pizza
Gautham Nanda success meet
మా 'గౌతమ్‌ నంద' చిత్రాన్ని ఆదరించి పెద్ద సక్సెస్‌ చేసిన ప్రేక్షకులకు థాంక్స్‌ - నిర్మాతలు జె.భగవాన్‌, జె.పుల్లారావు
You are at idlebrain.com > News > Functions
Follow Us

3 August 2017
Hyderabad

ఎగ్రెసివ్‌ హీరో గోపీచంద్‌, హన్సిక, కేథరిన్‌ కాంబినేషన్‌లో సంపత్‌నంది దర్శకుడిగా శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై అభిరుచి గల నిర్మాతలు జె.భగవాన్‌, జె.పుల్లారావు నిర్మించిన స్టైలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'గౌతమ్‌నంద'. భారీ బడ్జెట్‌తో విజువల్‌ ఫీస్ట్‌గా తెరకెక్కిన ఈ చిత్రం జూలై 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ అయి సూపర్‌హిట్‌ టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ ఆగస్ట్‌ 3న హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్‌ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో గోపీచంద్‌, దర్శకుడు సంపత్‌ నంది, హీరోయిన్‌ కేథరిన్‌, నిర్మాతలు భగవాన్‌, పుల్లారావు పాల్గొన్నారు.

జె. పుల్లారావు మాట్లాడుతూ - ''జూలై 28న రిలీజ్‌ అయిన మా 'గౌతమ్‌ నంద' చిత్రం యునానిమస్‌ హిట్‌ టాక్‌తో చాలా అద్భుతంగా ఆడుతోంది. రిలీజ్‌ అయిన ప్రతి సెంటర్‌ నుండి మా చిత్రం చాలా అద్భుతంగా వుంది అని శ్రేయోభిలాషులు, సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అప్రిషియేట్‌ చేస్తున్నారు. మా చిత్రాన్ని ఇంత మంచి సక్సెస్‌ చేసిన ఆడియన్స్‌కి మా థాంక్స్‌'' అన్నారు.

జె.భగవాన్‌ మాట్లాడుతూ - ''మా 'గౌతమ్‌ నంద' చిత్రం 6 రోజులకి 22 కోట్ల 25 లక్షల 47 వేల 433 రూపాయలు కలెక్ట్‌ చేసింది. ఎ.పి.లో 8 కోట్ల 88 లక్షల 28 వేల 388 రూపాయలు, సీడెడ్‌లో 3 కోట్ల 23 లక్షల 82 వేల 021 రూపాయలు, నైజాంలో 8 కోట్ల 38 లక్షల 37 వేల 024 రూపాయలు, కర్ణాటక 1 కోటి 30 లక్షలు, నార్త్‌ ఇండియా 20 లక్షలు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 22,25,47,433 రూపాయలు కలెక్ట్‌ చేసింది. రోజు రోజుకీ సినిమా మంచి కలెక్షన్స్‌ సాధిస్తూ సినిమా కొన్న వారందరికీ మంచి లాభాలను తెస్తుంది. మా చిత్రాన్ని ఇంత పెద్ద సక్సెస్‌ చేసిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు'' అన్నారు.

హీరోయిన్‌ కేథరిన్‌ మాట్లాడుతూ - ''ఎంతో కష్టపడి ఈ సినిమా చేశా. బ్యూటిఫుల్‌ విజువల్స్‌తో ఎంతో స్టైలిష్‌ ఎంటర్‌టైనర్‌గా సంపత్‌ నంది ఈ సినిమా రూపొందించారు. ఈ చిత్రాన్ని పెద్ద హిట్‌ చేసిన ఆడియన్స్‌ అందరికీ థాంక్స్‌. ఈ సినిమాని థియేటర్‌లో చూసి ఎంజాయ్‌ చేయండి. ఇంత మంచి సినిమాతో నేను ఒక పార్ట్‌ అయినందుకు చాలా హ్యాపీగా వుంది'' అన్నారు.

దర్శకుడు సంపత్‌ నంది మాట్లాడుతూ - ''ఇంతకు ముందు నేను చేసిన అన్ని సినిమాల్లో కంటే కథగా నాకు ఎంతో సంతృప్తి ఇచ్చిన సినిమా ఇది. కథ పాత కథే అయినా కొత్తగా చెప్పాలి అని ట్రై చేశాను. ఎమోషనల్‌ సీన్స్‌, ట్విస్ట్‌లు మనసుకి హత్తుకునేలా వున్నాయని చెప్తున్నారు. మౌత్‌ టాక్‌ రోజు రోజుకీ పెరుగుతోంది. ప్రతి ఒక్కళ్లూ మా సినిమా ఆదరిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్‌ అయిన మొదటి రోజు సాయంత్రం 4 గంటల తర్వాత నుండి ఫోన్‌ కాల్స్‌ వచ్చాయి. భయ్యా సినిమా చాలా బాగుంది అని చెప్తున్నారు. ఈ సినిమా నాకు రెండు మంచి కాంప్లిమెంట్స్‌ వచ్చాయి. నా లైఫ్‌లో ఇద్దరు రోల్‌ మోడల్‌ వున్నారు. ఒకరు మా నాన్న. రెండోది మా ఫ్రెండ్‌ వాళ్ల ఫాదర్‌ సాంబశివరావుగారు. 'నువ్‌ చేసిన అన్ని సినిమాల్లో కంటే నాకు బాగా నచ్చిన సినిమా ఇది' అని ఫోన్‌ చేసి చెప్పారు మా నాన్న. నా లైఫ్‌లో ది బెస్ట్‌ మూవీ అని సాంబశివరావుగారు చెప్పారు. ఇవి రెండు నా లైఫ్‌లో బెస్ట్‌ కాంప్లిమెంట్స్‌గా భావిస్తున్నాను. వనస్థలిపురం నుండి దివ్యశ్రీ అనే అమ్మాయి కాల్‌ చేసి సినిమా నన్ను ఎంతో ఇంప్రెస్‌ చేసింది. ఈ చిత్రంలో హీరో ఫాదర్‌కి బైక్‌ కొనిపెట్టే సీన్‌ నాకు బాగా నచ్చింది. వన్‌మంత్‌లో నేను మా అమ్మకి స్కూటీ కొనిపిస్తాను అని చెప్పింది. ఇలా చెప్పడం చాలా గొప్పగా అన్పించింది. అలాగే క్లైమాక్స్‌లో లాస్ట్‌ 45 నిమిషాలు చాలా అద్భుతంగా వుంది అని ప్రతి ఒక్కరూ అప్రిషియేట్‌ చేస్తున్నారు. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. సక్సెస్‌ చేసిన ప్రతి ఒక్కరికీ చాలా థాంక్స్‌'' అన్నారు.

ఎగ్రెసివ్‌ హీరో గోపీచంద్‌ మాట్లాడుతూ - ''ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ దగ్గర్నుండిి అందరూ ఎంతో సపోర్ట్‌ చేశారు. మా సినిమా మంచి హిట్‌ అయ్యింది. నేను చేసిన అన్ని సినిమాల్లో కంటే హైయ్యస్ట్‌ కలెక్షన్స్‌ ఈ సినిమాకి వచ్చాయి. ఒక మంచి కథతో సినిమా చేశాను. చాలా రోజుల తర్వాత పెర్‌ఫార్మెన్స్‌కి స్కోప్‌ వున్న పాత్రల్లో నటించాను. ఫ్రెండ్స్‌ అందరూ ఇరగదీసావ్‌ రా అని మెచ్చుకుంటున్నారు. మా టీమ్‌ అంతా సిన్సియర్‌గా కష్టపడి చేశాం. పైరసీని ఎంకరేజ్‌ చేయొద్దు. థియేటర్‌లో ఈ సినిమా చూడండి. ఎమోషన్‌ సీన్స్‌కి, యాక్షన్‌ సీన్స్‌కి ఎక్కువ రెస్పాన్స్‌ వస్తోంది. మా సినిమా కొత్త వారందరికీ మరిన్ని డబ్బులు రావాలి'' అన్నారు.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved