pizza
Tamanna about Okkadochadu
విశాల్‌గారి ఇన్‌వాల్వ్ మెంట్, కేర్ బాగా న‌చ్చుతాయి - త‌మన్నా
You are at idlebrain.com > News > Functions
Follow Us

24 December 2016
Hyderaba
d

మాస్‌ హీరో విశాల్‌ హీరోగా ఎం.పురుషోత్తమ్‌ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ బ్యానర్‌పై యువ నిర్మాత జి.హరి నిర్మించిన కమర్షియల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'ఒక్కడొచ్చాడు`. ఈ సినిమా డిసెంబర్‌ 23న వరల్డ్‌వైడ్‌గా రిలీజైంది.

ఈ సంద‌ర్భంగా హీరోయిన్‌ తమన్నా మాట్లాడుతూ - `` ఒక్క‌డొచ్చాడు మంచి క‌మ‌ర్షియ‌ల్ ప్యాక్డ్ మూవీ. అన్నీ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు మంచి మెసేజ్‌ కూడా సినిమాలో ఉంటుంది. విశాల్‌తో తొలిసారి కలిసి యాక్ట్ చేశాను. విశాల్‌ ఎప్పుడూ తన చేసే సినిమా ప్రొడక్ట్‌ బావుండాలని కోరుకునే హీరో. అందుకే సెట్స్‌లో బాగా కష్టపడతారు. సినిమా అవుట్పుట్ బాగుండాల‌ని ఆయ‌న ప‌డే త‌ప‌న, ఇన్‌వాల్వ్‌మెంట్‌, కేర్ నాకు బాగా న‌చ్చుతాయి. అలాగే నిర్మాత హ‌రిగారు హరిగారు సినిమా ప్రారంభం నుండి మాతోనే ట్రావెల్‌ అవుతున్నారు. తెలుగులో సినిమా ఇంత మంచి రెస్పాన్స్ రావడానికి నిర్మాత హరిగారే కారణం. సాంగ్‌ ప్రోమోస్‌, ట్రైలర్‌ అన్ని విషయాల్లో కేర్‌ తీసుకున్నారు. ప్రమోషన్స్‌ విషయంలో ఆయన తీసుకున్న కేర్‌ చూసి ఎంతో ఆనందపడ్డాను. ఈ సినిమాలోని అన్నీ పాట‌ల‌ను ఓ లేడీ రైటర్‌ అందించడం విశేషం. 'ఒక్కడొచ్చాడు' సినిమాకు మా ప్రొడ్యూసర్‌ హరిగారు ఓ లేడీ రైటర్‌ చేత పాటలు రాయించారని తెలిసి హ్యపీగా ఫీలయ్యాను.సాధార‌ణంగా నేను పున‌ర్జన్మ‌ల‌ను పెద్ద‌గా నమ్మ‌ను ప్ర‌స్తుతం ఉన్న జ‌న్మ గురించి ఆలోచిస్తాను కూడా. క్వీన్ రీమేక్‌లో న‌టిస్తున్నాను. సురాజ్‌గారు కామెడి పాయింట్‌తో, కమర్షియల్‌ యాంగిల్‌ను మిక్స్‌ చేసి సినిమాలు తెరకెక్కించడంలో దిట్ట. ఒక ఫ్యామిలీ అంతా కలిసి సినిమాకు వెళ్లే విధంగా సినిమాలు తీశారు. ప్రస్తుతం 'బాహుబలి2'లో నటిస్తున్నాను. వచ్చే సంవత్సరం ఏప్రిల్‌లో విడుదలవుతుంది. రాజమౌళిగారి దర్శకత్వంలో విజువల్‌ వండర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం సెకండ్‌ పార్ట్‌లో కూడా నటించడం గొప్ప ఎక్స్‌పీరియన్స్‌నిచ్చింది. అలాగే ఒక తమిళ్‌ సినిమాలో కూడా నటిస్తున్నాను. క్వీన్ త‌మిళ రీమేక్‌లో న‌టిస్తున్నాను`` అన్నారు.

Tamanna photo gallery

 


Photo Gallery (photos by G Narasaiah)
 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved