pizza
Anthaku Minchi press meet
`అంత‌కు మించి` టైటిల్ సాంగ్ విడుద‌ల‌
You are at idlebrain.com > News > Functions
Follow Us


20 August 2018
Hyderabad

ఎస్ జై ఫిలిమ్స్ పతాకంపై యూ అండ్ ఐ ఎంటర్టైన్మెంట్స్ సమర్పించు చిత్రం 'అంతకు మించి'. జై, రష్మి గౌతమ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఆగ‌స్ట్ 24న విడుద‌ల‌వుతుంది. ఈసినిమా టైటిల్ సాంగ్‌ను సోమ‌వారం హైద‌రాబాద్‌లో విడుదల చేశారు. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన పాత్రికేయుల సమావేశంలో...

దర్శకుడు జానీ మాట్లాడుతూ ``ద‌ర్శ‌కుడిగా నా తొలి చిత్ర‌మిది. సినిమా పోస్ట‌ర్స్ విడుద‌లైన త‌ర్వాత అంద‌రూ ఎక్స్‌పోజింగ్ గురించ‌చే మాట్లాడుకుంటున్నారు. రేపు సినిమా విడుద‌లైన త‌ర్వాత ఆమె పెర్‌ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటారు. హీరో జై గారు.. నిర్మాత‌గా కూడా ఎక్కడా కాంప్ర‌మైజ్ కాలేదు. నట‌న‌ ప‌రంగా క్యారెక్ట‌ర్‌లో ఒదిగిపోయారు. ఈ సినిమాతో మంచి న‌టుడిగాపేరు తెచ్చుకుంటారు. సునీల్‌గారు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. అంత‌కు మించిఆర్.ఆర్‌ని అందించారు. సినిమా రిలీజ్ త‌ర్వాత ఆర్‌.ఆర్ గురించి.. కెమెరా వ‌ర్క్ గురించి మాట్లాడుకుంటారు`` అన్నారు.

హీరో..నిర్మాత‌ జై మాట్లాడుతూ`` సినిమా లాస్ట్ టూ రీల్స్ లో ఆడియన్స్ కచ్చితంగా భయపడతారు. ఇంటర్వెల్ బ్యాంగ్ లో టైటిల్ పడుతుంది. అంతకు మించి అని అప్పుడు అర్థం అవుతుంది ఈ సినిమాకు ఈ టైటిల్ ఎందుకు పెట్టారు అని. రష్మీ గారు అల్టిమేట్ పెర్ఫామెన్స్ తో సినిమాకు ప్రాణం పోశారు. ఆమె వ‌ల్ల‌నే సినిమాకు హైప్ వ‌చ్చింది. సినిమా చాలాబాగా వచ్చింది. ఖచ్చితంగా అందరికీ నచ్చి తీరుతుంది. నైజాంలో వంద థియేట‌ర్స్‌లో సినిమా విడుద‌ల‌వుతుంది. 100 శాతం క‌చ్చితంగా స‌క్సెస్ అవుతుంది`` అన్నారు.

హీరోయిన్ రష్మీ మాట్లాడుతూ`` సినిమా కోసం అంద‌రం చాలా క‌ష్ట‌ప‌డ్డాం. జై హీరోగా, నిర్మాత‌గా అందించిన స‌పోర్ట్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే అవుతుంది. సినిమా కేక్‌లా డిఫ‌రెంట్ ఫ్లేవ‌ర్స్‌లో ఉంటుంది. 24న విడుద‌ల‌వుతున్న ఈ సినిమా అంద‌రికీ న‌చ్చుతుంది`` అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో చిత్ర యూనిట్ స‌భ్యులంద‌రూ పాల్గొన్నారు.

జై, రష్మీ గౌతమ్, అజయ్ ఘోష్, టి ఎన్ ఆర్, మాధునందన్, హర్ష, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: మోహన్ చందా, సినిమాటోగ్రఫి: పి. బాలిరెడ్డి, ఎడిటర్: క్రాంతి(ఆర్ కె), సంగీతం: సునీల్ కశ్యప్, ఆర్ట్: నాగు, కొరియోగ్రాఫర్: సుదీర్ కుమార్, ఫైట్స్(రామ్ సుంకర), కో-డైరెక్టర్: ఎ. మధు సుధన రెడ్డి, సంపత్ రుద్రారపు, ఇనుముల ఉమామహేశ్వరరావు, కో- ప్రొడ్యూసర్స్: భాను ప్రకాష్ తేళ్ల, కన్నా తిరుమనాధం, నిర్మాత: సతీష్, ఎ. పద్మనాభ రెడ్డి, కథ-స్క్రీన్ ప్లే- దర్శకత్వం: జానీ.

 

Photo Gallery (photos by G Narasaiah)
 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved