Grand pre-release function for Rangasthalam in Vizag on 18th March; Megastar Chiranjeevi to grace as chief guest
మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా ఈ నెల 18న వైజాగ్‌లో `రంగస్థలం` ప్రీ రిలీజ్ ఫంక్షన్
The count down to the release of one of the most awaited movie of the year, Rangasthalam, has begun. In a grand statement, the producers of the film Naveen Yerneni, Y Ravi Shankar and CV Mohan have announced a massive pre-release function to be organised in the beach city of Visakhapatnam on March 18.
The film, which will release on March 30 stars Ram Charan and Samantha as the leads and is a directorial venture of Sukumar. The audio of the film, the music of which is composed by Devi Sri Prasad, is already out in the market and has opened to quite a good response.
Speaking about the same, producer Naveen shares, “The audio jukebox of the film that was released into the market has received a great response. Earlier, three songs from the film were released and the positivity began at that juncture. To add to all the positivity, we have planned an elaborate event before the release of the film on March 30, at Vizag. It will be held at the landmark venue RK Beach on 18th. We are being able to do this only due to the support of Visakhapatnam’s Commisioner of Police Yoganand and Municipal Commissioner Narayana. We are presently working on the film’s post-production and everything is going on at a happy pace. In fact, we are quite happy with how the film has turned out. We’d be sending the prints to the US too, quite in advance. The pre-release event will have Chiranjeevi garu as the chief guest and we welcome all the fans to be a part of the celebration.”
Director Sukumar says, “The songs of Rangasthalam were released today. So far, Ranga Rangasthalana, Entha Sakkagunnave and Rangamma Mangamma were released and appreciated. I request you to listen to the rest in the jukebox. Jigel Rani is an item song, and Aa Gattukuntava Ee Gattukuntava is a wonderful song. The film will have a surprise song you’ll witness while watching the film. It has been sung by Chandrabose garu. The film that releases on March 30 is based in the 1980s backdrop and will be a film everyone will love. It will definitely be a nostalgic trip for people of those times. Finding good technicians made my work easy. Especially art directors Ramakrishna and Monik brought the period of 1980s to life. I didn’t work hard in that regard because they took care of it all. Devi Sri Prasad and Chandrabose came together to create some wonderful music for the film with their music and lyrics. Till the age of around 25 I had grown up in a rural atmosphere and I have a bond with it. This film was like going back to the roots. My films Nenokkadine and Nannaku Prematho were received really well in the US. When I went there, a man told me that I make good films in the urban setup but added that he wondered when I’d make a film rooted in our values. I felt ashamed and that’s how this happened. I wanted to do a film like this from long, but it is only now that things worked out. The word Gollabhama in Rangamma Mangamma song was only contextual and there was no intention to hurt the sentiments of anyone. My first film had an item song and it was a grand success. Ever since, it has become mandatory to have a special song in my film. The producers loved the tune of the song and we decided to make the most of it.”
Art director Ramakrishna says, “I am really thankful to the entire team of Rangasthalam for giving me the opportunity to work in the film. The audience will be thrilled to see the film. Having been brought up in the city, I never knew the village culture. Yet, I researched and tried to bring a village to life. This film will remain the best in my career.”
Lyricist Chandrabose shares, “Good lyrics got the company of good music. I thank the producers and director for this opportunity. Since almost everyone on the team has a background in a village, they connected well with the songs. I am happy with the appreciation for the music.”
Producers: Naveen Yerneni, Y. Ravi Shankar, CV Mohan
Director: Sukumar
మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ , సమంత హీరో హీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్, యలమంచిలి రవిశంకర్; సి.వి.ఎం(మోహన్) నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం 'రంగస్థలం'. ఈ సినిమా మార్చి 30న విడుదలవుతుంది. మార్చి 18న ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించబోతున్నారు. సినిమాకు సంబంధించిన ఆడియో మార్కెట్లోకి విడుదలైంది. ఈ సందర్భంగా... నవీన్ ఎర్నేని మాట్లాడుతూ - '''రంగస్థలం' సినిమాకు సంబంధించిన ఆడియో జ్యూక్ బాక్స్ మార్కెట్లోకి విడుదలైంది. ఆల్‌రెడీ విడుదలైన మూడు పాటలకు చాలా మంచి స్పందన వచ్చింది. ఈ నెల 18న వైజాగ్ ఆర్.కె.బీచ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కండెక్ట్ చేస్తున్నాం. ఈ ఈవెంట్‌ను చాలా గ్రాండ్‌గా నిర్వహిస్తున్నాం. వైజాగ్ కమీషనర్ ఆఫ్ పోలీస్ యోగానంద్, మున్సిపల్ కమీషనర్ నారాయణగారి సహకారంతో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను నిర్వహిస్తున్నాం. సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా కంఫర్ట్‌బుల్‌గా జరుగుతుంది. యు.ఎస్‌కు కూడా ముందుగానే ప్రింట్‌ను పంపేస్తున్నాం. ప్రీ రిలీజ్‌కు ముఖ్య అతిథిగా చిరంజీవిగారు రానున్నారు. అభిమానులను ఓపెన్ వెల్‌కమ్ చెబుతున్నాం'' అన్నారు.
సుకుమార్ మాట్లాడుతూ - ''ఈరోజు మార్కెట్లోకి 'రంగస్థలం' ఆడియో నేరుగా విడుదలైంది. సినిమాలో ఇప్పటికే 'ఎంత సక్కగున్నావే... ', 'రంగ రంగ రంగస్థలానా..', 'రంగమ్మ మంగమ్మ' అనే మూడు సాంగ్స్ విడుదలైయాయి. మరో రెండు సాంగ్స్‌ను జ్యూక్ బాక్స్‌లో వినండి. అందులో 'జిగేల్ రాణి ఐటెమ్ సాంగ్ ', 'ఆగట్టుకుంటావా? ఈ గట్టుకుంటావా? అనే సాంగ్స్‌ను ఎంజాయ్ చేయవచ్చు. అలగే సినిమాలో సర్‌ప్రైజ్ సాంగ్‌ను సినిమాలో చూడొచ్చు. ఆ సాంగ్‌ను చంద్రబోస్‌గారు పాడారు. సినిమాను మార్చి 30న విడుదల చేస్తున్నాం. 1980 బ్యాక్‌డ్రాప్‌లో సినిమా సాగుతుంది. తప్పకుండా అందరికీ నచ్చుతుంది. ఆ కాలం నుండి వచ్చిన వ్యక్తులను సినిమా అలరిస్తుంది. మిస్ అయిన జనరేషన్‌ను ఈ జనరేరషన్‌లో చూడొచ్చు. మంచి టెక్నీషియన్స్ దొరకడం వల్ల నా వర్క్ సులభమైంది. ముఖ్యంగా ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ, మోనికగారు 1980 బ్యాక్‌డ్రాప్‌లో సెట్‌ను చక్కగా చేశారు. నేను పెద్దగా కష్టపడలేదు. తను చాలా అందంగా సెట్ వేశాడు. నేను ఆసెట్ చూసి ఆశ్చర్యపోయాను. దేవిశ్రీప్రసాద్, చంద్రబోస్‌గారు మంచి క్రియేటివ్ పర్సన్స్. చంద్రబోస్‌గారు ప్రతి సాంగ్‌ను 10-15 నిమిషాల్లో రాసిచ్చేశారు. పాట రాసిన తర్వాతే ట్యూన్స్ కంపోజ్ చేశారు. సినిమాలో ఆరు పాటలకు ఇదే పద్ధతిని ఫాలో అయ్యాం. నేను 25-28 సంవత్సరాలు పల్లెటూర్లోనే పెరగడంతో మంచి అనుబంధం ఏర్పడింది. ఈ సినిమా చేయడం వల్ల నా అనుబంధాన్ని మళ్లీ వెతుక్కున్నట్లు అయ్యింది. నేను డైరెక్ట్ చేసిన `నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో` సినిమాలు యు.ఎస్‌లో చక్కగా వసూళ్లను రాబట్టాయి. నేను అక్కడకు వెళ్లినప్పుడు ఓకాయన 'మీరు ఆర్బన్ బ్యాక్‌డ్రాప్ సినిమాలు చక్కగా చేశారు. మన సంస్కృతిలో సినిమాలు ఎప్పుడు చేస్తారు' అని అడిగారు. నాకే సిగ్గు అనిపించింది. ఇలాంటి సినిమా చేయాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాను. ఇప్పటికీ కుదిరింది. సినిమాలో రంగమ్మ మంగమ్మ పాటలో ఉపయోగించిన గొల్లబామ అనే పదం ఓ కీటకానికి సంబంధించింది. ఎవరినీ ఎదో అనాలని చేయలేదు. నేను తొలి సినిమాలోఐటెమ్ సాంగ్ పెట్టినప్పుడు అది పెద్ద సక్సెస్ అయ్యింది. అక్కడ నుండి ఐటెమ్‌సాంగ్స్ కంపల్సరీగా పెట్టాల్సి వస్తుంది. నవీన్‌గారికి కూడా ఐటెమ్ సాంగ్స్ అంటే ఇష్టం. ఆయనకు ఈ సినిమాలో ఐటెమ్ సాంగ్ వినిపించాను. నిర్మాతలకు నచ్చడంతో.. ఐటెమ్ సాంగ్‌ను పెట్టాను'' అన్నారు.
ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ - ''నాకు 'రంగస్థలం' సినిమా చేసే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు.. నాకు సహకారం అందించిన రామ్‌చరణ్‌కు థాంక్స్. రేపు సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు థ్రిల్ అవుతారు. నేను సిటీలోనే పుట్టి పెరగడం వల్ల నాకు విలేజ్ కల్చర్ తెలియదు. అయినా నేను రీసెర్చ్ చేసి సెట్ వేశాను. నా కెరీర్‌లో ఇదొక బెస్ట్ మూవీగా నిలిచిపోతుంది'' అన్నారు.
చంద్రబోస్ మాట్లాడుతూ ''మంచి సాహిత్యానికి, మంచి సంగీతం కుదిరింది. మంచి సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. దాదాపు అందరూ పల్లెటూర్ల నుండి వచ్చారు కాబట్టి వారికి పాటలు బాగా కనెక్ట్ అయ్యాయి. పాటలు చాలా బావున్నాయని అందరూ అప్రిసియేట్ చేస్తున్నారు'' అన్నారు.