pizza
Thanu Vachenanta songs launch
`తను వచ్చెనంట` సాంగ్స్‌ రిలీజ్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

19 September 2016
Hyderaba
d

తేజ కాకుమాను, రేష్మి గౌతమ్‌, ధన్యబాలకృష్ణన్‌ నటీనటులుగా రూపొందుతున్న చిత్రం 'తను వచ్చెనంట'. అచ్యుత్‌ ఆర్ట్స్‌ పతాకంపై చంద్రశేఖర్‌ ఆజాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వెంకట్‌ కాచర్ల దర్శకత్వం వహిస్తున్నారు. శరవేగంగా నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రాన్ని ఈనెలాఖరుకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సోమవారం ఈ సినిమా పాటల విడుదల కార్యక్రమం హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్స్‌లో జరిగింది. చిత్ర లోగోను సీనియర్‌ పాత్రికేయులు వినాయకరావు విడుదల చేశారు. పాటలను 'సూపర్‌హిట్‌' పత్రికాధినేత, నిర్మాత బి.ఎ.రాజు, క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.రాఘవేంద్రరెడ్డి, సీనియర్‌ జర్నలిస్ట్‌ శీను విడుదల చేశారు. ఈ సందర్భంగా...

చిత్ర దర్శకుడు వెంకట్‌ కాచర్ల మాట్లాడుతూ - ''లవ్‌ స్టోరితో పాటు హర్రర్‌, కామెడీ చిత్రాల హవా నడుస్తున్న ఈ తరుణంలో కొత్తదనం కోరుకునే ప్రేక్షకుల కోసం వినూత్న ప్రయత్నంగా జోమెడీ జోనర్‌లో రూపొందించిన చిత్రమిది. తేజ, రేష్మి పాత్రలు సినిమాకి హైలైట్‌గా నిలుస్తాయి. ఫస్ట్‌లుక్‌ నుంచి ట్రైలర్‌ వరకు ప్రేక్షకుల నుండి వినూత్నమైన స్పందన లభించింది. చంటి, శివన్నారాయణ ఫిష్‌ వెంకట్‌ పాత్రలు వినోదాన్ని పంచుతాయి. ప్రేక్షకులు ఎక్స్‌పెక్ట్‌ చేయని ట్విస్ట్‌లు సినిమాలో వుంటాయి. నా టీమ్‌తో పాటు సినిమాలో కొత్త ఐడెంటిటీ తీసుకొచ్చే చిత్రం ఇది. సినిమా బాగా వచ్చింది'' అన్నారు.

సీనియర్‌ జర్నలిస్ట్‌ వినాయకరావు మాట్లాడుతూ - ''చిన్న చిత్రాలకు ఈ ఏడాది చాలా మంచి ఆదరణ లభిస్తోంది. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ వున్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తూనే వున్నారు. అలా మరో డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో వస్తున్న చిత్రమే ఇది. సినిమా పెద్ద సక్సెస్‌ కావాలని యూనిట్‌కి అభినందనలు తెలియజేస్తున్నాను'' అన్నారు.

క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ - ''తెలుగులో తొలి జోంబిక్‌, కామెడీ కలయికలో జోమెడీ జోనర్‌లో వస్తున్న చిత్రం ఇది. కథ నచ్చడంతో సినిమాకి నేనే క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించాను. సినిమా బాగా వచ్చింది. రేష్మి, ఇతర నటీనటులు, టెక్నీషియన్స్‌ బాగా సపోర్ట్‌ చేశారు'' అన్నారు.

సూపర్‌హిట్‌ పత్రిక అధినేత, నిర్మాత బి.ఎ.రాజు మాట్లాడుతూ - ''కొత్త జోనర్‌లో వస్తున్న సినిమా ఇది. సినిమా పోస్టర్స్‌ నుండి ట్రైలర్‌ వరకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. మంచి సినిమాలను ఆదరించే తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను తప్పకుండా ఆదరిస్తారు. యూనిట్‌ సభ్యులందరికీ అభినందనలు'' అన్నారు.

Rashmi Gautam gallery from the event

చిత్ర నిర్మాత చంద్రశేఖర్‌ ఆజాద్‌ పాటిబండ్ల మాట్లాడుతూ - ''చిన్న సినిమాకి మార్కెట్‌ వుండదని చాలామంది అంటుంటారు. కానీ మా సినిమాకి మంచి బిజినెస్‌ అవుతుంది. రిలీజ్‌ భారీగా ప్లాన్‌ చేస్తున్నాం. రాఘవేంద్రరెడ్డిగారు మా ముందుండి మమ్మల్ని ముందుకు నడిపించారు. రేష్మి, తేజ, ధన్యబాలకృష్ణన్‌, చంటి సహా అందరూ బాగా నటించారు. వెంకట్‌ కాచర్లగారు కొత్త జోనర్‌లో సినిమాను అద్భుతంగా తీశారు. రవిచంద్ర మంచి మ్యూజిక్‌నందించారు. ఈనెలాఖరున సినిమాను విడుదల చేస్తున్నాం'' అన్నారు.

రేష్మి గౌతమ్‌ మాట్లాడుతూ - ''దర్శక, నిర్మాతల్లో మంచి ఫైరుంది. ఆ ఫైర్‌తో మంచి కాన్సెప్ట్‌తో 'తను వచ్చెనంట' మూవీని రూపొందించారు. టాలీవుడ్‌లో ఇప్పటివరకూ రాని జోమెడీ కామెడీ జోనర్‌ సినిమా ఇది. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులందరూ ఈ సినిమాను బాగా ఎంజాయ్‌ చేస్తారు.

కోప్రొడ్యూసర్‌ యశ్వంత్‌ మాట్లాడుతూ - ''ఈనెల 30న సినిమాను రిలీజ్‌ చేయబోతున్నాం. రేష్మి అద్భుతంగా నటించింది. కొత్త రేష్మిని సినిమాలో చూస్తారు. ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్‌ అందరూ బాగా సహకరించారు'' అన్నారు.

పాటల రచయిత డాక్ట‌ర్ చల్లా భాగ్యలక్ష్మీ మాట్లాడుతూ - ''తను వచ్చెనంట' డిఫరెంట్‌ జోనర్‌లో వస్తున్న సినిమా ఇది. ఈ సినిమాకి రేష్మి ఫేస్‌ అయింది. నిర్మాత ఆజాద్‌గారు అన్నీ వ్యవహారాలను ముందుండి చూసుకున్నారు. దర్శకుడు వెంకట్‌గారు ఖచ్చితమైన అభిప్రాయాలున్న వ్యక్తి. రవిచంద్రన్‌ మంచి సంగీతాన్ని అందించారు. రాజ్‌కుమార్‌ ప్రతి ఫ్రేమ్‌ను చాలా రిచ్‌గా చూపించారు. ఈ సాంగ్‌ టీజర్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. పాట విన్నవాళ్లందరూ అప్రిషియేట్‌ చేస్తున్నారు. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు'' అన్నారు.

హీరో తేజ కాకుమాను మాట్లాడుతూ - ''దర్శక నిర్మాతలు చాలా ప్యాషన్‌తో ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా కొత్త జోమెడీ జోనర్‌లో సినిమా చేశారు. రేష్మి, ధన్యబాలకృష్ణన్‌ అద్భుతంగా నటించారు. ఔట్‌ అండ్‌ ఔట్‌ ఎంటర్‌టైనర్‌, పైసా వసూల్‌ మూవీ'' అన్నారు.

ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌ సభ్యులందరూ పాల్గొన్నారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రాజ్‌కుమార్‌, సంగీతం: రవిచంద్ర, నేపథ్య సంగీతం: శశిప్రీతమ్‌, క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌: కె.రాఘవేంద్రరెడ్డి, కోప్రొడ్యూసర్‌: యశ్వంత్‌. పి నిర్మాత: చంద్రశేఖర్‌ ఆజాద్‌ పాటిబండ్ల, దర్శకత్వం: వెంకట్‌ కాచర్ల.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved