pizza
Jaya Janaki Nayaka success meet
`జ‌య‌జాన‌కి నాయ‌క‌` స‌క్సెస్ మీట్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

12 August 2017
Hyderaba
d

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ద్వార‌కా క్రియేష‌న్స్ బేన‌ర్‌పై రూపొందిన చిత్రం `జ‌య‌జాన‌కినాయ‌క‌`.బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌కుడు. మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి నిర్మాత‌. సినిమా ఆగ‌స్ట్ 11న విడుద‌లైంది. ఈ సంద‌ర్భంగా శనివారం హైద‌రాబాద్‌లో జ‌రిగిన స‌క్సెస్ మీట్‌లో..

ర‌కుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ - ``చాలా ఎగ్జ‌యిటెడ్‌గా ఉన్నాను. ఆడియెన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారోన‌ని అనుకున్నాను. నేను మ‌ల్టీప్లెక్స్‌లో సినిమ చూసి షాక్ అయ్యాను. మ‌ల్టీప్లెక్స్‌లో ఆడియెన్స్ క్లాప్ కొట్ట‌డం చూశాను. జాన‌కి పాత్ర‌ను ఎంజాయ్ చేశాను. ఆడియెన్స్ నుండి వ‌చ్చిన రెస్పాన్స్ చూసి చాలా హ్యాపీగా ఫీల‌య్యాను. నేను జిమ్‌కు వెళ్లిన‌ప్పుడు ఓ ఆవిడ వ‌చ్చి సినిమా బావుంద‌ని, నేను చ‌క్క‌గా చేశాన‌ని చెప్ప‌డం ఆనందంగా ఉంది.`` అన్నారు.

బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ - ``సినిమా ఇంత పెద్ద హిట్ అవుతుంద‌నుకోవ‌డం లేదు. నిర్మాత రవీంద‌ర్‌గారు మ‌మ్మ‌ల్ని న‌మ్మి సినిమా చేశారు. రివ్యూల‌న్నీ కూడా బావున్నాయి. ఇంత మంచి రేటింగ్ వ‌చ్చిన సినిమాలు త‌ప్ప కుండా పెద్ద హిట్ అవుతాయి. మా సినిమాను ఇలానే ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

Glam galleries from the event

 

ప్ర‌గ్యాజైశ్వాల్ మాట్లాడుతూ - ``చాలా సంతోషంగా ఉంది. ఆడియెన్స్ నుండి సినిమాకు చాలా మంచి స్పంద‌న వ‌స్తుంది. బోయ‌పాటిగారు ఇంత మంచి సినిమాలో అవ‌కాశం ఇచ్చినందుకు ఆయ‌న‌కు థాంక్స్‌. ర‌వీంద‌ర్ రెడ్డిగారు మేకింగ్‌లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాలేదు. సినిమా అంద‌రినీ ఎంట‌ర్‌టైన్ చేస్తుంది`` అన్నారు.

మిర్యాల రవీంద‌ర్ రెడ్డి మాట్లాడుతూ - ``సినిమాను న‌మ్మితే ఎలాంటి ఫ‌లితం ఉంటుందో ఈ సినిమాతో ప్రూవ్ అయ్యింది. ముఖ్యంగా ఓవ‌ర్‌సీస్‌లో మంచి టాక్ ఉంది. వ‌చ్చే వారం 18 నుండి థియేట‌ర్స్ సంఖ్య పెరుగుతుంది. ఇంత మంచి సినిమా నిర్మించినందుకు నిర్మాత‌గా సంతోషంగా ఉన్నాను. తెలుగు ప్రేక్ష‌కుల‌కు పెద్ద థాంక్స్‌`` అన్నారు.

బోయపాటి మాట్లాడుతూ - ``ఆగ‌స్ట్ 11న విడుద‌లైన ఈ సినిమా యూనానిమ‌స్ హిట్ టాక్‌స‌ను సంపాదించుకుంది. చిరంజీవిగారు సినిమా చాలా బావుంద‌ని మెచ్చుకున్నారు. క‌టుంబ సంబంధాలు త‌గ్గిపోతున్న ఈరోజుల్లో ప్రేమ ద్వారా ఈ సినిమాతో చూపించాన‌ని అన్నారు. నేను హైద‌రాబాద్ రాగానే సినిమా త‌ప్ప‌కుండా చూస్తాన‌ని అన్నారు. సినిమా గ్యారెంటీగా సూప‌ర్‌డూప‌ర్ హిట్ అవుతుంద‌ని ముందు నుండే అనుకున్నాం. మంచి ఎమోష‌న్స్ ఉన్న సినిమా తెలుగు ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని మ‌రోసారి ప్రూవ్ చేసుకున్నారు. యునానిమ‌స్ హిట్ ఇచ్చారు.నిర్మాత‌లు ఇచ్చిన స్పేచ్ఛ వ‌ల్లే సినిమాను చ‌క్క‌గా చేయ‌గ‌లిగాను. దేవిశ్రీ అద్భుత‌మైన మ్యూజిక్ అందిచారు. ఆర్‌. ఆర్ మ్యూజిక్‌ను ప్రేక్ష‌కులు ఎంజాయ్ చేస్తున్నారు.సినిమా స‌క్సెస్‌లో భాగ‌మైన అంద‌రికీ థాంక్స్`` అన్నారు.

 


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved