pizza
RX 100 press meet
`ఆర్ ఎక్స్ 100` సెకండ్ ట్రైల‌ర్ విడుద‌ల‌
You are at idlebrain.com > News > Functions
Follow Us


06 July 2018
Hyderabad

కార్తికేయ‌, పాయ‌ల్ రాజపుత్ హీరో హీరోయిన్లుగా కె.సి.డ‌బ్ల్యు బ్యాన‌ర్‌పై అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో అశోక్ రెడ్డి గుమ్మ‌కొండ నిర్మించిన చిత్రం `ఆర్ ఎక్స్ 100`. జూలై 12న ఈ చిత్రం విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా శుక్ర‌వారం హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియోలో జ‌రిగిన ప్రెస్‌మీట్‌లో సెకండ్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో...

రావు ర‌మేశ్ మాట్లాడుతూ ``రాచ‌కొండ ట్రాఫిక్ ఆఫీస‌ర్లు జోస‌ఫ్‌, ప్ర‌దీప్ ఈ కార్య‌క్ర‌మానికి రావ‌డం ఆనందంగా ఉంది. వాహ‌న‌చోద‌కులు ఇగోల‌కు పోతే ప్రాణాలు పోతాయి. జీవితాలు తిర‌గ‌బ‌డ‌తాయి. మా సినిమా `ఆర్ ఎక్స్ 100`లో రామిరెడ్డిగారి కెమెరా ప‌నిత‌నం చాలా బావుంటుంది. ఇప్ప‌టికే సినిమా జ‌నాల్లోకి వెళ్లింది. కార్తికేయ సినిమాలో రాకింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. పాట‌లు జ‌నాల‌కు చేరువ‌య్యాయి. ద‌ర్శ‌కుడి మైండ్‌లో వ‌చ్చిన ఈ థాట్ విన‌గానే అద్భుతంగా అనిపించింది. ఆయ‌న‌లో ఎక్క‌డా ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ క‌నిపించేది కాదు. చాలా కాన్ఫిడెంట్‌గా ఉండేవారు. సినిమా ఇప్పుడే ఎక్స్ ట్రార్డిన‌రీ అయినంత ఆనందంగా ఉంది`` అని చెప్పారు.

కెమెరామేన్ రామిరెడ్డి మాట్లాడుతూ ``ఈ సినిమాను వేరే అత‌ను చేయాల్సింది. అత‌నికి వేరే క‌మిట్‌మెంట్ ఉండ‌టంతో నేను చేశాను. చాలా హ్యాపీగా ఉంది`` అని అన్నారు.

సంగీత ద‌ర్శ‌కుడు చైత‌న్ భ‌ర‌ద్వాజ్ మాట్లాడుతూ ``పాట‌ల‌కు మంచి స్పంద‌న వ‌స్తోంది. ప్రేక్ష‌కులు సాంగ్స్ ని యాక్సెప్ట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. అజ‌య్‌గారికి సినిమా గురించి క్లారిటీ ఉంది. మంచి టేస్ట్ కూడా ఉంది. నా టీమ్ మ‌నస్ఫూర్తిగా క‌ష్ట‌ప‌డి ప‌నిచేశారు. డిఫ‌రెంట్ సినిమా అవుతుంది. పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి`` అని చెప్పారు.

సినిమా పంపిణీదారులు సురేశ్ రెడ్డి, వినోద్ రెడ్డి మాట్లాడుతూ `` ఈ సినిమా ట్రెండ్ సెట్ట‌ర్ సినిమా అవుతుంది. అర్జున్ రెడ్డితో చాలా మంది కంపేర్ చేస్తున్నారు. దానికీ, ఈ సినిమాకీ ఎక్క‌డా పొంత‌న ఉండ‌దు. మేం ముందు ఒక ఏరియా తీసుకుందాం అని వెళ్లి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మేమే విడుద‌ల చేస్తున్నాం`` అని అన్నారు.

నిర్మాత అశోక్ రెడ్డి గుమ్మ‌డికొండ‌ మాట్లాడుతూ ``ఈ సినిమాకు కొత్త‌గా యాడ్స్ ఎలా చేయ‌వ‌చ్చా అని మేం ఆలోచిస్తుండ‌గా, మా పీఆర్వో పుల‌గం చిన్నారాయ‌ణ‌గారు `ఇది బైక్ పేరుతో వ‌స్తున్న సినిమా కాబ‌ట్టి... హెల్మెట్లు పంచిపెడ‌దాం` అని మంచి స‌ల‌హా ఇచ్చారు. మంచి క్వాలిటీ హెల్మెట్ల‌ను ఫ్రీగా పంచుతున్నాం. రెండో ట్రైల‌ర్‌ని ఎందుకు లాంచ్ చేయాలి అని చాలా మంది అడిగారు. అయినా మా తృప్తి కోసం చేశాం. విదేశాల్లో పృథ్విరెడ్డి విడుద‌ల చేస్తున్నారు`` అని చెప్పారు.

ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి మాట్లాడుతూ ``ఇది రెండో ట్రైల‌ర్‌. తొలి ట్రైల‌ర్‌కి మంచి బ‌జ్ వ‌చ్చింది. ఈ సినిమా క‌థేంటి అని సోష‌ల్ మీడియాలో చాలా మంది అడుగుతున్నారు. అందుకే రెండో ట్రైల‌ర్‌ని విడుద‌ల చేశాం. రెండు ట్రైల‌ర్‌ల‌ను ప‌క్క‌ప‌క్క‌న పెట్టుకుని చూస్తే ఈ సినిమా క‌థ అర్థ‌మైపోతుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ని స్మ‌ర‌ణ్ ఇచ్చారు. మేమంద‌రం కొత్త‌వాళ్లం క‌లిసి చేశాం. నా మ‌న‌సులో ఏముందో తెలుసుకుని మా కెమెరామేన్ తెర‌కెక్కించారు. టాప్ ఎడిట‌ర్ ప్ర‌వీణ్‌గారు ఈ సినిమా చేస్తారా అనే అనుమానంతోనే చెన్నైకి వెళ్లాను. ఆయ‌న క‌థ విన‌గానే ఓకే అనేయ‌డం చాలా ఆనందంగా అనిపించింది. ఇలాంటి క‌థ తీయాల‌ని ప్ర‌తి ద‌ర్శ‌కుడూ అనుకుంటారు. మంచి క‌థ‌లో పెర్ఫార్మెన్స్ చేయాల‌ని హీరో అనుకుంటాడు. అయితే అలాంటి వైవిధ్య‌మైన క‌థ‌తో సినిమా తీయాల‌ని గ‌ట్స్ ఉన్న నిర్మాత మాత్ర‌మే అనుకుంటారు. మా నిర్మాత అలాంటి వ్య‌క్తి. ఈ సినిమా ఒక‌వేళ స‌రిగా ఆడ‌క‌పోతే ఊరెళ్లి గేదెలు మేపుకుందామ‌ని డిసైడ్ అయ్యాకే ఈ సినిమాను నేను తీశాను. నాకు రొటీన్ సినిమాలు ఇష్టం ఉండ‌వు. రొటీన్ సినిమాల‌ను ఇష్ట‌ప‌డే వారు నా సినిమాకు అస‌లు రావొద్దు`` అని చెప్పారు.

హీరో కార్తికేయ మాట్లాడుతూ ``అంద‌రినీ త‌లెత్తుకునేలా చేస్తుందీ సినిమా. రిలీజ్ కి ముందే హిట్ అని ఫిక్స్ అయి ఉన్నాం. మంచి కంటెంట్ ఇస్తే చాలు త‌ప్ప‌కుండా హిట్ చేస్తామ‌ని ఇప్ప‌టికే ప్రేక్ష‌కులు ప్రూవ్ చేశారు. త‌ప్ప‌కుండా హిట్ అయ్యే సినిమా మాది`` అని తెలిపారు.

Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved