యూనివర్సల్ ఫిలిమ్స్ బ్యానర్ పై జి వి ఎస్ నిర్మాణంలో బషీర్ ఆలూరి దర్శకుడుగా సాగర్, ప్రగ్యా హీరో హీరోయిన్స్ గా, సుమన్, వినోదకుమార్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం సమరం. ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం మాదాపూర్ లోని ఒక హౌస్ లో జరుపుకుంటున్న సందర్భంగా సమరం చిత్ర యూనిట్ షూటింగ్ కవరేజ్ కు మీడియా ను ఆహ్వానించి చిత్ర విశేషాలను తెలిపారు.
మొదటగా దర్శకుడు బషీర్ మాట్లాడుతూ మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకొని రెండవ షెడ్యుల్ లోనికి అడుగుపెట్టాము. యాక్షన్, రొమాంటిక్ లవ్ స్టొరీ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఫ్యామిలీ మొత్తం కలసి చూసేలా ఉంటుంది. చెప్పాలంటే కమర్సిల్ చిత్రం. నాకు సహకరిస్తున్న సమరం చిత్ర యూనిట్ కు నా కృతజ్ఞతలు అని అన్నారు.
హీరో సాగర్ మాట్లాడుతూ రెండు పాటలు, ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రాన్ని సపోర్ట్ చేయమని కోరుతున్నా అన్నారు. నా మొదటి డెబ్యూ ఫిల్మ్ . సక్సెస్ ఫుల్ గా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.
మంచి నటిగా పేరు తెచ్చుకుంటానని ఆశిస్తున్నా అని చెప్పారు హీరోయిన్ ప్రగ్యా.
నటుడు సుమన్ మాట్లాడుతూ ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు నా కృతజ్ఞతలు.ఆర్డినరీ సినిమా అయినా ఎస్ట్రోడినరీ గా ఉంటుంది ఈ సినిమా స్టోరీ. ఒక పిక్చరుకు కావాల్సిన వన్నీ ఈ సమరం చిత్రంలో ఉన్నాయి. నిర్మాత కొత్త అయినా ఎక్సపెరిన్స్డ్ పర్సన్ గా సహకరిస్తున్నారు. సరైన సమయం చూసి సినిమాను విడుదల చేస్తే మంచి విజయం సాధిస్తుంది అని అన్నారు. వినోద్ కుమార్ మాట్లాడుతూ మంచి పాత్రతో పాటు మంచి డైలాగ్స్ కూడా ఉన్నాయి నాకు. పవర్ ఫుల్ పోలీసు పాత్రలో నటిస్తున్నా.. ఒక యూనిట్ లాగా కల్సి వర్క్ చేస్తున్నారు. తెలుగు పరిశ్రమలో సమరం అనే మంచి సినిమా వస్తోంది దయచేసి సపోర్ట్ చేయండి అన్నారు. ఫుల్ లెంగ్త్ పాత్రలో వినోద్ గారితో ట్రావెల్ అయ్యే పాత్ర నాది. సమరం సినిమా త్వరగా పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు రావాలని ఆశిస్తున్నా అన్నారు నటుడు రామ్ జగన్.
Glam gallery from the event
నటి ప్రభావతి మాట్లాడుతూ సుమన్ గారి పక్కన మరోసారి నటిస్తున్నాను, మంచి రోల్ ఇచ్చారు. సపోర్ట్ చేసిన వారందరికీ నా కృతజ్ఞతలు అని చెప్పారు.
కెమెరామెన్ నాగబాబు మాట్లాడుతూ అవకాశం ఇచ్చిన సమరం చిత్ర దర్శక నిర్మాతలకు నా థాంక్స్ తెలియచేస్తున్నా అన్నారు.
సాగర్, ప్రగ్యా, వినోద్, సుమన్ , రాంజగన్, ప్రభావతి, రాగిణీ, అప్పారావు(జబర్దస్త్) ఎస్ ఎ. వేణుగోపాల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి స్టోరీ-డైలాగ్స్: నండూరి విరేశ్, ఎడిటర్: శ్రీను బాబు, సంగీత దర్శకుడు: రాజ్ కిరణ్, డైరెక్టర్: బషీర్ ఆలూరి, కెమెరా: నాగబాబు కర్ర, నిర్మాత: జి.వి.ఎస్.