pizza
U movie press meet
`యు` సినిమా ప్రెస్‌మీట్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us


13 June 2018
Hyderabad

కొవెర క్రియేష‌న్స్ ప‌తాకంపై రూపొందుతున్న చిత్రం `యు`. శ్రీమ‌తి నాగానిక స‌మ‌ర్పించారు. విజ‌య‌ల‌క్ష్మీ కొండా, నాగానిక చాగంరెడ్డి నిర్మాత‌లు. కొవెర ద‌ర్శ‌కుడు. ఆయ‌నే హీరోగా న‌టించారు. హిమాన్షి కాట్ర‌గ‌డ్డ నాయిక‌. ఈ చిత్రం ప్రెస్‌మీట్ హైద‌రాబాద్‌లో బుధ‌వారం జ‌రిగింది.

హీరో, ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ ```యు` టైటిల్‌కి క‌థే హీరో. నేను విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌గారి ద‌గ్గ‌ర నాలుగేళ్లు ప‌నిచేశాను. క‌థా ప‌రంగా ఉన్న అనుభ‌వంతో `యు` రాసుకున్నాను. శుభ‌లేఖ సుధాక‌ర్‌గారు, త‌నికెళ్ల భ‌ర‌ణిగారు క‌థ విన‌గానే చేస్తాన‌ని న‌న్ను ప్రోత్స‌హించారు. ప‌ల్లెటూరిలో మొద‌లై వండ‌ర్‌వ‌ర‌ల్డ్ లో ఎండ్ అయ్యే క‌థ ఇది. స్కూల్ టీచ‌ర్ పాత్ర‌లో హిమాన్షి చ‌క్క‌గా న‌టించింది. ఈ సినిమా చేయ‌డానికి నాకు మా అమ్మ‌, నా భార్య మ‌ద్ద‌తుగా నిలిచారు. అడుగ‌డుగునా మ‌మ్మ‌ల్ని న‌డిపింది క‌థే. 75 ఏళ్ల సినిమా చ‌రిత్ర‌లో ఎవ‌రూ ట‌చ్ చేయ‌ని ప్రాజెక్ట్ ఇది. ప్రాజెక్ట్ యు అనే అంశం మీద సినిమా బేస్ అయి ఉంటుంది. మంచి పాట‌లు కుదిరాయి. రెండు పాట‌ల‌ను యూ ట్యూబ్‌లో విడుద‌ల చేశాం. మోష‌న్ పోస్ట‌ర్‌ని సుకుమార్‌గారు, ఫ‌స్ట్ సాంగ్‌ను దేవిశ్రీ ప్ర‌సాద్‌, రెండో పాట‌ను నాగ్ అశ్విన్‌గారు విడుద‌ల చేశారు. ఈ సినిమాను హీలియ‌మ్ 8కెలో ఈ సినిమాను తీశాం. మొత్తం సినిమాను 8కెలో తీశాం. ఇలా రావ‌డం ఇదే తొలిసారి. చాలా క‌ష్ట‌ప‌డి సినిమా చేశాం. అంద‌రి ప్రోత్సాహం కావాలి. స్క్రీన్‌ప్లే ప‌రంగా మ‌ధుగారు హెల్ప్ చేశారు. జులైలో మీ ముందుకు రావ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. సినిమా హిందీ రైట్స్ సేల్ అయ్యాయి`` అని అన్నారు.

శుభ‌లేఖ సుధాక‌ర్ మాట్లాడుతూ ``డిజిట‌లైజేష‌న్‌కి సంబంధించిన క‌థ ఇది. దాన్ని పాజిటివ్ కోణంలో చూపించారు. సినిమా చాలా బాగా వ‌చ్చింది. ద‌ర్శ‌కుడు నా పాత్ర మీద ప్రేమ పెంచుకుని నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి క‌థ చెప్పారు`` అని చెప్పారు.

త‌నికెళ్ల భ‌ర‌ణి మాట్లాడుతూ ``సినిమా ప‌రిశ్ర‌మ‌కు ఎన్నో ఆశ‌ల‌తో వ‌చ్చారు కొవెర‌. అత‌నికి మ‌ద్ధ‌తుగా నిలిచిన అత‌ని త‌ల్లికి, భార్య‌కి అభినంద‌న‌లు. నా ద‌గ్గ‌ర‌కు ఈ ప్రాజెక్ట్ ను శుభ‌లేఖ‌ను సుధాక‌ర్ నా ద‌గ్గ‌ర‌కు పంపారు. చాలా ప్రాణం పెట్టి ప‌నిచేశారు. ఈ సినిమాకు ప‌నిచేసిన వారంద‌రూ చాలా బాగా చేశారు. వాళ్ల కృషికి, వాళ్ల త‌ప‌న‌కు సినిమా పెద్ద విజ‌యం కావాలి`` అని అన్నారు.

నాగానిక‌ మాట్లాడుతూ ``ఈ సినిమా వెనుక ఎంద‌రి కృషి ఉందో నాకు తెలుసు. మా అంద‌రి కృషి, త‌ప‌న త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంద‌నే న‌మ్మ‌కం ఉంది. కొత్త కంటెంట్ ఉంటే సినిమా బావుంటుంద‌ని న‌మ్మ‌కం కుదిరాక రంగంలోకి దూకాం`` అని అన్నారు.

నిర్మాత విజ‌య‌ల‌క్ష్మీ కొండా మాట్లాడుతూ ``ర‌వితేజ ఏదో సినిమాలో అడిగిన‌ట్టు, నా కొడుకు ప్ర‌తిరోజూ న‌న్ను `ఒక్క చాన్స్ అమ్మా` అని అడిగేవాడు. మాకు రామారావు, నాగేశ్వ‌ర‌రావు, చిరంజీవి అంటే ఇష్టం. మా అబ్బాయి కోసం ఈ సినిమా చేశాం. ఈ సినిమా స‌క్సెస్ అవుతుందో లేదో తెలియ‌దు కానీ, మా అబ్బాయి ప‌డ్డ క‌ష్టానికి ఓ గుర్తింపు రావాల‌న్న‌దే నా కోరిక‌. నా కోడ‌లు సాఫ్ట్ వేర్ చేస్తూ త‌న భ‌ర్త‌కి స‌పోర్ట్ చేస్తుంది. మా మ‌న‌వ‌డు కూడా చిన్న హీరోలాగా మాట్లాడుతుంటాడు. ఈ సినిమాకు ప‌నిచేసిన ప్ర‌తి ఒక్క‌రికీ మంచి పేరు రావాలి. అంద‌రికీ ధ‌న్య‌వాదాలు`` అని చెప్పారు.

హీరోయిన్ మాట్లాడుతూ ``చాలా మంచి సినిమా ఇది. చాలా మంచి టీమ్ కుదిరింది. ద‌ర్శ‌కుడు చాలా బాగా చేయించుకున్నారు`` అని అన్నారు.

కెమెరామేన్ మాట్లాడుతూ ``కెమెరా క‌న్నా క‌థే ఈ సినిమాకు హీరో. ద‌ర్శ‌కుడితో క‌లిసి నేను చాలా యాడ్స్ చేశా. క‌ల‌రిస్ట్ గా కొన్ని సినిమాలు చేశా. `యు` అనేది టైటిల్ సింగిల్ లెట‌రే, కానీ స్టోరీగా ఆలోచిస్తే చాలా పెద్ద‌గా ఉంటుంది. ఫ‌స్టాఫ్ విలేజ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉంటుంది. సెకండాఫ్‌లో డిఫ‌రెంట్ మూడ్‌లో ఉంటుంది. డిఫ‌రెంట్ మూడ్స్ ఆఫ్ క‌ల‌ర్ కూడా ఉంటుంది`` అని చెప్పారు.

త‌నికెళ్ల భ‌ర‌ణి, శుభ‌లేఖ సుధాక‌ర్‌, రాఘ‌వ‌, నాగి, రోహిణి, సంధ్య‌, స్వ‌ప్న రావ్‌, ల‌హ‌రి, దొర‌బాబు, కోయ కిశోర్ ఇత‌ర కీల‌క పాత్ర‌ధారులు.

ఈ సినిమాకు కెమెరా: రాకేశ్ గౌడ్‌, సంగీతం: స‌త్య మ‌హ‌వీర్‌, ఎడిటింగ్‌: అమ‌ర్‌రెడ్డి, స్క్రీన్‌ప్లే: మ‌ధు విప్ప‌ర్తి, మాట‌లు: మ‌హి ఇల్లింద్ర‌, క‌రుణ్ వెంక‌ట్‌, ఆర్ట్: జ‌యదేవ్‌, విజువ‌ల్ ఎఫెక్ట్స్: బ‌్లాక్ బాక్స్ స్టూడియో, ఎగ్జిక్యూటివ్‌: ప‌్ర‌వీణ్‌, ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌లు: నాగ శివ గ‌ణ‌ప‌ర్తి, స‌హ నిర్మాత‌: మూర్తి నాయుడు పాదం.


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved