pizza
Raja Meeru Keka releasing on 16th June
'రాజా మీరు కేక' ప్రెస్‌ మీట్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

14 June 2017
Hyderabad

ఆర్‌.కె.స్టూడియోస్‌ బ్యానర్‌పై రేవంత్‌, నోయల్‌, హేమంత్‌, లాస్య, శోభిత ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం 'రాజా మీరు కేక'. కృష్ణ కిషోర్‌ దర్శకత్వంలో రాజ్‌కుమార్‌.ఎం ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా జూన్‌ 16న విడుదల కానుంది. ఈ సందదర్భంగా బుదవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో...

హేమంత్‌ మాట్లాడుతూ - ''మా రాజా మీరు కేక సినిమా ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓ నలుగురు స్నేహితులు వారికి ఎదురైన సమస్యను ఎలా తెలివిగా ఎదుర్కొన్నారనే కథాంశంతో రూపొందింది. నా క్యారెక్టర్‌ చాలా ఫన్‌తో సాగుతుంది'' అన్నారు.

నోయల్‌ మాట్లాడుతూ - ''సినిమాలో వన్‌ ఆఫ్‌ ది లీడ్‌ రోల్‌ క్యారెక్టర్‌లో కనపడతాను. దర్శకుడు కిషోర్‌గారు ప్రతి క్యారెక్టర్‌కు ముఖ్యత్వాన్నిచ్చి సినిమాను చక్కగా తెరకెక్కించారు. 16న విడుదలవుతున్న ఈ చిత్రాన్ని పెద్ద హిట్‌ చేయాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

Lasya Glam gallery from the event

లాస్య మాట్లాడుతూ - ''ఒక అమ్మాయి, ముగ్గురు అబ్బాయిలు మధ్య నడిచే స్నేహన్ని తెలియజేసే చిత్రమిది. తప్పకుండా ఎంటర్‌టైనింగ్‌గా, ఆసక్తికరంగా సాగుతుంది'' అన్నారు.

రేవంత్‌ మాట్లాడుతూ - ''దర్శకుడు కిషోర్‌గారు ఒక ఫిక్షన్‌ను, రియాల్టిటీని మిక్స్‌ చేసి సినిమాను తెరకెక్కించారు. నలుగురు స్నేహితులు మధ్య నడిచే కథ. విలన్‌గా తారకరత్న నటించారు. సినిమా తప్పకుండా అందరికీ నచ్చేలా ఉంటుంది'' అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ - ''యంగ్‌ టీంతో చేసిన ఓ కొత్త ప్రయత్నం. అందరి సపోర్ట్‌తో సినిమాను చక్కగా తీశాం. ఈ నెల 16న సినిమా విడుదలవుతుంది. మా ప్రయత్నాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌ సభ్యులందరూ పాల్గొన్నారు.


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved