pizza
Yatra press meet
`యాత్ర‌` నైజామ్‌, వైజాగ్ విడుద‌ల చేస్తున్న దిల్‌రాజు
You are at idlebrain.com > News > Functions
Follow Us


4 February 2019
Hyderabad

నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన చిత్రం `యాత్ర‌`. డాక్ట‌ర్ వై.య‌స్‌. రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారు చేసిన పాద‌యాత్ర‌లో ముఖ్య ఘ‌ట్టాల‌తో నిర్మిస్తున్న‌చిత్రం యాత్ర‌. వై ఎస్ ఆర్ రాజకీయ జీవితంలో పాదయాత్ర కీలక ఘట్టం. మలయాళ సూప‌ర్‌స్టార్ మమ్ముట్టి వై ఎస్ ఆర్ పాత్రలో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేశారు. `ఆనందో బ్రహ్మ` వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన ద‌ర్శ‌కుడు మ‌హి వి రాఘ‌వ్ ఈ యాత్ర‌ ని తెర‌కెక్కించారు. ఈ చిత్రాన్ని` భలే మంచి రోజు`, `ఆనందో బ్రహ్మ` వంటి సూపర్ హిట్ చిత్రాలతో మంచి పేరు సంపాదించుకున్న 70 ఎం ఎం ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అత్యంత భారీ వ్య‌యంతో, ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించింది. ఈ చిత్రానికి శివ మేక సమర్పకుడు. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన ప్ర‌మెష‌న్ మెటీరియ‌ల్ కి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. డాక్ట‌ర్ వై య‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి తండ్రి వైయ‌స్ రాజారెడ్డి గారి పాత్ర‌లో జ‌గ‌ప‌తి బాబు న‌టించారు. బ్యాన‌ర్ లో హ్య‌ట్రిక్ చిత్రంగా రూపోందుతున్న యాత్ర ని ప్రెస్టెజియ‌స్ ప్రోజెక్ట్ గా, అత్యంత భారి బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఆద్యంతం ఎమెష‌న్ తో కూడిన పాత్ర‌లు, పాత్ర తీరులు క‌నిపిస్తాయి. తెలుగు ప్ర‌జ‌లంద‌రూ త‌ప్ప‌కుండా చూడ‌వ‌ల‌సిన చిత్రంగా తెర‌కెక్కిస్తున్నారు. బుధ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగిన విలేక‌రుల స‌మావేశంలో...

దిల్‌రాజు మాట్లాడుతూ ``యాత్ర ఇంకో రెండు రోజుల్లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. వై.య‌స్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డిగారి పాద‌యాత్ర ఎంత సెన్సేష‌న‌ల్ అయిందో తెలుగు ప్రేక్ష‌కుల్లో అంద‌రికీ తెలుసు. దాన్ని ఐడియాగా తీసుకుని పాద‌యాత్ర‌లో ఉన్న ఎమోష‌న్స్, మూమెంట్స్ ని తీసుకుని మహి క‌థ రాశారు. దాన్ని విజ‌య్ నిర్మించారు మ‌మ్మ‌ట్టిగారిలాంటి లెజండ‌రీ యాక్ట‌ర్ యాక్ట్ చేయ‌డం చాలా ఆనందంగా ఉంది. టీజ‌ర్ విడుద‌లైన‌ప్పుడు, పాట‌లు విడుద‌లైన‌ప్పుడు ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఎగ్జ‌యిట్‌మెంట్ క‌నిపించింది. ఆల్ ది బెస్ట్ టు ద టీమ్... మంచి సినిమా రాబోతోంద‌ని అనిపిస్తుంది. ఇంకా రెండు రోజులు ఉండ‌గానే ఓవ‌ర్సీస్‌లోగానీ, ఏపీ, తెలంగాణ‌లోనూ ఆన్‌లైన్ బుకింగ్స్ బావున్నాయి. వెరీ స్ట్రాంగ్ ఓపెనింగ్ తీసుకోబోతుంది సినిమా. ఇవాళ ఓపెనింగ్ తీసుకుంటేనే ఆ సినిమాకు ఒక రెవెన్యూ మేజిక్ జ‌రుగుతుంది. ఓపెనింగ్ అనేది ఇప్ప‌ట్లో మ‌రింత ఇంపార్టెంట్ అయింది. ఒక‌ప్పుడు సినిమా ఫ‌ర్వాలేదు అని అంటే మెల్లిగా ఇంప్రూవ్‌మెంట్ ఉండేది. ఇప్పుడు అలా కాదు. ఓపెనింగ్ తీసుకుంటేనే సినిమా నిల‌బ‌డే ప‌రిస్థితి ఉంది. ఈ సినిమాను నైజామ్‌, వైజాగ్‌లో మా సంస్థ విడుద‌ల చేస్తోంది. అందువ‌ల్ల రాజ‌శేఖ‌ర్‌రెడ్డిగారి పాద‌యాత్ర‌లో జ‌రిగిన మూవ్‌మెంట్స్ ఆ రోజుల్లో పేప‌ర్లో, టీవీల్లో చూడ‌ట‌మే.ఆ త‌ర్వాత రాజ‌శేఖ‌ర్‌గారు హీరో అయ్యారు. ఆ త‌ర్వాత ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఫార్మ్ అయింది. జ‌నాల కోసం ఏదైనా చేస్తాడు ఓ నాయ‌కుడు అని రాజ‌శేఖ‌ర్‌రెడ్డి మంచి నిర్ణ‌యాలు తీసుకుని చూపించారు. రామారావుగారి త‌ర్వాత మ‌న రాష్ట్రాల్లో ఒక ఇమేజ్ బిల్డ్ అయింది రాజ‌శేఖ‌ర్‌రెడ్డిగారికి. అలాంటి గొప్ప వ్య‌క్తి ఇతివృత్తంతో వ‌స్తున్న `యాత్ర` పెద్ద హిట్ కావాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను`` అని అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ ``లాస్ట్ ఒక‌టిన్న‌ర ఏడుగా ఈ సినిమా మీద ప‌నిచేస్తున్నాం. ఫిబ్ర‌వ‌రి 8న సినిమా విడుద‌ల కానుంది. మేం చేయాల్సిందంతా చేశాం. చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా రాజ‌శేఖ‌ర్‌రెడ్డిగారి పొలిటిక‌ల్ జీవితానికి సంబంధించింది కాదు. ఇది పొలిటిక‌ల్ చిత్రం కాదు. ఇందులో కాంట్ర‌వ‌ర్సీలు లేవు. రాజ‌శేఖ‌ర్‌రెడ్డిగారి వ్య‌క్తిత్వం, స్ఫూర్తికి సంబంధించింది. సినిమా న‌చ్చితే అంద‌రికీ చెప్పండి. ఇది రాజ‌శేఖ‌ర్‌రెడ్డిగారి ఫ్యాన్స్ కి మాత్ర‌మే కాదు. ఏ సినిమా ల‌వ‌ర్ అయినా సినిమాను ఆస్వాదించేలా తెర‌కెక్కించాం`` అని అన్నారు.

ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ ``మ‌న‌కి అభిప్రాయ‌భేదాలు ఉండ‌వ‌చ్చు. ఎవ‌రి ఆలోచ‌న‌లు వారివై ఉండ‌వ‌చ్చు. అంత‌మాత్రాన ఎవ‌రినీ అగౌర‌వ‌ప‌ర‌చ‌కూడ‌దు. ఎవ‌రినీ అస‌హ్యించుకోకూడ‌దు. వైయ‌స్సార్ సినిమా చేస్తున్నాం. ఈ విష‌యం అంద‌రికీ ఇష్టం ఉండొచ్చు. ఇష్టం లేక‌పోవ‌చ్చు. అంత మాత్రాన ద‌య‌చేసి అగౌర‌వ‌ప‌ర‌చ‌వ‌ద్దు. సినిమా బాగా వ‌చ్చింది. ఈ చిత్రం చూడ‌టానికి ప్రేక్ష‌కులు ఎంత క్యూరియ‌స్‌గా ఉన్నారో, నేను కూడా అంతే ఆత్రుత‌గా వెయిట్ చేస్తున్నా`` అని అన్నారు.Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved