pizza
Rangasthalam press meet
మా బేనర్‌లో 'రంగస్థలం' వంటి వండ్రఫుల్‌ మూవీని ఇచ్చిన సుకుమార్‌గారికి మా థాంక్స్‌ - నిర్మాత నవీన్‌ ఎర్నేని
You are at idlebrain.com > News > Functions
Follow Us

29 March 2018
Hyderabad

ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్న 'రంగస్థలం' రిలీజ్‌ డేట్‌ రానే వచ్చింది. మార్చి 30న ఈ చిత్రం అత్యధిక థియేటర్లలో వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ కానుంది. మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, సమంత కాంబినేషన్‌లో బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌, మోహన్‌ (సివిఎం) నిర్మించిన ప్రెస్టీజియస్‌ మూవీ 'రంగస్థలం'. ఈ చిత్రం రిలీజ్‌ సందర్భంగా 'రంగస్థలం' విడుదలకు సిద్ధమయింది పేరుతో 'రంగస్థలం' విలేజ్‌ సెట్లో ప్రెస్‌మీట్‌ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌, నిర్మాతలు నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సివిఎం), అనసూయ, సీనియర్‌ నటుడు నరేష్‌, కాదంబరి కిరణ్‌, జబర్దస్త్‌ శేషు, బేబి హనీ పాల్గొన్నారు.

ఎక్స్‌పెక్టేషన్స్‌ రీచ్‌ అవుతామనే కాన్ఫిడెన్స్‌ వుంది!!
నిర్మాత నవీన్‌ ఎర్నేని మాట్లాడుతూ - ''మార్చి 30న 'రంగస్థలం' చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా 1700 థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం. ఈ సినిమా టీజర్‌ దగ్గర నుండి ట్రైలర్‌ వరకు హై ఎక్స్‌పెక్టేషన్స్‌ని క్రియేట్‌ చేశాయి. దేవిశ్రీప్రసాద్‌ అందించిన సాంగ్స్‌ సినిమాకి బిగ్‌ ఎస్సెట్‌ అయ్యాయి. సెన్సార్‌ వాళ్ళు ఎక్స్‌ట్రార్డినరీగా సినిమా వుందని చెప్పారు. ఇంత హైప్‌ రావడానికి మీడియా వారు చాలా సపోర్ట్‌ చేశారు. ప్రేక్షకుల్లో, అభిమానుల్లో హై ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్‌ అవుతామని కాన్ఫిడెన్స్‌గా వున్నాం. 'రంగస్థలం' వంటి వండ్రఫుల్‌ మూవీని మా బేనర్‌లో చేసిన సుకుమార్‌గారికి మా కృతజ్ఞతలు. ఈ సినిమా చేసే అవకాశాన్ని కల్పించిన రామ్‌చరణ్‌గారికి థాంక్స్‌. చరణ్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఈ చిత్రంలో పీక్స్‌లో వుంటుంది. చాలా ఎగ్జైటెడ్‌గా వుంది. ప్రేక్షకుల తీర్పు కోసం ఎదురు చూస్తున్నాం'' అన్నారు.

అద్భుతమైన ఫీల్‌ని కలిగించే 'రంగస్థలం'
బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ మాట్లాడుతూ - ''1980కి తగ్గట్లుగా 'రంగస్థలం' విలేజ్‌ సెట్‌ని అద్భుతంగా వేయటం జరిగింది. రామకృష్ణ, సెట్‌ డిపార్ట్‌మెంట్‌, నా డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రతి ఒక్కరూ చాలా హార్డ్‌వర్క్‌ చేసి నాకు సహకరించారు. ఈ సినిమా ఇంత అందంగా బాగా రావడానికి మా మైత్రి మూవీస్‌ నిర్మాతలే కారణం. క్వాలిటీ విషయంలో, సబ్జెక్ట్‌ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా నేను ఏది అడిగితే అది ప్రొవైడ్‌ చేశారు. క్యారెక్టర్స్‌కి తగ్గట్లుగా బిగ్‌ ఆర్టిస్ట్‌ల్ని ఇచ్చి సపోర్ట్‌ చేశారు. నరేష్‌గారు ఫెంటాస్టిక్‌గా నటించారు. చిరంజీవిగారు సినిమా చూసి చాలా బాగుంది. నరేష్‌ బాగా చేశాడు అని మెచ్చుకున్నారు. అలాగే 2.50 నిమిషాలు సినిమా నిడివి వుంది. ఎక్కడా తగ్గించొద్దు. అలాగే రిలీజ్‌ చేయండి చెప్పారు. ఆయన మాటతో మాకు కొండంత ధైర్యం వచ్చింది. అనసూయ క్యారెక్టర్‌కి చాలామందిని ఆడిషన్స్‌ చేశాం. ఫైనల్‌గా అనసూయని సెలెక్ట్‌ చేశాం. రంగమ్మత్త క్యారెక్టర్‌కి హండ్రెడ్‌ పర్సెంట్‌ న్యాయం చేసింది అనసూయ. నరేష్‌, రోహిణి, కాదంబరి కిరణ్‌ ఇంకా చాలామంది ఆర్టిస్ట్‌లు స్పాంటేనియస్‌గా నటించారు. ఆర్‌-ఆర్‌ చేసేటప్పుడు దేవిశ్రీప్రసాద్‌ ప్రతి ఒక్కళ్ల నటన గురించి ప్రశంసించాడు. సెపరేట్‌ కామెడీ వుండదు. క్యారెక్టర్స్‌లోనే కామెడీ వుంటుంది. ప్రతి ఒక్కళ్లకీ నా విన్నపం ఏంటంటే.. తెల్లకాగితంలా థియేటర్‌కి రండి.. ఒక మంచి సినిమా చూడండి. అద్భుతమైన ఫీల్‌ని కల్గిస్తుంది. ఇది గ్యారెంటీ. ఎక్స్‌పెక్టేషన్స్‌తో రావద్దు'' అన్నారు.

ఎప్పటికీ మర్చిపోలేను!!
అనసూయ మాట్లాడుతూ - ''నా ఫేవరెట్‌ యాక్టర్‌ రామ్‌చరణ్‌. తనకి రంగమ్మ అత్తగా నటించడం చాలా థ్రిల్లింగ్‌గా వుంది. ఇండస్ట్రీలో లైఫ్‌లాంగ్‌ గుర్తుండిపోయే క్యారెక్టర్‌ చేయాలి అనుకుంటున్న టైమ్‌లో సుకుమార్‌గారు రంగమ్మ అత్తలాంటి మెమొరబుల్‌ క్యారెక్టర్‌ని ఇచ్చారు. ఆయనకి నా థాంక్స్‌. విలేజ్‌ సెట్‌ని, ఈ టీమ్‌ని ఎప్పటికీ మర్చిపోలేను. సినిమా అందర్నీ ఎంటర్‌టైన్‌ చేస్తుంది'' అన్నారు.

స్పెల్‌ బౌండ్‌ అయ్యాను!!
సీనియర్‌ నటుడు నరేష్‌ మాట్లాడుతూ - ''ప్రస్తుతం టాలీవుడ్‌ మళ్ళీ ఒక స్వర్ణ యుగాన్ని చూస్తుంది. ప్రతి సంవత్సరం రెండు మూడు అద్భుతమైన హిట్స్‌తో, తెలుగు పరిశ్రమ కళకళలాడుతోంది. ఈ 'రంగస్థలం' మెమొరబుల్‌ సూపర్‌హిట్‌. సుకుమార్‌గారి సినిమాలన్నీ ఫాలో అవుతున్నాను. ఆయన ఇప్పటివరకూ చేసిన సినిమాలన్నింటిలోకి ది బెస్ట్‌ స్క్రీన్‌ప్లే 'రంగస్థలం'. ఈ సినిమాకి 30 రోజులు వర్క్‌ చేశాను. అద్భుతమైన క్యారెక్టర్‌ని డిజైన్‌ చేశారు. సుకుమార్‌గారి క్యారెక్టర్‌కి హండ్రెడ్‌ పర్సెంట్‌ న్యాయం చేశాననే అనుకుంటున్నాను. ఒక గ్రామంలో జరిగిన చిన్న ఎలిమెంట్‌ని తీసుకుని అద్భుతమైన సినిమా తీశారు. రామ్‌చరణ్‌ని కొత్త యాంగిల్‌లో చూపించారు. సినిమాలో ట్రెమండస్‌ ఫీల్‌ వుంటుంది. రామ్‌చరణ్‌ పెర్‌ఫార్మెన్స్‌ చూసి స్పెల్‌ బౌండ్‌ అయ్యాను. ఈ సినిమాతో నేషనల్‌ అవార్డ్‌ వస్తుంది చరణ్‌కి. మైత్రి మూవీస్‌ బేనర్‌లో, తెలుగు సినిమా చరిత్రలో 'రంగస్థలం' నిలిచిపోతుంది. 2018 ఇయర్‌ నాకు ది బెస్ట్‌ మేకోవర్‌ ఇయర్‌ అని కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాను'' అన్నారు.

ఇలాంటి చిత్రాలు మైత్రి మూవీస్‌కే సాధ్యం!!
నటుడు కాదంబరి కిరణ్‌ మాట్లాడుతూ - ''జీవితాంతం లైబ్రరీలో దాచుకునే ఫిలింస్‌లో 'రంగస్థలం' వుంటుంది. ఇది మైత్రి మూవీస్‌ వారికే సాధ్యం. ఈ చిత్రాన్ని అందంగా, హృద్యంగా అద్భుతంగా తీర్చిదిద్దారు సుకుమార్‌గారు. రామ్‌చరణ్‌, ఆది ఇద్దరూ పోటాపోటీగా పెర్‌ఫార్మెన్స్‌ ఇరగదీశారు'' అన్నారు.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved