pizza
Meda Meeda Abbayi success meet
`మేడ మీద అబ్బాయి` చిత్రాన్ని ఆద‌రిస్తున్న ప్రేక్ష‌కుల‌కు థాంక్స్ - అల్ల‌రి న‌రేష్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

13 September 2017
Hyderaba
d

అల్లరి నరేష్‌ కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రం 'మేడమీద అబ్బాయి'. ప్రజిత్‌ దర్శకత్వం వహించారు. నిఖిలా విమల్‌ కథానాయిక. జాహ్నవి ఫిల్మ్స్‌ పతాకంపై బొప్పన చెంద్రశేఖర్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్‌ 8న విడుదలైంది. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌క్సెస్‌మీట్‌లో అల్ల‌రి న‌రేష్‌, నిర్మాత బొప్ప‌న చంద్ర‌శేఖ‌ర్‌, హైప‌ర్ ఆది, అవ‌స‌రాల శ్రీనివాస్ పాల్గొన్నారు.

నిర్మాత బొప్పన చంద్ర‌శేఖ‌ర్ మాట్లాడుతూ - ``సినిమాను ప్రేక్ష‌కులు చ‌క్క‌గా ఆదరిస్తున్నారు. సినిమా విడుద‌లైన చోట్ల నుండి పాజిటివ్ టాక్‌తో ర‌న్ అవుతుంది. ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌`` అన్నారు.

హైప‌ర్ ఆది మాట్లాడుతూ - ``చాలా రోజుల త‌ర్వాత న‌రేష్ అన్న సెటిల్డ్ పెర్ఫామెన్స్ చేశారు. కామెడీతో పాటు ఇందులో సోష‌ల్ మీడియాలో ఎదుటి వ్య‌క్తి ఎలాంటి వాడో తెలుసుకోకుండా చాటింగ్ చేయ‌డం వ‌ల్ల ఎలాంటి న‌ష్టం క‌లుగుతుంద‌నే చిన్న మెసేజ్‌ను కూడా ఇచ్చాం. ఈ సినిమా ఇంకా పాజిటివ్ టాక్‌తో ఇంకా పెద్ద స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

అవ‌స‌రాల శ్రీనివాస్ మాట్లాడుతూ - ``ఇదొక డిఫ‌రెంట్ మూవీ అని నేను విడుద‌లకు ముందే చెప్పాను. అందుకే స్లో పాయిజ‌న్‌లా సినిమా పెద్ద స‌క్సెస్ సాధించింది. కొత్త కాన్సెప్ట్ చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని మ‌రోసారి రుజువైంది. న‌రేష్‌గారికి న‌టుడిగా మంచి పేరుని తెచ్చి పెట్టిన చిత్ర‌మిది. ఆది కూడా సినిమా అంతా త‌న‌దైన కామెడీతో మెప్పించి సినిమా స‌క్సెస్‌లో భాగ‌మైయ్యాడు`` అన్నారు.

అల్ల‌రి న‌రేష్ మాట్లాడుతూ - ``విడుద‌లైన అన్నిచోట్ల నుండి సినిమా మంచి టాక్‌తో స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతుంది. సినిమాను ఇంత పెద్ద స‌క్సెస్ చేసిన ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌. స్పూఫ్‌లు ఏవీ లేకుండా క‌థ‌ను, అందులో క్యారెక్ట‌ర్స్, స‌న్నివేశాల కామెడీని ప్ర‌ధానంగా చేసుకుని తెర‌కెక్కించిన చిత్ర‌మిది. సైబ‌ర్ క్రైమ్ ద్వారా ఎలాంటి మోసాలు జ‌రుగుతున్నాయో కూడా ఈ సినిమాలో చిన్న మెసేజ్ ఇచ్చాం. అలాగే నిర్మాత చంద్ర‌శేఖ‌ర్‌గారు ఓన్ రిలీజ్‌కు వెళ్లి సినిమాను విడుద‌ల చేశారు. ఇలాంటి నిర్మాత‌లు ఇండ‌స్ట్రీకి ఎంతో అవ‌స‌రం. ఇలాంటి నిర్మాత‌లుంటే మ‌రిన్ని స‌క్సెస్‌ల‌ను సాధించ‌వ‌చ్చు`` అన్నారు.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved