pizza
Sharabha press meet
`శ‌ర‌భ‌` ట్రైల‌ర్ విడుద‌ల‌
You are at idlebrain.com > News > Functions
Follow Us


9 November 2018
Hyderabad

డా.జ‌య‌ప్ర‌ద‌, ఆకాష్ కుమార్‌, మిస్తి చ‌క్ర‌వ‌ర్తి, నెపోలియ‌న్‌, నాజ‌ర్‌, పునీత్ ఇస్సార్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, ఎల్బీ శ్రీరామ్‌, పొన్‌వ‌ణ్ణ‌న్‌, సాయాజీ షిండే, అవినాష్‌, పృథ్వి, చ‌ర‌ణ్‌దీప్‌, రాకింగ్ రాకేష్, దువ్వాసి మోహ‌న్ త‌దిత‌రులు కీల‌క పాత్రల్లో న‌టించిన సినిమా `శ‌ర‌భ‌`. అశ్వ‌నీకుమార్ స‌హ‌దేవ్ నిర్మాత‌. య‌న్‌. న‌ర‌సింహారావు ద‌ర్శ‌కుడు. ఈ చిత్రం ట్రైల‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లో శుక్ర‌వారం రాత్రి జ‌రిగింది. ఈ చిత్రం మేకింగ్ వీడియో ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి విడుద‌ల చేశారు. ట్రైల‌ర్‌ను నిర్మాత చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు ఆవిష్క‌రించారు.

నిర్మాత అశ్వ‌నికుమార్ స‌హ‌దేవ్ మాట్లాడుతూ ``ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ చాలా క‌ష్ట‌ప‌డ్డారు. విజువ‌ల్ ఎఫెక్ట్ ప‌రంగా చాలా బావుంటుంది. న‌వంబ‌ర్ 22న సినిమాను ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తాం. అంద‌రికీ త‌ప్ప‌కుండా న‌చ్చుతుంద‌ని న‌మ్ముతున్నాను`` అని అన్నారు.

ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ ``చాలా ప్ర‌త్యేక‌మైన కొత్త త‌ర‌హా చిత్ర‌మిది. భ‌క్త ప్ర‌హ్లాద త‌ర్వాత అంత గొప్ప‌గా ఆడుతుంద‌నే న‌మ్ముతున్నాను. ఇందులో హీరో చాలా డైన‌మిక్‌గా క‌నిపిస్తారు. నాయిక న‌ట‌న మెప్పు పొందుతుంది. ఈ సినిమా టెక్నీషియ‌న్లు అంద‌రూ క‌లిసి న‌న్ను శంక‌ర్ స్థాయిలో నిల‌బెట్టేలా కృషి చేశారు. న‌వంబ‌ర్ 22న విడుద‌ల‌వుతుంది. త‌ప్ప‌కుండా హిట్ అవుతుంది. ఆకాష్ చాలా సున్నిత‌మైన వ్య‌క్తి. అయినా చాలా క‌ష్ట‌ప‌డి చేశారు`` అని అన్నారు.

ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి మాట్లాడుతూ ``శ‌ర‌భ అంటే డ‌మ‌రుకం నాదం అని అర్థం నృసింహ‌స్వామి పేరు పెట్టుకున్నందుకు ఈ ద‌ర్శ‌కుడికి పెద్ద హిట్ కావాలి. ఇత‌ను నా సినిమాల‌కు అసిస్టెంట్ డైర‌క్ట‌ర్‌గా ప‌నిచేశారు. సినిమాను చూశాను. విజువ‌ల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ మ‌ధ్య కాలంలో బాహుబ‌లి త‌ర్వాత నాకు విజువ‌ల్ ప‌రంగా బాగా న‌చ్చిన చిత్ర‌మిదే. అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఇందులో. జ‌య‌ప్ర‌ద‌గారు చాలా మంచి సీనియ‌ర్ న‌టి. సినిమా ఇండ‌స్ట్రీలోగానీ, రాజ‌కీయాల్లోగానీ గొప్ప స‌క్సెస్ కావాలి. ఈసినిమా ద్వారా ఆమెకు మ‌ళ్లీ గొప్ప అవ‌కాశాలు రావాలి అని కోరుకుంటున్నా. ఈ సినిమా క్లైమాక్స్ లో వ‌చ్చే నాలుగు షాట్స్ హైలైట్ అవుతాయి. అంద‌రికీ న‌చ్చుతాయి`` అని అన్నారు.

నాయిక మిస్తి మాట్లాడుతూ ``ఈ సినిమాలో నాకు అవ‌కాశం ఇచ్చినందుకు ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు ధ‌న్య‌వాదాలు. ఆకాష్ చాలా మంచి కోస్టార్‌. సినిమా కోసం చాలా క‌ష్ట‌ప‌డి ప‌నిచేశారు. ఈ సినిమా కోసం ప్ర‌తి టెక్నీషియ‌న్ చాలా క‌ష్ట‌ప‌డ్డారు. ఈ సినిమా త‌ప్ప‌కుండా అంద‌రికీ న‌చ్చుతుంద‌ని భావిస్తున్నా`` అని అన్నారు.

చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు మాట్లాడుతూ ``మాన‌వ‌జ‌న్మ చాలా గొప్ప‌ది. అందులోనూ సినిమా వాడిగా పుట్ట‌డం ఇంకా గొప్ప విష‌యం. జ‌య‌ప్ర‌ద‌లాంటి సీనియ‌ర్ న‌టి న‌టించిన సినిమా నేను టేక‌ప్ చేయ‌డం చాలా ఆనందంగా ఉంది. నా బ్యాన‌ర్ లో తొలి సినిమాను ఎన్టీఆర్‌తో `జీవిత ఖైదు` విడుద‌ల చేశాను. ఏఎన్నార్‌గారితో చేశాను. ఆ త‌ర్వాత చాలా చేశాను. ఇప్పుడు `శ‌ర‌భ‌`ను విడుద‌ల చేస్తున్నాను. జ‌య‌ప్ర‌ద ఈ సినిమాలో చాలా అందంగా కనిపిస్తారు. నేను ఆవిడ‌కు చాలా పెద్ద ఫ్యాన్‌ని`` అని అన్నారు.

జ‌య‌ప్రద మాట్లాడుతూ ``నేను ఫోన్ చేయ‌గానే నా మీద న‌మ్మకంతో ఈ సినిమాను విడుద‌ల చేయ‌డానికి అంగీక‌రించిన చద‌ల‌వాడ శ్రీనివాస‌రావుగారికి ధన్యవాదాలు. నేను తెలుగు అమ్మాయిని అని చెప్పుకోవ‌డానికి గ‌ర్వ‌ప‌డ‌తాను. ఎన్ని భాష‌ల్లో న‌టించిన తెలుగులో న‌టించినప్పుడు ప్ర‌త్యేక‌మైన సంతృప్తి ఉంటుంది. నాకు తెలుగు ఇండ‌స్ట్రీ అమ్మ‌లాంటిది. ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. నిర్మాత మ‌రెన్నో సినిమాలు తీయాలి. న‌ర‌సింహారావుగారు ఈ సినిమాను చాలా ప్రెస్టీజియ‌స్‌గా తీసుకుని చేశారు. ర‌మ‌ణ‌సాల్వ‌గారి కెమెరాప‌నిత‌నం హైలైట్ అవుతుంది. శ‌ర‌భ చిత్రంతో నా సెకండ్ ఇన్నింగ్స్ మొద‌లైన‌ట్టే భావిస్తున్నాను `` అని చెప్పారు.

జ‌బ‌ర్ద‌స్త్ రాకింగ్ రాకేష్‌, ఛాయాగ్రాహ‌కుడు ర‌మ‌ణ సాళ్వ ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: సాయిమాధ‌వ్ బుర్రా, సంగీతం: కోటి, ఎడిటింగ్‌: కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు, పాట‌లు: వేద‌వ్యాస్‌, రామ‌జోగ‌య్య‌శాస్త్రి, అనంత‌శ్రీరామ్‌, శ్రీమ‌ణి, ప్రోస్త‌టిక్ మేక‌ప్ : సీన్ ఫూట్ (న్యూజిలాండ్), ఆర్ట్: క‌ఇర‌ణ్‌కుమార్ మ‌న్నె, ఫైట్స్: రామ్‌-ల‌క్ష్మ‌ణ్‌, నిర్మాత‌: అశ్వ‌నీకుమార్ స‌హ‌దేవ్‌. ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: య‌న్‌. న‌ర‌సింహారావు.

Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved