pizza
F2 success meet
`ఎఫ్ 2` స‌క్సెస్ మీట్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us


18 January 2019
Hyderabad

విక్టరీ వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌, తమన్నా, మెహరీన్‌ హీరో హీరోయిన్స్‌గా దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో శిరీష్‌, లక్ష్మణ్‌ నిర్మించిన చిత్రం 'ఎఫ్‌ 2.. ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌'. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం సక్సెస్‌ మీట్‌ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో ....

ప్రగతి మాట్లాడుతూ - ''నా కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రంగా ఎఫ్‌ 2 నిలిచిపోయింది. చాలా వరకు కొన్ని పాత్రలు వల్ల ఫ్రస్ట్రేట్‌ అయ్యాను. అలాంటి సమయంలో ఇలాంటి క్యారెక్టర్‌ రావడం ఆనందంగా ఉంది. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్‌. ప్యాషనేట్‌ ఉన్న వ్యక్తులు. వెంకటేష్‌గారితో నటించడం చాలా క్యాజువల్‌గా అనిపించింది. వరుణ్‌ సర్‌ప్రైజ్‌ ప్యాకేజ్‌లా నటించారు. మెహరీన్‌, తమన్నాలను చూసి గర్వపడుతున్నాను'' అన్నారు.

అనసూయ మాట్లాడుతూ - ''అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో చేయడం హ్యాపీ. ఆయన రియాలిటీని అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. సినిమా చూసిన తర్వాత మా ఆయన నాకు సారీ.. థాంక్స్‌ ఎక్కువగా చెబుతున్నారు. కుటుంబంతో కలిసి సినిమా చూశాం. పేరుకు మాత్రమే ఫ్రస్ట్రేషన్‌ ఉంది.. ఫన్‌ ఎక్కువగా సినిమాలో ఉంది. వెంకటేష్‌గారితో నటించడం గౌరవంగా ఉంది. వరుణ్‌గారు మస్త్‌గా నటించాడు. దిల్‌రాజుగారికి, శిరీష్‌గారికి, లక్ష్మణ్‌గారికి థాంక్స్‌. సంక్రాంతి అంటే ఎస్‌.వి.సి.క్రియేషన్స్‌ అనే ముద్ర పడింది'' అన్నారు.

మెహరీన్‌ మాట్లాడుతూ - ''సినిమాను చాలా పెద్ద హిట్‌ చేసి మేమే ది బెస్ట్‌ అని ప్రేక్షకులు ప్రూవ్‌ చేశారు. ఇంకా పెద్ద హిట్‌ చేయాలని కోరుతున్నాను. అనీల్‌రావిపూడిగారికి ఎంత థాంక్స్‌ చెప్పినా తక్కువే అవుతుంది. ఆయనతో రెండు సినిమాలు చేసే అవకాశం దక్కింది. ఎస్‌.వి.సి బ్యానర్‌లో చేయడం ఎప్పటికీ ఆనందమే. నా హోం బ్యానర్‌లా ఫీల్‌ అవుతాను. వెంకీగారికి, వరుణ్‌కి థాంక్స్‌'' అన్నారు.

దర్శకుడు అనీల్‌ రావిపూడి మాట్లాడుతూ - ''ఈ సంక్రాంతికి ఎస్‌.వి.సి బ్యానర్‌లో మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చిన దిల్‌రాజుగారికి, శిరీష్‌గారికి, లక్ష్మణ్‌గారికి థాంక్స్‌. స్క్రిప్ట్‌ స్టేజ్‌ నుండి నాకు సపోర్ట్‌ చేసిన నా టీంకు థాంక్స్‌. ఎడిటర్‌ తమ్మిరాజుగారు ఎడిటింగ్‌లో ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. సమీర్‌ రెడ్డిగారు సినిమాను అద్భుతంగా, అందంగా చూపించారు. ఆర్ట్‌ డైరెక్టర్‌ ఎ.ఎస్‌.ప్రకాష్‌, ఫైట్‌ మాస్టర్‌ వెంకట్‌కి థాంక్స్‌. నటీనటుల విషయానికి వస్తే ప్రకాష్‌రాజ్‌గారికి, రాజేంద్రప్రసాద్‌గారికి, ప్రగతి, ఝాన్సీగారు, అన్నపూర్ణమ్మగారు ఇలా అందరూ లైఫ్‌ పెట్టి పనిచేశారు. తమన్నా, మెహరీన్‌లకు నా స్పెషల్‌ థాంక్స్‌. మంచి ట్యూన్స్‌, బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్‌గారికి థాంక్స్‌. వెంకటేష్‌తో వరుణ్‌తేజ్‌ చేసిన కామెడీ, సూపర్బ్‌ పెర్ఫామెన్స్‌ చేశాడు. తనతో మరచిపోలేని ప్రయాణం. ఇంకా మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నాను. ఎన్నాళ్లు నుండి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ఈ సినిమా సక్సెస్‌ చూస్తుంటే అర్థమవుతుంది. నాపై నమ్మకంతో సినిమా చేసినందుకు వెంకటేష్‌గారికి థాంక్స్‌. కామెడీ చేయడంలో వెంకటేష్‌గారికి మనం చెప్పేదేముండదు. ఆయనొక లైబ్రరీ. అందులో ఏరుకోవడమే. ఈ సినిమా కోసం ఆయన చాలా కష్టపడ్డారు. ప్రతి ఒక్కరి జీవితంలో నవ్వుకున్న ప్రాముఖ్యత ఏంటో అందరికీ తెలుసు. నవ్వును మేం ఇచ్చినందుకు మీరు నవ్వుతూ కలెక్షన్ల వర్షం కురిపించినందుకు థాంక్యూ సో మచ్‌. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాల్లో 30,40 శాతం మాత్రమే నవ్వించాం. ఈ సినిమాలో వంద శాతం నవ్వించే ప్రయత్నం చేశాం. ఆ నవ్వు విలువేంటో ఈ సంక్రాంతికి తెలిసింది. నా లైఫ్‌లో ఈ సంక్రాంతి నవ్వుల సంక్రాంతి. జీవితాంతం గుర్తుండిపోయే సంక్రాంతి. ఇంత పెద్ద సక్సెస్‌ ఇచ్చినందుకు థాంక్స్‌. సూపర్‌స్టార్‌ మహేష్‌గారు టీజర్‌ దగ్గర నుండి ఎంకరేజ్‌ చేస్తూ ఎంతో కిక్‌ను ఇచ్చారు. మా టీం అందరి తరపున ఆయనకు కూడా థాంక్స్‌'' అన్నారు.

హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ - ''మా సినిమాకు ఎఫ్‌ 2 అనే టైటిల్‌ పెట్టి అనీల్‌ అనౌన్స్‌ చేసి వీ 2(వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌)గా ఇద్దరు హీరోలు జాయిన్‌ అయ్యారు. సినిమా ఈ2(ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌) అని మెసేజ్‌లు పెట్టారు. చివరకు బీ 2(బొమ్మ బ్లాక్‌బస్టర్‌) అనేశారు. మా బ్యానర్‌లో ఇది 31వ సినిమా. ఇంత మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ మూవీ చేసిన అనీల్‌కు థాంక్స్‌. మా టీం అందరం ఎంజాయ్‌ చేస్తున్నాం. వెంకటేష్‌, వరుణ్‌ అద్భుతంగా చేశారు. అనీల్‌కు స్క్రిప్ట్‌ ప్రారంభం నుండి సపోర్ట్‌ చేస్తున్న సాయి, నారాయణ సహా అందరికీ థాంక్స్‌. సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశ నుండి హిట్‌ అనే చెబుతూ వచ్చారు. సినిమా వెనుకాల చాలా మంది ఉన్నారు.నటీనటులు, టెక్నీషియన్స్‌కు థాంక్స్‌. ముందు నుండి ఎంటర్‌టైన్‌మెంట్‌ మూవీ అనే చెబుతూ వచ్చాం. సినిమా హిట్‌ అవుతుందనే అనుకున్నాం కానీ.. ఇంత పెద్ద హిట్‌ అవుతుందని అనుకోలేదు. కొంచెం నవ్విస్తే చాలు.. బ్రహ్మారథం పడతారని ప్రేక్షకులు నిరూపించారు. సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు సినిమాతో వెంకటేష్‌గారు 50 కోట్ల క్లబ్‌లో జాయిన్‌ అయ్యారు. ఫిదాతో వరుణ్‌ 50 కోట్ల క్లబ్‌లో జాయిన్‌ అయ్యారు. ఇద్దరికీ కలిపి ఈ సినిమా 50 కోట్ల సినిమా అయ్యింది. అనీల్‌ మూడు సక్సెస్‌ సినిమాలు చేశాడు. కానీ ఈ సినిమా సక్సెస్‌ కిక్‌ తనకు మరోలా ఉంది. ఇన్ని సినిమాల్లో మాకు ఎక్కువ లాభాలను తెచ్చి పెట్టిన సినిమా ఇదే అయ్యింది. పేరుతో పాటు డబ్బును తెచ్చిన సినిమా ఇది'' అన్నారు.

వరుణ్‌ తేజ్‌ మాట్లాడుతూ - ''సినిమాను పెద్ద సక్సెస్‌ చేసినందుకు థాంక్స్‌ చెప్పడం చిన్నమాటే అవుతుంది. ఓ సినిమా చేయాలంటే 100-200 కష్టం ఉంటుంది. అందరం పాజిటివ్‌ మైండ్‌ సెట్‌తో సినిమాను స్టార్ట్‌ చేశాం. కామెడీ అంటే చిరంజీవిగారిది, వెంకటేష్‌గారి సినిమాలు ఎక్కువగా చూసేవాడిని. చిరంజీవిగారి సినిమాలు చూసి ఇన్‌స్పైర్‌ అయితే.. వెంకటేష్‌గారితో ఈ సినిమాకు వర్క్‌ చేసి ఇన్‌స్పైర్‌ అయ్యాను. కామెడీ సీన్స్‌లో వెంకటేష్‌గారితో నటించాలంటే సిగ్గు, భయంగా ఉండేది. ఎలా చేస్తానో అనుకునేవాడిని. కానీ ఆయన ఓ సోదరుడిలా ఉండి సపోర్ట్‌ చేశారు. ఆయనకు థాంక్స్‌. ఆయనతో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా తర్వాత వెంకటేష్‌గారిని, అనీల్‌గారిని మిస్‌ అవుతున్నా. త్వరలోనే ఎఫ్‌ 3 చేయబోతున్నాను. ఎఫ్‌ 2నే ఇలా ఉంటే ఎఫ్‌ 3 ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. తెలుగు ప్రేక్షకులకు థాంక్స్‌'' అన్నారు.

విక్టరీ వెంకటేష్‌ మాట్లాడుతూ - ''సినిమాను హిట్‌, సూపర్‌హిట్‌ అనుకుంటే.. ప్రేక్షకులు సూపర్‌ డూపర్‌ హిట్‌ చేసేశారు. మనస్ఫూర్తిగా ప్రేక్షకుల కళ్లలో ఆనందం చూసినప్పుడు.. పదేళ్ల తర్వాత థియేటర్‌కు వెళ్లి అక్కడ ఆడియెన్స్‌ రెస్పాన్స్‌ చూసినప్పుడు.. నాకు మాత్రం కళ్లలో కన్నీళ్లు వచ్చేశాయి. మేం అందరం కష్టపడి పనిచేసినప్పుడు .. ప్రేక్షకులు బాగా ఆదరించినప్పుడు ఆ ఆనందమే వేరు. నాకు గణేష్‌, ప్రేమించుకుందాం రా, బొబ్బిలిరాజా, నువ్వునాకు నచ్చావ్‌, మల్లీశ్వరి ఇలా చాలా సినిమాలను నాకు సక్సెస్‌ చేశారు. చాలా ఏళ్ల తర్వాత ఇంత పెద్ద సక్సెస్‌ ఇచ్చినందుకు ఆనందంగా ఉంది. మీరు మళ్లీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సినిమా చేయాలి. ఆడియెన్స్‌ మిమ్మల్ని అలా చూడాలనుకుంటున్నారని చెప్పినప్పుడు ఆనందమేసి అటెంప్ట్‌ చేశాను. దిల్‌రాజు, శిరీష్‌, లక్ష్మణ్‌లకు ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు థాంక్స్‌. వరుణ్‌ చాలా మంచి నటనను కనపరిచాడు. తమన్నా, మెహరీన్‌లకు థాంక్స్‌. సినిమాటోగ్రాఫర్‌ సమీర్‌ రెడ్డికి, అద్భుతమైన మ్యూజిక్‌ ఇచ్చిన దేవిశ్రీ సహా ఎంటైర్‌ యూనిట్‌కు థాంక్స్‌. ఫ్యామిలీతో మళ్లీ మళ్లీ సినిమా చూసి ఎంజాయ్‌ చేయండి '' అన్నారు.

 


Photo Gallery (photos by G Narasaiah)
 

 

 

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved