రానా, కాజల్, కేథరిన్ హీరో హీరోయిన్లుగా సురేష్ ప్రొడక్షన్స్, బ్లూ ప్లానెట్ ఎంటర్‌టైన్మెంట్స్ బేనర్‌పై రూపొందుతున్న చిత్రం `నేనే రాజు నేనే మంత్రి`. ఆగస్టు 11న సినిమా విడుదదల సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో..
పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ - ``సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఈ సినిమా దర్శకుడు తేజ సినిమాకు సంబంధించిన అన్ని విభాగాల్లో పనిచేయగల సమర్ధుడు. తేజ బంగారు పల్లెం వంటి వ్యక్తి. ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్నార్, కాంతారావు వంటి వారు జానపదాలు, హిస్టారిల్, సోషల్ సినిమాలు చేసేవారు. ఈ కాలంలో హీరో రానా అన్ని వర్గాల సినిమాల్లోనూ నటిస్తున్నారు. తేజ, రానా సకల కళావల్లభులు. మేం పనిచేసిన 48వ సినిమా ఇది. మమ్మల్ని కూడా ఈ సినిమాలో ఇన్‌వాల్స్ చేసినందుకు నిర్మాత సురేష్‌బాబుగారికి థాంక్స్. రానాను ఏ కోణంలో చూసిన మంచి నటుడే కనపడతున్నాడు. భార్యను ప్రేమించడం కూడా ఓ లవ్‌స్టోరీ అని ప్రూవ్ చేసిన సినిమాయే ఇది`` అన్నారు.
పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ - ``ఎన్టీఆర్‌గారి తర్వాత మమ్మల్ని ముందు నడిపించిన వ్యక్తి రామానాయుడుగారు. ఈవాళ ఆయన ఉండుంటే ఎంతో ఆనందపడేవారు. ఫస్ట్ వీక్‌లో ఈ సినిమా ఇరవై కోట్లు దాటేస్తుంది. రానా మాకు రామానాయుడుగారే. సినిమా సక్సెస్‌లో భాగమైన అందరికీ థాంక్స్. ఈ విజయాన్ని రామానాయుడుగారికి అంకితమిస్తున్నాం`` అన్నారు.
అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ - ``అందరం ప్రాణం పెట్టి వర్క్ చేశాం. తేజగారు స్క్రిప్ట్ పనిచేయగానే, నాకు ముందు చెప్పారు. సినిమాకు తగిన విధంగా మ్యూజిక్‌ను అందించాను. తేజగారి ద్వారానే నేను తెలుగు చిత్రసీమలోకి పరిచయం అయ్యాను. రానాకు హ్యాట్సాఫ్. ఇది రానాకు ఎంతో స్పెషల్ మూవీ. రానా క్యారెక్టర్ ఎంతగానో నచ్చింది. జోగేంద్ర క్యారెక్టరలో తను జీవించాడు. సినిమా సక్సెస్‌లో భాగమైన అందరికీ థాంక్స్`` అన్నారు.
లక్ష్మీభూపాల్ మాట్లాడుతూ - ``రానా డైలాగ్స్ చెబుతుంటే నోరు తెరుకుని చూస్తుండిపోయాను. రాధా జోగేంద్ర పాత్రలో రానా ఒదిగిపోయాడు. ఇంతటి విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు రుణపడి ఉంటాను`` అన్నారు.
తేజ మాట్లాడుతూ - ``ముందు కథ అనుగోగానే, ముందు రానాను కలిసి కథ చెప్పగానే ఎప్పుడు సినిమా చేస్తున్నాం అన్నారు. అదే స్క్రిప్ట్‌తో సురేష్‌బాబుగారిని కలిస్తే, ఇందులో తప్పులున్నాయి కరెక్ట్ చేసుకుని రా అన్నారు. నాకు కోపం అచ్చినా ఆయన చెప్పింది కరెక్ట్ కదా అనిపించింది. అయితే సురేష్‌బాబుగారితో నాకు నచ్చినట్లు సినిమా చేయడానికి ఒప్పుకుంటేనే నేనుసినిమా చేస్తాను. లేదా చేయను అని అన్నాను. సరే..చేద్దాంలే ముందు కూర్చో అని అన్నారు. కొన్నిసార్లు వారి దారిలోకి నేను వెళితే, కొన్నిసార్లు వారు నా దారిలోకి వచ్చారు.రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఫార్వర్డ్‌గా ఆలోచించి సీన్స్ పెడుతుంటాను. నేను బేసిక్‌గా అగ్రెసివ్ కాబట్టి, హీరోను కూడా అగ్రెసివ్‌గా చూపెడతాను. మార్నింగ్, ఆఫర్ట్‌నూన్ షోస్ చూసే ఆడియెన్స్ కంటే ఈవెనింగ్ వచ్చే ఆడియెన్స్ రియల్‌గా ఆడియెన్స్. పదేళ్లు డిజాస్టర్స్ చేసిన నాకు హిట్ మూవీస్ చేయగలనని తెలిసింది.ప్రతి వ్యక్తికి రెండు షేడ్స్ ఉంటాయి. రెండు ఇమేజ్‌లుండి, ఇంత స్పాన్‌లో ఏ స్క్రిప్ట్‌ను అయినా చేయగల హీరో రానా మాత్రమే. ఇలాంటి హీరోలు మరికొందరుంటే తెలుగు సినిమా బెటర్ అవుతుంది. మన స్టార్ హీరోస్ నెగటివ్ రోల్స్ చేస్తే మనకు నచ్చదు. కారణం వారి ఇమేజ్. రానాకు ఇమేజ్ గొడవలేదు. ఇలాంటి పర్సన్ తెలుగు సినిమాకు ఎంతో అవసరం. ఈ సినిమాకు హీరో వెంకటేష్‌గారే తొలి ఆడియెన్. సినిమా చూసిన ఆయన రాత్రి ఫోన్ చేసి సినిమా అంతా మళ్లీ గుర్తుకు వస్తుంది. సినిమా చాలా బావుంది. రానాకు హిట్ సినిమా ఇస్తున్నందుకు థాంక్స్ అన్నారు. లక్ష్మీభూపాల్ చక్కగా డైలాగ్స్ రాశాడు. అలాగే సినిమాటోగ్రాఫర్ చక్కటి విజువల్స్‌తో సినిమాను తెరకెక్కించారు. కాజల్ ఎంతో చక్కగా నటించింది. ప్రేక్షకులు నేను కూడా హిట్ తీయగలనని నమ్
మకం పెంచారు. ఇకపై హిట్ సినిమాలే తీయడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను`` అన్నారు.
రానా దగ్గుబాటి మాట్లాడుతూ - ``కలెక్షన్స్ చూసి నేను ఎంటి ఇంత బాగా వస్తుందని అనుకున్నాను. రెగ్యులర్ సినిమాకు భిన్నంగా రూపొందిన సినిమా ఇది. తేజగారు, లక్ష్మీభూపాల్, పరుచూరి బ్రదర్స్, అనూప్ సహా అందరూ తమ వంతు సపోర్ట్ చేశారు. కాజల్ చేసిన 50వ సినిమా ఇది. భార్యభర్తల మధ్య ప్రేమ కథను ఇలా చేయడం కొత్తగా అనిపించింది. తెలుగు ఆడియెన్స్ మాత్రమే కొత్త సినిమాలను చూసి ఎంకరేజ్ చేస్తారు. ఈ ఏడాది బాహుబలి2, ఘాజీ, ఇప్పుడు నేనే రాజు నేనే మంత్రి సినిమాతో సక్సెస్ అందుకోవడం ఎంతో ఆనందంగా ఉంది`` అన్నారు.