిని పరిచయం చేస్తున్నందుకు చాలా హ్యాపీగా వుంది. ఎక్స్‌లెంట్‌గా నటించింది. రాచకొండ విశ్వనాథ శాస్త్రిగారి మనవడు విశ్వదేవ్‌ వైజాగ్‌ అబ్బాయి. ఒక షార్ట్‌ ఫిలిం చూసి అతన్ని సెలెక్ట్‌ చేసాం. రెండు సంవత్సరాలు నాతో పాటే వుండి ఎంతో కష్టపడి ఈ చిత్రంలో నటించాడు. హీరోగా విశ్వదేవ్‌ క్యారెక్టర్‌కి తగ్గట్లుగా మౌల్డ్‌ అయి నటించాడు. అలాగే 'ఉయ్యాలా జంపాలా' చిత్రంలో బుజ్జిగాడు క్యారెక్టర్‌లో చేసిన రాజుది ఖమ్మం. ఈ చిత్రంలో నలుగురి ఫ్రెండ్స్‌లో ఒకరిగా నటించాడు. జబర్దస్త్‌ ఫేం రాముది వరంగల్‌. మనం యాభై రోజుల ఫంక్షన్‌లో విక్రం కె.కుమార్‌ని ఇమిటేట్‌ చేస్తూ అందర్నీ నవ్వించాడు. అది చూసి రాముని సెలెక్ట్‌ చేశాం. శ్రీహన్‌ ది అల్వాల్‌. ఇంజినీరింగ్‌ చదివి ఇన్ని షార్ట్‌ ఫిలింస్‌ చేశాడు. అతనొక ఫ్రెండ్‌ క్యారెక్టర్‌ చేశాడు. ముఖ్యంగా అనుదీప్‌ సంగారెడ్డి నుండి వచ్చాడు. విరించి ఫ్రెండ్‌. అలా నాకు పరిచయం. 'ఉయ్యాలా జంపాలా'కి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వర్క్‌ చేశాడు. ప్రతిసారి జోక్స్‌ చెప్పి నవ్విస్తుంటాడు. ఈ జోక్‌లు అన్నీ కలిపి ఒక కథ చేయమని చెప్పాను. అలా ఈ సినిమా స్టార్ట్‌ అయ్యింది. మరో సినిమా చెయ్యాలన్న తపన వున్న డైరెక్టర్‌. అలాగే నాని బండ్రెడ్డి ఈ ప్రాజెక్ట్‌కి క్రియేటివ్‌ హెడ్‌గా పని చేశారు. కంప్లీట్‌గా ఈ ప్రాజెక్ట్‌ని నన్ను కంట్రోల్‌లో పెట్టి చేశాడు. షూటింగ్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ అంతా తనే చూసుకున్నాడు. నెక్ట్స్‌ ఫిలిం అతనితో చెయ్యాలని ప్లాన్‌ చేస్తున్నాం. కమలాకర్‌ గుడ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌. ఈ సినిమాకి మ్యూజిక్‌ చేయమని అడిగినప్పుడు చేయడం లేదు. మానేశాను అన్నాడు. తర్వాత మా గురించి తెలుసుకుని ఈ కథ విని ఇంప్రెస్‌ అయి ఓకే చేశాడు. సినిమాకి వాయిస్‌ ఓవర్‌ ఇచ్చాడు. 96లో సురేష్‌బాబుగారు పరిచయం అయ్యారు. నాయుడుగారు, సురేష్‌బాబుగారు కొత్తవాళ్లని ఎంకరేజ్‌ చేసి ఎన్నో సినిమాలను నిర్మించారు. వారి ఇనిస్పిరేషన్‌తోనే కొత్తవాళ్లను ఎంకరేజ్‌ చేస్తూ 'అష్టాచమ్మా' నిర్మించాను'' అన్నారు.

దర్శకుడు అనుదీప్‌ మాట్లాడుతూ - ''ఉయ్యాలా జంపాలా' చిత్రానికి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వర్క్‌ చేసాను. విరించి నా ఫ్రెండ్‌. మా టౌన్‌లో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్స్‌ బేస్‌ చేసుకుని ఈ కథ రెడీ చేసాను. రియలిస్టిక్‌ అప్రోచ్‌తో సాగే కథ ఇది. ఔట్‌ అండ్‌ ఔట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫిల్మ్‌. సురేష్‌బాబుగారు, రామ్మోహన్‌గారు కథ విని బాగా ఇంప్రెస్‌ అయ్యారు. ప్రతి ఒక్కరికీ వాళ్ల లైఫ్‌లో జరిగే ఇన్సిడెంట్స్‌ గుర్తుకు వస్తాయి. కమలాకర్‌గారు పాటలతో, రీ-రికార్డింగ్‌తో సినిమాని నెక్స్‌ట్‌ లెవెల్‌కి తీసుకెళ్ళారు. అందరూ ఎంజాయ్‌ చేసేలా ఈ సినిమా వుంటుంది'' అన్నారు.

హీరోయిన్‌ పునర్నవి మాట్లాడుతూ - ''ఉయ్యాలా జంపాలా' చిత్రంలో సపోర్టింగ్‌ రోల్‌లో నటించాను. ఈ చిత్రంలో లీడ్‌ క్యారెక్టర్‌ చేశాను. మా టీమ్‌ అంతా ఎంతో కష్టపడి వర్క్‌ చేశాం'' అన్నారు.

హీరో విశ్వదేవ్‌ రాచకొండ మాట్లాడుతూ - ''సురేష్‌బాబు, రామ్మోహన్‌గారి బేనర్‌లో నటించడం కల్లో కూడా ఊహించలేదు. షార్ట్‌ ఫిలిం చూసి ఈ చిత్రంలో హీరోగా ఛాన్స్‌ ఇచ్చారు. రియల్‌ లైఫ్‌ ఇన్సిడెంట్స్‌తో అనుదీప్‌ ఈ చిత్రాన్ని ఎక్స్‌ట్రార్డినరీగా తెరకెక్కించాడు'' అన్నారు.

శ్రేయాన్‌ మాట్లాడుతూ - ''నేను చేసిన షార్ట్‌ ఫిలిం నచ్చి రామ్మోహన్‌గారు ఈ చిత్రంలో నటించే ఛాన్స్‌ ఇచ్చారు. మా అందర్నీ సపోర్ట్‌ చెయ్యాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

రాము మాట్లాడుతూ - ''మనం యాభై రోజుల ఫంక్షన్‌లో విక్రమ్‌ కె.కుమార్‌గార్ని ఇమిటేట్‌ చేస్తూ చేసిన స్పీచ్‌ అందరికీ నచ్చింది. అది చూసి రామ్మోహన్‌గారు ఈ చిత్రంలో నటించే ఛాన్స్‌ ఇచ్చారు. ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుంది'' అన్నారు.

రాజు మాట్లాడుతూ - ''ఉయ్యాలా జంపాలా' చిత్రంలో బుజ్జి క్యారెక్టర్‌ చేసాను. ఇంత మంచి అవకాశం కల్పించిన రామ్మోహన్‌గారికి, సురేష్‌బాబుగారికి నా థాంక్స్‌'' అన్నారు.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved