pizza
U Turn success meet
`యూ ట‌ర్న్‌` స‌క్సెస్ మీట్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us


18 September 2018
Hyderabad

సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘యు టర్న్’. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్, వివై కంబైన్స్ బ్యానర్స్‌పై శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక కీల‌క పాత్ర‌ధారులు. ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 13న విడుద‌లైంది. ఈ సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన స‌క్సెస్ మీట్‌లో ...

నందినీ రెడ్డి మాట్లాడుతూ - ``నేను డైరెక్ట‌ర్ ప‌వ‌న్‌కుమార్‌కి పెద్ద ఫ్యాన్‌ని. త‌న సినిమాల గురించి నేను ఎదురుచూస్తుంటాను. ఆయ‌న తెలుగులోకి ఎంట్రీ ఇవ్వ‌డం ఆనందంగా ఉంది. `యూ ట‌ర్న్` పెద్ద స‌క్సెస్ కావడం ఆనందంగా ఉంది. గ్రేట్ మ్యూజిక్‌. నేప‌థ్య సంగీతం చాలా బావుంది. ఆది పినిశెట్టి, రాహుల్ ర‌వీంద్ర‌న్‌, భూమిక అంద‌రూ వారి వారి పాత్ర‌ల్లో అద్భుతంగా న‌టించారు. స‌మంత ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన‌ప్ప‌టి నుండి నాకు తెలుసు. చాలా హార్డ్ వ‌ర్క‌ర్. త‌న నుండి మ‌రిన్ని విజ‌య‌వంతమైన సినిమాలు రావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.

రాహుల్ ర‌వీంద్ర‌న్ మాట్లాడుతూ - ``ఆడియెన్స్ మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ఆద‌రిస్తున్నారు. అందుకే కొత్త కాన్సెప్ట్స్‌తో నిర్మాత‌లు ముందుకు వ‌స్తున్నారు. అలా విడుద‌లైన యూ ట‌ర్న్ చిత్రాన్ని ఆద‌రించిన తెలుగు ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌`` అన్నారు.

ద‌ర్శ‌కుడు ప‌వ‌న్‌కుమార్ మాట్లాడుతూ - ``పూర్ణ‌చంద్ర సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్‌. నాతో లూసియా సినిమా నుండి వ‌ర్క్ చేస్తున్నారు. నాకు ఎలాంటి మ్యూజిక్ కావాలో దాన్ని అందించ‌డంలో పూర్ణ చంద్ర ఎప్పుడూ స‌క్సెస్ అవుతూ వ‌చ్చారు. తెలుగు నాకు స‌రిగ్గా రాక‌పోయినా నా కో డైరెక్ట‌ర్స్ ఎంత‌గానో స‌పోర్ట్ చేశారు. ఇక స‌మంతగారి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. బెస్ట్ అవుట్‌పుట్ ఇచ్చారు. సినిమాను ఇంత పెద్ద స‌క్సెస్ చేసిన తెలుగు ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌`` అన్నారు.

నిర్మాత‌లు మాట్లాడుతూ `` స‌మంత‌, ప‌వ‌న్‌కుమార్ లేక‌పోతే యూ ట‌ర్న్ మూవీ లేదు. ఇంత పెద్ద స‌క్సెస్ కావ‌డం చాలా హ్యాపీగా ఉంది. ఆరు వంద‌ల థియేట‌ర్స్ సినిమా విడుద‌లైంది. అన్ని చోట్ల నుండి సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వ‌చ్చింది. స‌మంత మా సినిమాను చేయ‌డానికి అంగీక‌రించినందుకు ఆనందంగా ఉంది. అలాగే ప‌వ‌న్‌కుమార్‌గారికి థాంక్స్‌. త‌మిళంలో కూడా సినిమా పెద్ద స‌క్సెస్ అయ్యింది. ఇది రెగ్యుల‌ర్‌కి భిన్న‌మైన చిత్రం. ఆద‌రిస్తున్న అందరికీ థాంక్స్‌`` అన్నారు.

స‌మంత మాట్లాడుతూ - ``సినిమా చాలా బావుంద‌ని క్రిటిక్స్ అంద‌రూ అప్రిషియేట్ చేస్తున్నారు. నా సినిమాల్లో దేనికి ఇంత మంచి రెస్పాన్స్ రాలేదు. మా పంక్ష‌న్‌కి వ‌చ్చిన క‌ల్వ‌కుంట్ల క‌విత‌గారికి థాంక్స్‌. సినిమా నిర్మాత‌లు శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు ఏదో క‌మ‌ర్షియ‌ల్ సినిమా చేయాల‌ని కాకుండా కంటెంట్‌పై న‌మ్మ‌కంతో సినిమా చేశారు. అలాగే డైరెక్ట‌ర్ ప‌వ‌న్‌కుమార్‌కి థాంక్స్‌. ఒకే సినిమాతో తెలుగు, త‌మిళం, క‌న్న‌డ భాష‌ల్లో స‌క్సెస్ అందుకున్నారు. ఆయ‌న‌తో వ‌ర్క్ చేయ‌డం ఎంతో సంతృప్తినిచ్చింది. ఆది, రాహుల్‌, భూమిక‌గారికి థాంక్స్‌. వీరు పిల్ల‌ర్స్‌లా ఎంతో స‌పోర్ట్ చేశారు. ద‌ర్శ‌క‌త్వ శాఖ ఎంత‌గానో స‌హ‌క‌రించారు. నందినీ రెడ్డిగారు కూడా సినిమాకు సంబంధం లేక‌పోయినా త‌ను నాలుగు రోజులు వ‌చ్చి నాతో కూర్చుని స‌పోర్ట్ చేశారు. ఇది ప్రారంభం మాత్ర‌మే. ఇక్క‌డి నుండి ఇంకా మంచి సినిమాలు, గ‌ర్వ‌ప‌డే సినిమాలు చేస్తాను. ఇది సోష‌ల్ మెసేజ్ సినిమా అని అర్థం చేసుకుని అంద‌రూ ఎంక‌రేజ్ చేశారు. అంద‌రికీ థాంక్స్‌`` అన్నారు.

పార్ల‌మెంట్ స‌భ్యులు కె.క‌విత మాట్లాడుతూ - ``యూ ట‌ర్న్ వండ‌ర్‌ఫుల్ మూవీ. ఒక ప‌క్క భ‌య‌పెడుతూనే చాలా మంచి మెసేజ్‌ను ఇచ్చారు. నేను సినిమా చూడ‌లేదు కానీ.. నా పిల్ల‌లు సినిమా చూసి చాలా బావుంద‌ని అన్నారు. పూర్ణ చంద్ర అందించిన సంగీతం చాలా బావుంది. డిఫ‌రెంట్ కాన్సెప్ట్ సినిమాలు చేయ‌డానికి స‌మంత భ‌య‌ప‌డ‌టం లేదు. రంగ‌స్థ‌లంలో త‌ను పోషించిన పాత్ర‌కు.. ఈ సినిమాలో త‌ను పోషించిన పాత్ర‌కు చాలా తేడా ఉంది. త‌ను బ్రిలియంట్ యాక్ట‌ర్‌. త‌ను ప్ర‌త్యూష ఫౌండేష‌న్ ద్వారా సేవా కార్య‌క్ర‌మాలు చేస్తుంది. అంతే కాకుండా తెలంగాణ హ్యాండ్‌లూమ్స్‌కి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తుంది. ఇలాంటి సినిమాలు త‌ను మ‌రిన్ని చేయాల‌ని కోరుకుంటున్నాను. రాహుల్ ర‌వీంద్ర‌న్‌, ఆది పినిశెట్టి, డైరెక్ట‌ర్ ప‌వ‌న్‌కుమార్ కు అభినంద‌న‌లు. కొత్త కాన్సెప్ట్ సినిమాల‌ను ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నారు. ఎంటైర్ యూనిట్‌కు అభినంద‌న‌లు`` అన్నారు.

Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved