pizza
Shriya Ghoshal Creating Sensations With Dalapathi
`ద‌ళ‌ప‌తి`లో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోన్న శ్రేయా ఘోష‌ల్ సాంగ్
You are at idlebrain.com > News > Functions
Follow Us

16 August 2017
Hyderaba
d

Superstar Rajinikanth and Mammootty starrer classic film Dalapathy which was released 26 years ago was a run away hit then. Now, a Telugu film is being made with the same title. Sadaa is directing the film which is produced by Babu Rao Pedapudi under Aadi Akshara Entertainments Banner. Sadaa- Kavitha Agarwal, Babu- Priyanka Sharma are the two lead pairs in the film. Yajamanya is providing music and currently songs recording works are happening. Interesting thing is that, popular singer Shriya Ghoshal has sung a song in the film.

Shriya Ghoshal who is very much selective has sung this Telugu song after nearly one year gap. The song "Neeku Naaku Madhya..." was crooned by Yajamanya and Shriya Ghoshal together. The song was launched in FM Radio station. Currently, it is going viral in social media.

Speaking on the occassion, director Sadaa said, "Songs recording works are progressing as part of post-production. National Award winner Shriya Ghoshal has sung one of the songs. We are glad that Shriya who selectively sings in Telugu has sung a song for our film. What's more, she has appreciated our team. Each and every song has come out well. Yajamanya's music is going to be one of the major asset of the film. Dalapathi is being made as family and action entertainer with a unique concept. Entire production works have been completed. Jai's cinematography is other highlight of the movie."

Producer Babu Rao said, "I thank Shriya Ghoshal for immediately accepting to sing a song for our film. The song which has been uploaded in YouTube is rocking right now in social media. Movie's output has come out well as we anticipated. Yajamanya's music, Jai's cinematography and Sadaa's direction are going to enthrall spectators for sure."

`ద‌ళ‌ప‌తి`లో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోన్న శ్రేయా ఘోష‌ల్ సాంగ్

26 ఏళ్ల క్రితం ద‌క్షిణాదిలో సెన్సేష‌న‌ల్ క్రియేట్ చేసిన చిత్రం `ద‌ళ‌ప‌తి`. సూప‌ర్ స్టార్స్ ర‌జ‌నీకాంత్‌, మ‌మ్ముట్టి కాంబినేష‌న్‌లో విడుద‌లైన ద‌ళ‌ప‌తి తిరుగులేని విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఇదే టైటిల్‌తో తెలుగులో మ‌రో సినిమా విడుద‌ల‌వుతుంది. ఆది అక్షర ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై సదా దర్శకత్వంలో బాబురావు పెదపూడి నిర్మించిన చిత్రం 'దళపతి`. సదా - కవితా అగర్వాల్ , బాబు - ప్రియాంక శర్మ రెండు జంటలుగా న‌టిస్తున్నారు. ఈ సినిమాకు యాజ‌మాన్య సంగీతం అందిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా పాట‌ల రికార్డింగ్ జ‌రుపుకుంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఈ సినిమాలో ఓ పాట‌ను ప్ర‌ముఖ సింగ‌ర్ శ్రేమా ఘోష‌ల్ పాడారు. సెల‌క్టివ్‌గా పాట‌లు పాడు శ్రేయా ఘోష‌ల్ తెలుగులో ఏడాది త‌ర్వాత పాడుతున్న పాట ఇది. `నీకు నాకు మ‌ధ్య ఏదో ఉందే...` అంటూ సాగే ఈ పాట‌ను శ్రేయా ఘోష‌ల్‌, యాజ‌మాన్య క‌లిసి ఆల‌పించారు. ఈ పాట‌ను ఎఫ్‌.ఎం రేడియోలో విడుద‌ల చేశారు. ఈ సాంగ్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

ఈ సందర్బంగా దర్శకులు సదా మాట్లాడుతూ.. ``పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల్లో భాగంగా పాటల రికార్డింగ్ జ‌ర‌గుతుంది. ఓ పాట‌ను ప్ర‌ముఖ సింగ‌ర్‌, నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ శ్రేయో ఘోష‌ల్ పాడారు. ప‌రిమితంగా పాట‌లు పాడే శ్రేయోఘోష‌ల్‌గారు మా సినిమాలో పాడ‌టం ఆనందంగా ఉంది. మా యూనిట్‌ను ఆమె అభినందించారు. పాట‌ల‌న్నీ చాలా బాగా వచ్చాయి. యాజ‌మాన్య‌గారి సంగీతం సినిమాకు పెద్ద ఎసెట్ అవుతుంది. విభిన్న కథాంశం తో యాక్షన్ , ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న దళపతి చిత్ర షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయ్యింది. అలాగే ఛాయాగ్రాహకులు జై అందించిన సినిమాటోగ్రఫీ హైలెట్ గా నిలవనుంది`` అన్నారు

నిర్మాత బాబురావు మాట్లాడుతూ..`అడ‌గ్గానే మా సినిమాలో పాట పాడ‌టానికి ఒప్పుకుని పాడిన శ్రేయా ఘోష‌ల్ గారికి థాంక్స్‌. పాట చాలా బాగా వ‌చ్చింది. ముఖ్యంగా శ్రేయా పాడిన పాట‌ను యూ ట్యూబ్ చానెల్స్‌లో విడుద‌ల చేశాం. ఈ పాట సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. సినిమా మేం అనుకున్న‌ట్లు వ‌స్తుంది. యాజమాన్య సంగీతం, జై సినిమాటోగ్ర‌ఫీ, స‌దా డైరెక్ష‌న్ ప్రేక్షకులను అలరించడం ఖాయం`` అన్నారు

 


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved